తుపాను వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు

Publish Date:Oct 28, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పంటలు, ఆస్తులు నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. నష్టాన్ని క్షేత్రస్థాయిలో సమగ్రంగా అంచనా వేసి, బాధితులకు అవసరమైన సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

మూడు రోజుల్లో ఏడు సమీక్షలు.. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ.!

తుఫాను ప్రభావంపై మూడు రోజుల్లో ఏడు సమీక్షలు నిర్వహించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ (ఆర్టీజీఎస్) ద్వారా జిల్లా కలెక్టర్లు, క్షేత్రస్థాయి అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇచ్చినట్లు వెల్లడించారు. ముందస్తు చర్యలతో నష్ట తీవ్రతను తగ్గించగలిగామని చెప్పారు.

లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలించి, వారికి ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు అందించేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి గ్రామ, వార్డు స్థాయి సిబ్బంది వరకు రాత్రింబవళ్లు పనిచేశారని, వారందరినీ అభినందిస్తున్నానని సీఎం పేర్కొన్నారు.

తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు.!

అర్నబ్ తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర నుంచి కృష్ణా జిల్లా వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. విశాఖపట్నంలో 21 సెంటీమీటర్లు, విజయనగరంలో 18 సెంటీమీటర్లు, శ్రీకాకుళంలో 14 సెంటీమీటర్లు, కృష్ణా జిల్లాలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సీఎం వెల్లడించారు.

తుఫాను ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని, రహదారులు దెబ్బతిన్నాయని తెలిపారు. కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా మిగతా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు చెప్పారు. రహదారులపై పడిపోయిన చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు.

ప్రాణనష్టంపై సీఎం సంతాపం.!

తుఫాను సమయంలో జరిగిన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. హుద్‌హుద్, తిత్లీ వంటి గత తుఫానుల అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని, ఈసారి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ముందస్తు చర్యలు చేపట్టినట్లు వివరించారు.

పంట నష్టంపై సమగ్ర అంచనా.!

తుఫాను, భారీ వర్షాల కారణంగా వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయి. వరి సహా పలు పంటలు నీటమునిగినట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా తీరప్రాంత జిల్లాల్లో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు.

ప్రాథమిక అంచనాల ప్రకారం వ్యవసాయ పంటలు సుమారు 70,900 హెక్టార్లలో, ఉద్యాన పంటలు మరో 10,450 హెక్టార్లలో ప్రభావితమైనట్లు సీఎం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ గణాంకాలు ప్రాథమికమైనవని, క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం మారే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. 

రైతులు, బాధితులకు సహాయం అందిస్తాం.!

తుఫాను కారణంగా పంటలు, ఇళ్లు, ఆస్తులు నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. నష్టాన్ని పారదర్శకంగా అంచనా వేసి, అర్హులైన బాధితులకు నిబంధనల ప్రకారం సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

తుపాను మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, ఇళ్లు దెబ్బతిన్న బాధితులకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తాం. శిబిరాల్లోని బాధితులకు రూ.1000 చొప్పున రూ.మూడు వేల వరకు సాయం చేస్తాం. కిరాణా దుకాణాలు, రెస్టరంట్లు దెబ్బ తింటే రూ.25 వేలు, రూ.40 లక్షల లోపు టర్నోవర్‌ ఉన్న ఎంఎస్‌ఎంఈలకు రూ.50 వేలు, రూ.40 లక్షల నుంచి రూ.కోటిన్నర లోపు టర్నోవర్‌ ఉన్న వాటికి రూ.లక్ష, రూ.కోటిన్నరకు పైగా టర్నోవర్‌ ఉన్న ఎంఎస్‌ఎంఈలకు రూ.1.5 లక్షల సాయం అందిస్తామని సీఎం తెలిపారు.

 ద్విచక్ర వాహనం దెబ్బతింటే రూ.3 వేలు, త్రిచక్ర వాహనానికి రూ.10 వేల సాయం, దెబ్బతిన్న ఫిషింగ్‌ బోట్లకు రూ.9 వేలు, వలల మరమ్మతులకు రూ.5 వేలు, వలలు ఉన్న ఫిషింగ్‌ బోటు దెబ్బతింటే రూ.25 వేల సాయం చేస్తాం’’ అని చంద్రబాబు తెలిపారు. తుఫాను కారణంగా పంటలు, ఇళ్లు, ఆస్తులు నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. నష్టాన్ని పారదర్శకంగా అంచనా వేసి, అర్హులైన బాధితులకు నిబంధనల ప్రకారం సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

తుఫాను నష్టంపై సమగ్ర నివేదిక సిద్ధం చేసిన అనంతరం కేంద్ర ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలిపారు. నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలను త్వరగా పంపించాలని కూడా అమిత్ షాను కోరారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్, తాగునీరు, రహదారుల పునరుద్ధరణతో పాటు బాధిత కుటుంబాలకు సహాయం అందించడమే ప్రస్తుతం ప్రభుత్వ ప్రాధాన్యమని సీఎం పేర్కొన్నారు. సాధారణ పరిస్థితులు పూర్తిగా నెలకొనే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

 

 

 

[ Arnab cyclone, Cyclone Arnab Damage AP crop compensation, cyclone relief package, CM Chandrababu Naidu, agriculture loss aid, Andhra Pradesh storm, Cyclone Victims, Cyclone Relief Measures, Crop Damage, Farmers Compensation, Cyclone Damage Assessment, Andhra Pradesh News, AP Cyclone Alert ]


 

By
en-us Political News

  
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కేరళలోని కొచ్చిలో సంచలనం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదం కేసు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
మహా న‌గ‌రం హైద‌రాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
ప్రభుత్వ కార్యాలయాల గోడలపై ఎక్కడ చూసినా ఒకే నినాదం కనిపిస్తుంది.. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
రాష్ట్రంలో అర్నబ్ తుపాను ప్రభావంతో పరిస్థితులు తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
పులివెందుల నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దశాబ్దాల కాలంగా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఏకపక్షంగా జగన్ కు పట్టుఉన్న నియోజకవర్గం పులివెందుల. అటువంటి పులివెందులలో ఎంపీటీసి జడ్పీటీసి స్థానాలను టీడీపీ  ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.