దొంగే దొంగా దొంగా అని అరచినట్లుగా జగన్ తీరు!
Publish Date:Jan 2, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు దొంగే దొంగ దొంగ అని అరిచిన చందంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం కేసులో ఇప్పటికే వైసీపీ నాయకులు పలువురు పీకలోతు ఇరుక్కున్నారు. కొందరు అరెస్టయ్యారు కూడా. మరి కొందరు విచారణలను ఎదుర్కొంటున్నారు. సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తును ప్రత్యేక సిట్ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తు జగన్ సన్నిహితులనే కాదు జగన్ ను కూడా వణికిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల ప్రసాదాల తయారీలో నాణ్యతా లోపం అంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ వెనుక ఉన్నది వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలు తిరుమల ప్రసాదాల తయారీలో నాణ్యతా లోపంపై పిటిషన్ దాఖలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాలి. కానీ తాజాగా తెలంగాణలో పిటిషన్ దాఖలైంది. ఔను తిరుమల ప్రసాదాల తయారీలో నాణ్యతా లోపం అంటూ పిటిషన్ దాఖలు కావడం వినడానికి ఆశ్చర్యకంగా ఉన్నావాస్తవం. ఆగమశాస్త్రం ప్రకారం స్వామివారికి నైవేద్య సంతర్పణ జరగడం లేదన్నది ఈ పిటిషన్లోని ప్రధానాంశం. పిటిషన్ తరఫు సుశీలారాం అనే న్యాయవాది వాదనలు వినిపించారు. గతంలో టీటీడీ ఆమోదించిన తీర్మానాలను ఈ బోర్డు తుంగలో తొక్కిందన్నది మరో ప్రధాన ఆరోపణ. అయితే ఈ వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొయినుద్దీన్ తో కూడిన ధర్మాసనం విషయాన్ని టీటీడీ దృష్టికి తీసుకెళ్లారా? అని ప్రశ్నించింది. దీనిపై తాము మౌఖికంగా టీటీడీ బోర్డుకు విన్నవించినట్టు చెప్పారు పిటిషనర్ కే. శివకుమార్. భక్తుల విశ్వాసాలను పరిగణలోకి తీసుకుని.. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవల్సిందిగా కోరారు పిటిషనర్. అయితే ఈ పిటిషన్ పట్ల కోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో కోర్టు పటిషన్ విచారణార్హతపై తన నిర్ణయం వాయిదా వేసింది. వైవీ సుబ్బారెడ్డి, భూమన వంటి అన్యమతస్థులను టీటీడీ బోర్డు చైర్మన్లుగా నియమించిన జగన్.. అలాగే శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం, శాలువాల కుంభకోణం, శ్రీవాణి టికెట్లకు లెక్కలు చూపక పోవడం, పరకమాణి చోరీ, స్విమ్స్ ఆస్పత్రుల్లోని మెడికల్ షాపుల నుంచి నెలకు రూ. 40 లక్షల మేర వసూలు చేయడం ఇలా ఎన్నోఅవకతవకలు జగన్ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ పిటిషన్ దాఖలు కావడంపై సర్వత్రా విస్మయం, ఆగ్రహం వ్యక్తమౌతోంది. అన్నదానంలో నాసిరకం సరుకులు, క్యూలైన్లలో భక్తులకు ఇవ్వాల్సిన సాంబార్ రైస్, పెరుగన్నం, పాలు వంటివి ఇవ్వకుండా ఆపడం.. వంటి పలు సంఘటనలు జరిగింది జగన్ హయాంలోనే కదా అని భక్తులు కూడా అంటున్నారు. కొండ మీదే కాదు కొండ కింద గోవిందరాజుల స్వామి వారి ఆలయ గోపుర బంగారు తాపడంలోనూ తమ చోర బుద్ధి చాటింది జగన్ అండ్ కో. ఈ మొత్తం గోపుర తాపడంలో 69 కోట్ల విలువైన బంగారం కొట్టేసినట్టు తేలింది. ఇదే గోపురంపై ఉన్న ముప్పై రెండు విగ్రహాల విధ్వంసానికి కూడా కారకులవడం మరో అపచారం.. ఇక వరాహ స్వామి వారి గోపురం బంగారు తాపడంలో లిక్విడ్ రూపంలోనూ బంగారం కొట్టేయడం వంటి ఎన్నో కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. బ్రిటిషర్ల హయాంలో కూడా తిరుమల వేంకటేశ్వరుడి విషయంలో ఇలా అపచారాలు జరగలేదని పండితులు అంటున్నారు. అయితే జగన్ హయాంలో మాత్రం తిరుమల పవిత్రతను మంటగలిపేలా అపచారాలు జరిగాయని అంటున్నారు. ఆ అరాచకాలన్నీ ఒక్కటొక్కటిగా ఇప్పుడు బయట పడుతుం డటంతో.. హిందూ ఓటు బ్యాంకు దూరమైపోతోందన్న భయంతోనే జగన్ తిరుమల పవిత్రత విషయంలో ఎక్కడ లేని అక్కరా కనబరుస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. తన హయాంలో చేయాల్సిందంతా, చేయగలిగినంతా చేసి ఇప్పుడు తగుదునమ్మా అంటూ శ్రీవారికి ఆగమశాస్త్రం ప్రకా రం నైవైద్య నివేదిన జరగడం లేదంటూ కోర్టును ఆశ్రయించడం వెనుక ఉన్నది కేవలం రాజకీయమే కానీ, శ్రీవారిపై భక్తితో కాదని అంటున్నారు.
నిజానికి కమిషన్ల కక్కుర్తితో తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగనే వెనకుండి తెలంగాణ హైకోర్టులో ఇలా ఎదురు పిటిషన్ వేయించడమేంటన్న విస్మయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. జగన్ హయాంలో తిరుమల కేంద్రంలో సర్వ అనర్ధాలూ జరిగాయన్న విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక పరకామణి చోరీ వ్యవహారంలో ఫిర్యాదు దారుడైన ఏవీఎస్వో సతీష్ హత్య జగన్ హయాంలో తిరుమలలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, తిరుమల పవిత్రతను దెబ్బతీసే చర్యలూ యథేచ్ఛగా జరిగాయనడానికి నిదర్శనంగా చెబుతున్నారు పరిశీలకులు. ఆయన హయాంలో తిరుమలలో జరిగిన అపచారాలే.. కనీసం విపక్ష హోదా లేకుండా వైసీపీ ఘోర పరాజయం కావడానికి కారణమని శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. జగన్ హయాంలో తిరుమల కేంద్రంగా జరిగిన అక్రమాల సంగతి కాసేపు పక్కన పెట్టి.. తెలంగాణ హైకోర్టులో తిరుమల ప్రసాదాల నాణ్యతపై దాఖలైన పిటిషన్ లోని అంశాలను గమనిస్తే..
http://www.teluguone.com/news/content/petition-in-telangana-high-court-claiming-tirumala-srivari-prasada-nivedana-45-211889.html





