సీఎం రేవంత్‌రెడ్డికి సదర్ ఉత్సవాల ఆహ్వానం. !
Publish Date:Oct 28, 2026
Advertisement
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే నెల 4న హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్న సదర్ ఉత్సవాలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. సదర్ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి కమిటీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు .ఈ కార్యక్రమంలో శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, యాదాద్రి బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్, మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. [ Sadar Festival, CM Revanth Reddy,Sri Krishna Sadar Sammelan, Sadar Utsav 2026, NTR Stadium Hyderabad, Telangana State Festival, Anjan Kumar Yadav, Anil Kumar Yadav, Naveen Yadav, Eshwaramma Yadav, Vajresh Yadav, Jubilee Hills, Hyderabad News, Telangana News, Sadar Festival Invitation, Telangana Government, Yadav Community Festival, Sadar Utsav Committee ]
http://www.teluguone.com/news/content/sadar-festival-25-235699.html





