రఘువీర హౌజ్ అరెస్ట్.. తాళ్లతో కట్టేసి..బంధించి..
Publish Date:Nov 2, 2021
Advertisement
బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది. బ్రేకింగ్ కంటే షాకింగ్ ఎక్కువ ఈ న్యూస్‌లో. మాజీ మంత్రి, మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిని ఆయన ఇంట్లోనే బంధించేశారు. హౌజ్ అరెస్ట్ చేశారు. ఇంటి పిల్లర్‌కు తాళ్లతో రఘువీరాను కట్టేశారు. ఆయన చేతులు మూసుకొని మౌనంగా భరిస్తున్నారే కానీ ఎదురు తిరిగి మాట్లాడటం లేదు. తననెందుకు ఇలా బంధిస్తున్నావంటూ నిలదీయలేదు. రఘువీరారెడ్డిని ఇలా తాళ్లతో కట్టేసి..బంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ పోస్ట్‌పై చాలా చాలా కామెంట్లు కూడా వస్తున్నాయి. ఇంతకీ అక్కడ అసలేం జరిగింది? రఘువీరాను ఇలా తాళ్లతో కట్టేసి బంధించింది ఎవరు? అంత పెద్ద స్థాయి లీడర్‌ను అలా కట్టేసే అంత సాహసం చేసిందెవరు? అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఈ ఫోటోను కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే.. తనను ఇలా తాళ్లతో బంధించడాన్ని రఘువీరా సైతం బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు లేదు? అలా బంధించినందుకు ఆయన ముఖంలో కోపం కంటే.. ఆనందమే ఎక్కువ కనిపించడం లేదు? అందుకు కారణం.. రఘువీరాను అలా పిల్లర్‌కు కట్టేసింది ఏ ప్రత్యర్థులో గిట్టనివారో కాదో.. ఆయన ఇంటి వారే. రఘువీరాకు ప్రియాతిప్రియమైన ఆయన మనవరాలు సమైరా. ఆ చిన్నారే తాతను ఇలా తాళ్లతో కట్టేసింది. ఇలా ముచ్చట తీర్చుకుంది. ఇంతకీ పెద్దాయన మనవరాలు సమైరా తాతను అలా ఎందుకు బంధించిందో తెలుసా? తనతో ఆడుకోవడానికి రఘువీరా టైమ్ ఇవ్వడం లేదట. తనకు కుదరదంటూ ఎప్పటికప్పుడు తప్పించుకుంటున్నారట. దీంతో.. తాతా.. ఇంతపనికొస్తావా అంటూ.. ఉండు నీ సంగతి చెబుతానంటూ.. తాడు తెచ్చి స్తంభానికి కట్టేసింది ఆ చిన్నారి సమైరా. తాత ఎక్కడికీ వెళ్లిపోకుండా ఆయన్ను అలా బంధించి.. ఎంచక్కా ఆయనతో ఆడుకుందట ఆ మనవరాలు. ఈ విషయం తెలుపుతూ.. ఈ ఫోటోను రఘువీరానే ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ పిక్ చూసి నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
http://www.teluguone.com/news/content/raghuveera-reddy-house-arrest-photo-goes-viral-39-125672.html





