ట్రంప్ కు నిరసనల సెగ

Publish Date:Mar 29, 2026

Advertisement

అమెరికా అధ్యక్షుడికి ఆ దేశంలో నిరసనల సెగ తగిలింది. ట్రంప్   యుద్ధ కాంక్ష, దూకుడు రాజకీయాలు వంటి విధానాలకు వ్యతిరేకంగా అమెరికాలో నిరసన జ్వాలలు ఎగస పడుతున్నాయి. ఒక్క అమెరికాలోనే కాకుండా ఐరోపా వ్యాప్తంగా కూడా లక్షల మంది రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు.  ఐరోపాలోని పలు ప్రధాన నగరాల్లో శనివారం లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు.  నో కింగ్స్ పేరుతో చేపట్టిన ఈ ఉద్యమంలో   90 లక్షల మంది స్వచ్ఛందంగా పాల్గొన్నారు. 

అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాల్లో నో కింగ్స్ నిరసనలు వ్యక్తం అయ్యాయి. నగరాలు, పట్టణాలూ అన్న తేడా లేకుండా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. మొత్తంగా అమెరికాలో 3 వేల ప్రాంతాలలో నిరసనకారులు భారీ ర్యాలీలు నిర్వహించారు.  ట్రంప్  వలస విధానాలు, ఇతర దేశాలపై యుద్ధ ప్రకటనలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమంటూ నినాదాలు చేశారు.  ప్లకార్డులు ప్రదర్శించారు. 
 అమెరికా,  లండన్, పారిస్, రోమ్ వంటి   నగరాల్లోనూ ట్రంప్ కు వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు.  ఇరాన్‌పై దాడులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచ శాంతికి విఘాతం కలిగించేలా అమెరికా నిర్ణయాలు ఉండకూడదని నినదించారు. 

మునుపెన్నడూ లేని విధంగా జనం నో కింగ్స్  ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నియంతృత్వ పోకడలకు చోటు లేదని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నడుచుకోవాలని అల్టిమేటమ్ ఇచ్చారు.   ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ప్రజా వ్యతిరేకతపై వైట్ హౌస్ స్పందన తెలియాల్సి ఉంది.  నిరసనకారులకు  ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభించడంతో ట్రంప్ తన   విధానాలపై పునరాలోచన చేయక తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముందు ముందు ఈ నిరసనలు అన్ని దేశాలకూ విస్తరించే అవకాశం ఉందంటున్నారు.  

By
en-us Political News

  
హైదరాబాద్‌లోని మియాపూర్ హఫీజ్‌పేట్‌లో ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ చేతిలో 27 ఏళ్ల లేడీ డాక్టర్ సృజన హత్యకు గురైన దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు పోలీసుల దర్యాప్తు నివేదిక.
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తామంటూ ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న దళారీల దందా వెలుగులోకి వచ్చింది. యూనియన్ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి విచారణ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ సాగరిక ఇంటెగ్రేటెడ్ హైస్కూల్‌లో రాఖీలు, తిలకం తొలగింపు వివాదంపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టీచర్‌ను హిజాబ్‌‌పై ప్రశ్నించడం సంచలనంగా మారింది. పోలీసులు కార్పొరేటర్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించిన భర్త శ్రీనివాస్‌ను భార్య రమాదేవి గొడ్డలితో నరికి చంపింది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సీఐఎస్ఎఫ్ క్యాంపులో హెడ్ కానిస్టేబుల్ ఏకే 47 రైఫిల్‌తో చేసిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనపై సీఐఎస్ఎఫ్ డీజీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ఒడిశా తాల్చేర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్ మాధాపూర్‌లో స్పా సెంటర్ ముసుగులో నడుస్తున్న అక్రమ వ్యభిచార రాకెట్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మట్టుబెట్టారు. నలుగురు యువతులను రక్షించి, రూ. 45 వేల నగదు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యాదాద్రి భువనగిరి జిల్లా చల్లూరులో భూభారతి వెబ్‌సైట్ ద్వారా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే 7.18 ఎకరాల భూమి వేరొకరి పేరు మీదకు మారిపోయింది. యజమానులకు తెలియకుండా జరిగిన ఈ భారీ భూ భాగోతం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఏపీ సచివాలయ ఉద్యోగాలు, డీఎస్సీ నియామకాలు మరియు మెడికల్ సీట్లలో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల అక్రమాలపై విచారణ ముమ్మరమైంది. హైకోర్టు ఆదేశాలు, విజిలెన్స్ తనిఖీలు మరియు సాప్ చేపట్టిన స్కిల్ టెస్ట్ వివరాలు ఇక్కడ చూడండి.
150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వందేమాతరం గేయానికి జాతీయ గీతంతో సమాన హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ తెచ్చింది. 3 నిమిషాల 10 సెకన్ల ఆలాపన, సుప్రీంకోర్టు విచారణ మరియు చట్టపరమైన నిబంధనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్ రాయదుర్గంలో ఐటీ కంపెనీ మహిళా ఉద్యోగిపై ఫుడ్ వెండర్ షేక్ నబీ కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడి చేశాడు. ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ రూ. 43 లక్షలు నొక్కేసి మూడేళ్లు వేధించిన నిందితుడిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడ ఎన్‌టీపీఎస్ కాలువలో లభించిన మహిళ శరీర భాగాల మిస్టరీ వీడింది. చేతిపై ఉన్న ఈక టాటూ ఆధారంగా మృతురాలిని మంగళగిరికి చెందిన 29 ఏళ్ల కళ్యాణిగా గుర్తించిన పోలీసులు, విచారణలో మటన్ షాప్ షఫీ చేసిన కిరాతక హత్యను ఛేదించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.