రాహల్ గాంధీ సహా ఐదుగురు ఎంపీలపై బీహార్ కోర్టులో పిటిషన్.. ఎందుకంటే?

Publish Date:Aug 7, 2026

Advertisement

 పార్లమెంట్ ఆవరణలో  స్కిట్ చేశారంటూ  లోక్‌సభలో ప్రతిపక్ష నేత  రాహుల్ గాంధీ,  మరో నలుగురు విపక్ష ఎంపీలపై బీహార్‌ కోర్టులో క్రిమినల్ ఫిర్యాదు నమోదైంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభ ప్రాంగణంలో ప్రతిపక్ష నాయకులు ప్రదర్శించిన సొలిటిరల్ స్కిట్ తీవ్ర దుమారాన్ని రేపింది. సనాతన ధర్మ విశ్వాసాలను, భక్తుల మత మనోభావాలను గాయపరిచేలా ఈ ప్రదర్శన ఉందని, కేవలం ప్రచారం కోసమే ఇలా చేశారని ఆరోపిస్తూ..   న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది.

  పార్లమెంట్ ఆవరణలో జులై 31న అయోధ్య రామమందిర విరాళాల కుంభకోణంపై విపక్ష ఎంపీలు వినూత్న నిరసన చేపట్టారు.  ఈ నిరసనలో భాగంగా ఇండిపెండేంట్  ఎంపీ రాజేశ్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ ఒక పూజారి వేషధారణలో  కూర్చిన తన ముందు ఒక  విరాళాల పెట్టెను ఉంచగా, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు భక్తుల రూపంలో వచ్చి ఆ పెట్టెలో డబ్బులు వేస్తున్నట్లుగా.. ఆ డబ్బులను   పూజారి వేషంలో ఉన్న పప్పు యాదవ్   తన జేబులో వేసుకోవడం, దాన్ని పక్కనే ఉన్న మరో ప్రతిపక్ష ఎంపీ ప్రశ్నించడం వంటి సన్నివేశాలను ఆ స్కిట్ లో ప్రదర్శించారు.

అయోధ్య రామమందిరం పేరిట సేకరించిన విరాళాల విషయంలో అక్రమాలు జరిగాయనే అంశాన్ని వ్యంగ్యంగా, నాటకీయంగా చూపించేందుకు వారు చేపట్టిన ఈ వినూత్న నిరసన  రాజకీయ వివాదానికి దారి తీసింది.   రామాలయాన్ని, పూజారి వ్యవస్థను, భక్తుల నమ్మకాలను హేళన చేసేలా ఈ నిరసన ఉందంటూ..  బీహార్‌లోని జమూయి సివిల్ కోర్టులో  ఓ సీనియర్ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.  ఈ పిటిషన్‌లో రాహుల్ గాంధీని ప్రధాన ప్రతివాదిగా చేర్చడంతో పాటు,  ఎంపీ పప్పు యాదవ్, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఎంపీలు అవధేశ్ ప్రసాద్, రుచి వీర,   ధర్మేంద్ర యాదవ్‌లను  ప్రతివాదులుగా చేర్చారు. ఈ ఐదుగురు ఎంపీలు చట్టవిరుద్ధంగా, మతపరమైన భావాలను దెబ్బతీసేలా వ్యవహరించారని పిటిషనర్ పేర్కొన్నారు. 

Rahul Gandhi court complaint, Parliament skit controversy, Bihar Jamui Civil Court case, Ayodhya Ram Mandir donation skit, Opposition MPs court case, Pappu Yadav priest skit

By
en-us Political News

  
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.