కొండగట్టు, కోనసీమ ఓ పవన్ కళ్యాణ్?
Publish Date:Jan 3, 2026
Advertisement
కొండగట్టు ఆంజనేయుడి గుడికి పవన్ ద్వారా భారీ విరాళం. ఆ భూరి విరాళంతో ఆలయంలో అభివృద్ధి పనులకు ఆయనే స్వయంగా శంకుస్థాపన చేయడం..ప్రస్తుతం ఈ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆంజనేయ స్వామి వారంటే పవన్ కి ఎందుకంత ఇష్టం? అని చూస్తే.. పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా ఆంజనేయ స్వామి వారు కొణిదెల కుటుంబానికి కులదైవం. అందుకు నిదర్శనంగా పవన్ కల్యాణ్ నామధేయంలోని పవన్ ఆంజనేయ స్వామి వారిపేరు. ఔను పవన సుత హనుమాన్ అని కూడా ఆంజనేయుడ్ని పిలుస్తుంటారు భక్త జనం. వాయుపుత్రుడాయన. అంటేపవన్ కల్యాణ్ పేరులో సగం ఆంజనేయస్వామి ఉన్నారు. ఇక పవన్ తల్లి పేరు అంజనా దేవి. ఆ పేరులోనూ ఆంజనేయుడు ఉన్నారు. అందుకే కొండగట్టు తెలంగాణాలో ఉన్న కోవెల అయినా.. పవన్ తన పరపతి ఉపయోగించి.. టీటీడీ నుంచి సుమారు 36 కోట్ల రూపాయల విరాళం ఇప్పించారు. ఈ మొత్తం ద్వారా.. భక్తుల వసతి కోసం 90 గదుల ధర్మశాల, ఆపై ధీక్ష విరమణకు వీలుగా ఉండేందుకు మరో భవనం నిర్మాణానికి పవన్ స్వయంగా శంకుస్థాపన చేశారు. అదే బీఆర్ఎస్ గతంలో ఇదే కొండగట్టు ఆలయానికి వంద కోట్ల మేర నిధులు ప్రకటించి ఇవ్వలేదు. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పవన్ కల్యాణ్.. ఇచ్చిన మాట నిలబెట్టుకునే విషయంలోనూ, దైవ భక్తికి రాష్ట్రాల హద్దులు ఉండవని చాటడంలోనూ ముందున్నారు. పవన్ ఏపీకి చెందిన రాజకీయ నాయకుడైనా.. తెలంగాణలోని కొండగట్టుకు విరాళం ఇప్పించడం పట్ల ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ హర్షం వ్యక్తం అవుతోంది. తెలంగాణ వాసులు అయితే మరో అడుగు ముందుకేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో విఫలమైన బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు కూడా. పవన్ కల్యాణ్ గతంలో ఇక్కడి నుంచే తన వారాహీ వాహన యాత్రను లాంఛనంగా మొదలు పెట్టారు. అదీ హనుమంతుల వారిపై ఆయనకు ఉన్న భక్తి. అది పక్కన పెడితే ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. గతంలో ఆయన కోనసీమలో కొబ్బరి రైతులు నష్టాలు పాలుకావడంపై మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల దిష్టి తగిలిందని చేసిన కామెంట్లు దుమారం రేపిన సంగతి తెలిసిందే. పవన్ యాంటీ తెలంగాణ అన్న మాట కూడా అప్పట్లో గట్టిగా వినిపించింది. అదే ఇప్పుడు తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవమైన కొండగట్టు హనుమన్న ఆలయానికి కోట్ల రూపాయల విరాళం వచ్చేలా చేసి.. తనపై వచ్చిన యాంటీ తెలంగాణ కామెంట్స్ ని చెరిపేసుకున్నారు పవన్ కల్యాణ్ అంటూ సోషల్ మీడియాలో నెటిజనులు పేర్కొంటున్నారు.
http://www.teluguone.com/news/content/pwan-kalyan-arises-anti-telangana-image-on-him-45-211960.html




