డామిట్ .. థర్టీ ఇయర్స్ స్టోరీ అడ్డం తిరింగింది

Publish Date:Jun 20, 2022

Advertisement

టాలీవుడ్ నటుడు, ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృథ్వీ రాజ్ గుర్తున్నారుగా? అవును, ఆ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి గురించే, మనం ఇప్పుడు మాట్లాడుకుంటోంది.2019 ఎన్నికలకు ముందు  వైసీపీలో  చేరిన ఆయన, కొద్ది కాలం పాటు ఆ పార్టీలో ఓ వెలుగు వెలిగారు. అ ఎన్నికలలో  పార్టీ గెలుపు కోసం,చాలాచాలా కష్ట పడ్డారు. జగన్మోహన్ రెడ్డిని వేనోళ్ళ పొగుడుతూ, ఉరూరా తిరిగారు. పార్టీ ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. పనిలో పనిగా,  తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్’ గా విమర్శలు గుప్పించారు. నోరుంది ఎందుకంటే, రాజకీయ ప్రత్యర్ధులను విమర్శించే అందుకే  అన్నట్లు విరుచుకు పడ్డారు. ఆయన ప్రచారం పనిచేసిందో, రాష్ట్ర ప్రజల దురదృష్టమో కానీ, ఆ ఎన్నికలో వైసీపీ విజయం సాధించింది. జగన్మోహన్  రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 

సహజంగానే, పార్టీ కోసం అంతగా కష్టపడిన పృద్వీ’ జగనన్న తనను అందలం ఎక్కిస్తారని ఆశపడ్డారు. అయితే ఆయన ఏమి ఆశ పడ్డారో, ఏమి ఆశించారో ఏమో కానీ, జగన్ రెడ్డి ఆయనకు మరీ మొండి చేయి చూపించకుండా, ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవితో సరిపెట్టారు.ఇక అక్కడి నుంచి పృద్వీ మరింతగా రెచ్చిపోయారు. ప్రతి పక్ష పార్టీల నాయకులను ఎంత పెద్దగాతిడితే, అంతగా ముఖ్యమంత్రి దృష్టిలో పడొచ్చని. మరో మెట్టు ఎక్కచ్చని అనుకున్నారో ఏమో కానీ, ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవిని అడ్డు పెట్టుకుని ప్రతిపక్షాలపై విమర్శలతో విరుచుకు పడ్డారు. చివరకు, అమరావతి రైతుల ఆందోళలోనూ వేలు పెట్టారు. సినిమా కూతలు కూశారు. అమరావతి రైతుల ఉద్యమంపై థర్టీ పృథ్వీ చేసిన డర్టీ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైయ్యాయి.అయినా అయన ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ప్రతిపక్షాలపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. అయితే, పృద్వీ ఎస్వీబీసే వైభోగం మూడు నాళ్ళ ముచ్చటగా ముగిసి పోయింది. 

ఒక మహిళకు ఉద్యోగితో అసభ్యంగా మాట్లాడిన వాయిస్ రికార్డులు బయటకు రావటంతో ఎస్వీబీసీ ఛైర్మన్‌ బాధ్యతల నుండి తప్పించారు. ఇక అంతే, అక్కడి నుంచి థర్టీ ఇయర్స్’ కు కష్టాలు మొదలయ్యాయి. ఒకసారి ఎస్వీబీసీ నుంచి  గెంటేసిన తర్వాత, వైసీపీలో ఆయన్ని పట్టించుకున్నవారు లేరు. మరో వంక నడమంత్రపు సిరి శాశ్వతం నుకుని రెచ్చి పోయి వెనకా ముందు చూసుకోకుండా, చిందులేసిన పాపానికి ఆయన్ని ఇండస్ట్రీ కూడా వదిలేసింది. అదేదో ముతక సామెతలో చెప్పినట్లుగా, ఉన్నదీ పోయి, ఉంచుకున్నడీ పోయి, పృద్వీ రోడ్డున పడ్డారు. కొంచెం ఆలస్యంగానే అయినా, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి తత్త్వం బోధపడినట్లుంది. అప్పట్లోనే తనపై సొంత పార్టీ వాళ్లే కుట్రపన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు పృథ్వీ, ఇప్పడు   పక్క చూపులు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ పంచన చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గురించి ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ రెండు చోట్లా ఓడిపోయారు., గెలవలేకపోయారని అంటున్నారని.. కానీ ఈసారి ఆ పరిస్థితి ఉండదు ... 2024 ఎన్నికలలో  జనసేన 40కి పైగా స్థానలలో విజయం సాధిస్తుందని భవిష్యవాణి వినిపిస్తున్నారు. అయితే, గతంలో ఇదే పృద్వీ అందరి కంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ పైనే వ్యక్తిగత విమర్శలు గుప్పించారని, జనసేన నాయకులు గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో రాజకీయాల్లో ఇవ్వన్నీ మాములే ... ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకత్వాన్ని సమర్ధించడంతో పాటు ప్రత్యర్ధి పార్టీలను విమర్శించక  తప్పదని ,అందుకు మంత్రి రోజానే, నిదర్శనం అంటున్నారు.

నిజమే, టీడీపలో ఉన్నప్పడు రోజా .. జగన్ రెడ్డినే కాదు, వైఎస్’ను కూడా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టినా వీడియోలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి.  కానీ, ఇప్పడు ఆమె జగన్ రెడ్డికి  సొంత చెల్లెలు కంటే ఎక్కవ .. అయితే, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ స్టొరీ కొంచెం  డిఫరెంట్ అంటున్నారు. ఇప్పటికైతే పృద్వీ కథ విషాదపు మలుపులో వుంది .. భవిష్యత్ ఎలా ఉంటుందో .. ఏమలుపు తిరుగుతుందో చూడవలసి ఉందని ఆయన సన్నిహితులు అంటున్నారు.

By
en-us Political News

  
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్‌ ద్వారానే ఇంటర్నెట్‌ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి.  మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి.  ఈ ఫలితాలు కేవలం  ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి. 
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. 2015లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో  అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి.
భోగాపురం విషయంలో వైసీపీ అధినేత జగన్.. ఒకే సమయంలో క్రెడిట్ చోరీకీ, విమానాశ్రయం సాకారం కావడం పట్ల విమర్శలకు పాల్పడటం అపహాస్యం పాలౌతోంది.
దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్ కావేరి వివాదంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కావేరి జలాలు తమిళనాడుకు అత్యంత కీలకమనీ, ఇతర రాష్ట్రాల వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏకాభిప్రాయ సాధన అవసరమని అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.