స్వోత్కర్ష: పరనింద.. జగన్ కు తెలిసిందిదేనా.?
Publish Date:Nov 6, 2026
Advertisement
ఏపీ మునిసిపల్ ఎన్నికల ఫలితాలు వైసీపీకి బిగ్ షాక్ అనడంలో సందేహం లేదు. అలాగే గురువారం (నవంబర్ 5) జరిగిన పరిషత్ ఎన్నికలలో కూడా వైసీపీ చేతులెత్తేసినట్లేనని జగన్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన తీరును బట్టి పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కింద పడ్డా పై చేయి నాదేనని చాటుకోవడానికి జగన్ పడుతున్న తాపత్రేయం ఆయన ఓటమిని అంగీకరించేశారనడానికి నిదర్శనంగా వారు చూపుతున్నారు. పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. గత రెండేళ్లుగా అంటే 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా దారుణ ఓటమి తరువాత నుంచీ ఏం చెబుతున్నారో, తాజాగా స్థానిక సమరంలో ఓటమి తరువాతా అదే చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార యంత్రాంగం వ్యవహరించిన తీరును ఆయన తప్పుపట్టారు. ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సిన ఎన్నికలలో అధికార పార్టీ యంత్రాంగం అక్రమాలకు పాల్పడిందని, నిబంధనలను తుంగలో తొక్కి తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు అడ్డదార్లు తొక్కిందనీ ఆరోపించారు. అదే సమయంలో తన హయాంలో 2021లో జరిగిన స్థానిక ఎన్నికల గురించి లేశమాత్రమైనా ప్రస్తావించలేదు. ఇది కూడా చదవండి: నేను గానీ, ఒక్క సైగ గానీ చేస్తే.. ప్రత్యర్థులకు జగన్ వార్నింగ్.! ఇక తాజాగా జగన్ గురువారం (నవంబర్ 5) మీడియా సమావేశంలో మాట్లాడిన దానిని బట్టి, ఓటమి తప్పదన్న నిర్ణయానికి ముందే వచ్చేసి, ఆ ఒటమి నెపాన్ని పోలీసులు, ప్రభుత్వం, ఎన్నికల సంఘంపై నెట్టేసి నైతిక విజయం తమదేనని చెప్పుకోవడానికి వృధా ప్రయత్నం చేశారని అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పరిషత్ ఎన్నికలలో కనీసం పరువు దక్కే అవకాశాలే లేవన్న అంచనాతో జగన్ బెదరింపులకు తెగించారు. నిరాశా వాదం, నిర్హేతుక వాదనలతో జగన్ తన ప్రెస్ మీట్ ముగించారు. మొత్తంగా స్థానిక సమరంలో పార్టీ పరాజయానికి అధికార తెలుగుదేశం కూటమి కారణమంటూ నెపాన్ని నెట్టేసి, ప్రెస్ మీట్ మొత్తాన్నిస్వోత్కర్ష, పరనిందలకు పరిమితం చేశారు. కాగా ఓ వైపు జగన్ ప్రభుత్వ అధికార దుర్వినియోగం పై ప్రసంగిస్తుంటూ.. స్థానిక ఓటమిని శిరసావహిస్తున్నామనీ, వైసీపీపై ప్రజా వ్యతిరేకతకు ఈ ఫలితాలు నిదర్శనమనీ వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మరో ప్రెస్ మీట్ లో కుండబద్దలు కొట్టారు. పార్టీ తీరు ఇలాగే ఉంటే ఏ ఎన్నికలోనైనా ఇదే ఫలితం పునరావృతమౌతుందనిఅంగీకరించారు. మీకు నచ్చవచ్చు: [Jagan Press Meet on Municipal Results, Parishad Polls, Andhra Pradesh Political News, Telugu One]
మునిసిపోల్స్ లో ప్రజాతీర్పును అంగీకరించే సాహసం చేయలేని జగన్.. మొత్తంగా ఎన్నికల ప్రక్రియపైనే బురద జల్లే ప్రయత్నం చేశారు. అసలు ఇవి ఎలక్షన్లే కావని, ఇవన్నీ కేవలం సెలక్షన్లు మాత్రమేనంటూ వితండ వాదానికి తెరలేపారు. తన హయాంలొ నామినేషన్లు కూడా వేయనివ్వకుండా బలవంతపు ఏకగ్రీవాలతో అరాచకం సృష్టించిన చరిత్రను కన్వీనియెంట్ గా మరిచిపోయారు.
http://www.teluguone.com/news/content/jagan-press-meet-on-municipal-results-25-236467.html





