ఖమ్మం సభకు ప్రియాంక!

Publish Date:Jun 8, 2023

Advertisement

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని హస్తం పార్టీ ఇచ్చినా.. కొట్లాడి తెచ్చింది మాత్రం నేనేనంటూ బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ బహిరంగంగానే ప్రకటించారు. అలా ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన క్రెడిట్ కొట్టేసి.. వరుస ఎన్నికల్లో  విజయం సాధించి అధికారంలో  కొనసాగుతున్నారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి  కూడా ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అయితే తెలంగాణలో  కేసీఆర్ రాజకీయానికి సంపూర్ణంగా చెక్ పెట్టేందుకు ఢిల్లీ నుంచి తెలంగాణ గల్లీలోని హస్తం పార్టీ నేతల వరకు అంతా ప్రణాళికబద్దంగా పావులు కదుపుతున్నారు. 

ఆ క్రమంలో ఈ నెల 25వ తేదీన  ఖమ్మం నగరంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేపట్టింది. అదీకాక ఇదే ఉమ్మడి జిల్లాలోని మధిర శాసనసభ్యుడు మల్లు భట్టి విక్రమార్క.. పీపుల్స్ మార్చ్ పేరుతో చేపట్టిన పాదయాత్ర ముగియనుంది. ఈ సందర్భంగా ఈ సభను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సభకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలు వస్తారని అంటున్నారు. రాహుల్ వచ్చినా రాకున్నా  ప్రియాంకా గాంధీ మాత్రం పక్కాగా ఈ సభకు వచ్చే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ శ్రేణులు గట్టిగా చెబుతున్నాయి. 

ఎందుకంటే.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అక్కడి ఓటర్లు స్పష్టమైన మెజార్టీ కట్టబెట్టారు. అదే విధంగా ఈ ఏడాది చివరిలో జరగనున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ప్రియాంకా గాంధీ సుడిగాలి పర్యటనలు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అందులోభాగంగా మధ్యప్రదేశ్‌లోని జబల్ పూర్‌లో ఈ నెల 12వ తేదీన ఆమె ప్రచార ఘట్టానికి శ్రీకారం చుట్టున్నారని... ఆ క్రమంలో ఖమ్మం వేదికగా జరిగే సభలో పాల్గొంటారని సమాచారం. మరోవైపు ఇదే వేదికపైన .. అదే జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొల్హాపూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు   హస్తం గూటికి చేరనున్నారని తెలుస్తోంది. 

ఇంకోవైపు జూన్ 11 లేదా 12వ తేదీన ఢిల్లీలోని హస్తం పార్టీ అధిష్టానంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నాయకులు భేటీ అయి.. రాష్ట్రంలో పార్టీ  విజయం కోసం అమలు చేయాల్సిన అంశాలు.. అలాగే ప్రజల్లోకి ఏ ఏ అంశాలు బలంగా తీసుకు వెళ్లాలి తదితర అంశాలతోపాటు పలు కీలక అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.  

 రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు  తెలంగాణలో   ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. అలాగే ప్రియాంక గాంధీ సైతం.. తెలంగాణలో పాదయాత్ర నిర్వహించే అవకాశం ఉందనే చర్చ సైతం జరుగుతోంది.

ఇక తెలంగాణలో పీసీసీ పగ్గాలు రేవంత్ రెడ్డి చేపట్టిన తర్వాత.. పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్తుందని.. అందుకు ఆయన చేపడుతోన్న సభలు, బహిరంగసభకు భారీగా ప్రజలు పోటెత్తుతోన్న సంగతి తెలిసిందే. అయితే రానున్న తెలంగాణ ఎన్నికలు మాత్రం చాలా రసవత్తరంగా మారనున్నాయనేది సుస్పష్టమని తెలంగాణలోని పోటిలికల్ సర్కిల్‌లో చర్చ అయితే ఇప్పటికే ఊపందుకొంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో కూడా వరుసగా గెలిచి.. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని కారు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అయితే కేసీఆర్ పాలనకు చెక్ పెట్టి దక్షిణాదిలో.. అదీ తెలంగాణలో పాగా వేసి... తమ సత్తా చాటుకోవాలని బీజేపీలోని కాషాయం పార్టీ నేతలు... తమ వ్యూహాలకు పదును పెడుతూ.. ఈ రాష్ట్రంలో గెలుపు కోసం తమ వంతు ప్రయత్నాలకు ఇప్పటికే శ్రీకారం చుట్టారు. 

అయితే రాష్ట్ర విభజనతో ఆంధ్రాలో పార్టీ పరిస్థితి పాతాళంలోకి పడిపోతోందని తెలిసినా.. తెలంగాణలో మాత్రం అధికారం నిలుపుకుంటామని.. హస్తం పార్టీ అధిష్టానం కలలు కన్నది. కానీ ఆ కలలను... నాటి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కల్లలు చేశారు. దీంతో తమ పార్టీ అధిష్టానం కన్న కలను సాకారం చేసేందుకు తమ వంతు ప్రయత్నాన్ని అయితే హస్తం పార్టీ నేతలు శ్రీకారం చుట్టారు. మరోవైపు రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ఎన్నికల్లో సైతం సత్తా చాటిన తెలుగుదేశం.. 2019 ఎన్నికల్లో మాత్రం అంతగా సత్తా చాట లేకపోయింది. అయితే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌ పార్టీగా అవతరించిన తర్వాత.. తెలంగాణలో టీడీపీ సైతం సూపర్ స్పీడ్‌తో సైకిల్ సవారీ చేస్తుంది. ఆ క్రమంలో 2022 డిసెంబర్‌లో తెలంగాణ టీడీపీ ఆధ్వర్యంలో ఖమ్మం వేదికగా నిర్వహించిన శంఖారావ సూపర్ సక్సెస్ అయింది. 

ఆ తర్వాత అంటే  2023, జనవరిలో కారు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సైతం ఖమ్మంలో భారీ సభ చేపట్టి గ్రాండ్ సక్సెస్ అయ్యారు. అయితే మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సైతం ఖమ్మం వేదికగా సభ నిర్వహించి.. సత్తా చాటనుంది. మరి అలాంటి వేళ.. కాషాయం పార్టీ నేతలు సైతం....ఖమ్మం వేదికగా.. సభ నిర్వహించినా నిర్వహించవచ్చుననే అభిప్రాయం సైతం పోలిటికల్ సర్కిల్‌లో ఓ టాక్ అయితే హల్ చల్ చేస్తోంది.   

అన్ని పార్టీలు ఇలా ఖమ్మం వేదికగా.. బహిరంగ సభలు నిర్వహించినా.. ఓటర్లు మాత్రం ఒకే ఒక్క పార్టీకే మేజార్టీ స్థానాలు కట్టబెతారనేది సుస్పష్టం. అలాంటి వేళ.. అదీ ఏ పార్టీ అంటే మాత్రం.. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెలువడే వరకు వేచి చూడాల్సిందేనన్నది సుస్పష్టం.

By
en-us Political News

  
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్నికేంద్ర హోంమంత్రికి వివరించిన సీఎం రేవంత్.. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ, పరిశ్రమల వృద్ధి దృష్ట్యా రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని, తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కోరారు.
సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ కొనసాగుతున్నది. సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు.
కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు. నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.
వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి వివాహానికి జనగ్ ను బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు.
ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే మండలి సభ్యత్వానికి వారు చేసిన రాజీనామాలను చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు.
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే, తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు, ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు.
జగన్ హయాంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్న మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా 198 సాగునీటి ప్రాజెక్టులకు ప్రీ-క్లోజర్ ఇస్తే, వాటిలో 102 ప్రాజెక్టులు రాయలసీమలోనే ఉన్నాయని గుర్తుచేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.