భూ ఆక్రమణ కేసులో వంశీకి మరో రిమాండ్ !

Publish Date:Mar 19, 2025

Advertisement

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని  పీటీ వారెంట్ పై  పోలీసులు విజయవాడ సబ్ జైలు నుండి గన్నవరం కోర్టులో హాజరు పరిచారు. అత్కూరు పోలీసు స్టేషన్ పరిధిలో వంశీపై నమోదైన భూ అక్రమణ కేసులో ఈ పీటీవారెంట్ జారీ అయ్యింది. పటిష్ట బందోబస్తు మధ్య వంశీని పోలీసులు గన్నవరం కోర్టుకు తీసుకు వచ్చారు.  అత్కూరు పీఎస్ లో నమోదైన కేసుకు సంబంధించి వచ్చే నెల 1 వరకూ వంశీకి కోర్టు రిమాండ్ విధించింది. దీంతో వంశీని తిరిగి విజయవాడ సబ్ జైలుకు తరలించారు. 

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైఎస్ హయాంలో అడ్డగోలుగా, ఇష్టానుసారంగా రెచ్చిపోయి చేసిన ఆక్రమణలు, దౌర్జన్యాలకు ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి బెదరించిన కేసులో అరెస్టైన వంశీపై వరుసగా కేసులు నమోదౌతున్నాయి. ఆయా కేసులలో వంశీకి కోర్టు   రిమాండ్ విధిస్తోంది.

తాజాగా  బెదిరించి భూమిని విక్రయించారనే ఆరోపణలతో  వంశీపై   ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీసుస్టేషన్‌‌లో నమోదైన కేసులో రిమాండ్‌ విధిస్తూ గన్నవరం కోర్టు తీర్పును వెల్లడించింది.   గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసులలో కూడా వంశీ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం వంశీ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న సంగతి విదితమే. వంశీకి ఇప్పటికే రెండు రిమాండ్‌లు ఉండగా.. ఇది మూడో రిమాండ్‌.  కాగా వల్లభవనేని వంశీపై పలు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం  వాటిపై దర్యాప్తునకు సిట్ వేసిన సంగతి తెలిసిందే.   వంశీ అక్రమాలపై సిట్ దర్యాప్తు  కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వంశీపై మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది.  

By
en-us Political News

  
రా బిడ్డా.. అసెంబ్లీకి’.. KTRకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్.!
భారతీయ రైల్వేలో ప్రయాణం చేయడానికి ప్రయాణికులు చాలా కాలం ముందే టికెట్లను రిజర్వ్ చేసుకుంటూ ఉంటారు.
తండ్రి అంటే పిల్లలకు ఉండే ప్రాణం, ఆప్యాయత ఎంతో గొప్పవి. కానీ ఆ ప్రేమ కొన్నిసార్లు ఊహకందని వింత నిర్ణయాలకు దారితీస్తుంది.
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో తీవ్ర కలకలం రేపిన ఉదంతంలో ఒకరు దారుణ హత్యకు గురయ్యారు.
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
జమ్మూకశ్మీర్‌‌లోని కతువా జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్‌ నగరంలోని నిమ్స్‌ అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నోరి లక్ష్మీ భాస్కర్‌పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తును ముమ్మరం చేసింది.
హైదరాబాద్‌లోని టెక్ హబ్ మాదాపూర్‌లో జరిగిన ఒక సంచలన ఘటన కలకలం రేపింది.
దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది
డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. పబ్‌కు తీసుకెళ్లి రూ.29 వేల బిల్లు.!
హైదరాబాద్ నగరంలోని ఎస్‌ఆర్‌ నగర్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపిన ఒక విషాదకర ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోయింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.