Publish Date:Apr 30, 2025
కేంద్ర ప్రభుత్వం కులగణన చేయాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నమని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. కాకపోతే ఎప్పటిలోగా కులగణన చేపడతారో చెప్పాలని రాహుల్ కేంద్రాన్ని ప్రశ్నించారు. కులగణన విషయంలో తెలంగాణ మోడల్ స్టేట్ గా మారిందని పేర్కొన్నారు.“మేమే పార్లమెంట్లో కుల గణన అవసరం అని స్పష్టం చెప్పాం. అలాగే 50 శాతం రిజర్వేషన్ పరిమితిని రద్దు చేయాలని వాదించాం. గతంలో ప్రధాని కేవలం నాలుగు కులాల గురించి మాత్రమే మాట్లాడేవారు. ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు కానీ, 11 ఏళ్ల తర్వాత కుల గణన ప్రకటన వచ్చింది” అని పేర్కొన్నారు.
ఇది కేవలం తొలి అడుగేనని, కేంద్రం కుల గణనకు తమ మద్దతు ఉందని, బీహార్ మాదిరిగానే తెలంగాణ కూడా ఒక ఉదాహరణగా నిలుస్తుందన్నారు. కుల గణన ద్వారా రిజర్వేషన్ల పరిమితికి మించిన అభివృద్ధి మోడల్‌ను అభివృద్ధి చేయాలనేదే తమ లక్ష్యమని తెలిపారు. దేశంలో ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు ఎంత మేరకు వాటాదారులై ఉన్నారో తెలుసుకోవడానికి కుల గణన కీలకమని అన్నారు.ఇక ఉగ్రవాదంపై కేంద్రం మరింత కఠినంగా వ్యవహరించాలని రాహుల్ గాంధీ కోరారు. పెహల్గామ్ దాడికి పాల్పడిన దుండగులు తగిన మూల్యం చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. “ఉగ్రవాదంపై పోరాటానికి మా మద్దతు ఉందని రాహుల్ పేర్కొన్నారు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rahul-gandhi-25-197251.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.