Publish Date:Jun 20, 2022
క్షణానికో మాట మాట్లాడేవారితో స్నేహం కష్టమే. పూటకో విధంగా వ్యవహరించేవారి దోస్తానా ప్రమాదకరమే! ఈ రెండు అంశాలూ ఇప్పడు నప్పేది జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కే! కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాలు ఆయన వ్యక్తం చేస్తున్న భిన్నాభిప్రాయా లతోనే ముడిపడ్డాయి. ఇంతకీ ఆయన మనసులో ఏముంది? పొత్తుల విషయంలో స్పష్టత లేని డైలాగులు ఎవరు రాసిస్తున్నారు వంటి పలు అనుమానాలు ఏపీలో అన్ని వర్గాలకూ, పార్టీలకూ వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే జనసేన లక్ష్యమన్న పవన్.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వబోమని అన్నారు. వైసీపీని ఓడించేందుకు పొత్తులకు సిద్ధమనే సంకేతం ఇచ్చారు. పవన్ వ్యాఖ్యలను స్వాగతిస్తూ టీడీపీ నేతలు మాట్లాడటం.. త్యాగాలకు సిద్ధమంటూ టిడిపి అధినేత చంద్రబాబు కామెంట్ చేయడం తో ఏపీలో పొత్తులు ఖాయమనే ప్రచారం సాగింది.
ప్రస్తుతం ఏపీలో బీజేపీ- జనసేన మిత్రపక్షాలుగా ఉన్నాయి. వైసీపీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా వున్న జనసేన అందుకు ఏ పార్టీతో నైనా కలిసేందుకు రెడీ అన్నారు పవన్. అయితే పవన్ చంద్రబాబు దత్తపుత్రుడని వైసీపీ ఆరోపిస్తోంది. జనసేన నేతలు తమ అధినేతను సీఎంగా చేసేట్టయితే ఏ పార్టీతోనైనా ముందడుగు వేస్తామని అసలు సంగతి బయటపెట్టారు. ఎందుకంటే వేరెవరికో మద్దతునిచ్చి గెలిపించగల సత్తా వున్నప్పుడు పీఠం ఎక్కేందుకు అవకాశాలను లాక్కోవాలని తమకూ వుంటుందని వారి అభిప్రాయం. కానీ ఈ విషయమై టిడీపీ మౌనం వహించింది.
రాజకీయాల్లో ఎంతో అనుభవం వున్న వ్యక్తి, ముఖ్యమంత్రిగా చేసి జనాదరణ పొందిన చంద్రబాబు ఈ పర్యాయం ఘన విజయం సాధించి సీఎం అవుతారన్న మాట అంతటా వినపడుతు న్నపుడు పవర్ స్టార్ వీరాభిమానులు, ఆయన పార్టీవారి మాటను పట్టుకుని చేతులు కలుపుతారని ఎవ్వరూ అనుకోరు. కాబోతే జనసేనతో పొత్తు ఆశిస్తున్న టీడీపీ కి జనసేన అధినేత పొత్తు ఈసారి కుదరకపోవచ్చునని అనడం ఓట్ల చీలికకే ఆయన అడుగులు అన్నది అర్ధమ యింది. మరోసారి వైసీపీకి ఛాన్స్ ఇస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని పవన్ అన్నారు. గత పాలకులను చూసిన ప్రజలు జన సేనకు ఒకసారి అధికారం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారని పవన్ వ్యాఖ్యానిం చారు. ప్రస్తుతం పొత్తులపై మాట్లాడబోనన్న జన సేన చీఫ్ తన పొత్తులు జనంతోనే ఉంటాయన్నారు.
గతంలో వైసీపీని ఓడిం చేందుకు విపక్షాలు ఏకం కావాలనే సంకేతం ఇచ్చిన పవన్.. ఇప్పుడు మాత్రం ప్రజలతోనే పొత్తు ఉంటుందని చెప్పడం చర్చగా మారింది. అంతేకాదు జనసేనకు అధికారం ఇవ్వాలని జనాలు కోరుకుంటున్నారంటూ పరోక్షంగా తానే సీఎం అభ్యర్థిని అనడం కాస్తంత హాస్యపూరితమయిన మాట! మరోవైపు పొత్తు విషయంలో టీడీపీ త్యాగం చేయాల్సి ఉంటం దన్న పవన్ వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సెటైర్లు వేశారు. ఇది కూడా పవన్ యూటర్న్ తీసుకోవ డానికి కారణమనే ప్రచారం సాగుతోంది. ఈ విధంగా పూటకో మాటను ఏదో ఆదేశిస్తున్నట్టు అనడం, ఎవరిచేతనయినా అనిపిం చడం వల్ల స్నేహం చేద్దామని దగ్గరికి వచ్చే వారికంటే జనసేన నేతకే నష్టం. పాపం ఆయనకు ఈ సంగతి ఎవరు చెప్పుతారో!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pawan-cm-dreams-spoil-alliance-chances-39-138076.html
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే.. క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. 2015లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి.