పులివెందులలో జగన్ మకాం: అడ్డాను రక్షించుకునే యత్నాలు.. మునిసిపోల్ రణరంగమేనా.?

Publish Date:Oct 29, 2026

Advertisement

ఏపీలో ఆదివారం (నవంబర్ 1)  మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిలో తాడోపేడో తేల్చుకునేందుకు పార్టీలు, అభ్యర్ధులు సన్నద్ధమయ్యారు. తెలుగుదేశం కూటమి ఇప్పటికే పలు చోట్ల ఏకగ్రీవంగా విజయం సాధించింది. జగన్ అడ్డా పులివెందులలో కూడా అదే పరిస్థితి. అయితే జగన్ సొంత గడ్డ పులివెందుల మునిసిపాలిటీని దక్కించుకునేందుకు వైసీపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబ అడ్డా అయిన మునిసిపాలిటీలో  తెలుగుదేశం జెండా ఎగరనీయకూడదన్న పట్టుదలతో ఉన్న జగన్.. పులివెందులలోనే మకాం వేశారు. మున్సిపాలిటీని చేజిక్కించుకునేందుకు కూటమి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు స్వయంగా నడుంబిగించారు.  ఇప్పిటికే పులివెందుల మునిసిపాలిటీలోని సగం వార్డులను తెలుగుదేశం కూటమి ఏకగ్రీవంగా గెలుచుకుని సత్తా చాటింది.  మిగిలిన వాటి కోసం వైసీపీ, జగన్ పోరాడుతున్నారు. 

సాధారణంగా అయితే అక్కడ ఎన్నిక జరుగుతోంది. ఓటర్లు గెలుపోటములు నిర్ణయిస్తారు. కానీ పులివెందుల మాత్రం సెపరేట్. అది జగన్ కంచుకోట.   అలింటి కంచుకోటలో తెలుగుదేశం పాగా వేస్తే.. ఆ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా 2029 ఎన్నికలపై పడుతుందన్నది జగన్ భయం. ఇప్పటికే గంలో పులివెందుల జడ్పీటీసీకి జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డిపాజిట్ కూడా దక్కకుండా ఘోర పరాజయాన్ని చవి చూశారు. దీంతో ఎది ఏమైనా, ఏం చేసైనా పులివెందుల మునిసిపాలిటీని దక్కించుకోవాలని జగన్ పట్టుదలగా ఉన్నారు.  

దీంతో పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు. మునిసిపోల్ లో ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేసే పరిస్థితి కల్పించడమే లక్ష్యంగా పోలీసులు సర్వ సన్నద్ధంగా ఉన్నారని పరిశీలకులు చెబుతున్నారు.  


[Pulivendula Municipal Elections,  Jagan Pulivendula, YCP Baston Pulivendula, Andhra Pradesh Politics, Tension  Pulivendula, Telugu One]

By
en-us Political News

  
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కేరళలోని కొచ్చిలో సంచలనం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదం కేసు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
మహా న‌గ‌రం హైద‌రాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.