పంజాబ్ లో రాష్ట్రపతి పాలన? సీఎస్, డీజీపీకి కేంద్రం పిలుపు...

Publish Date:Jan 6, 2022

Advertisement

ప్రధాన మంత్రి నరేందర్ మోడీ పంజాబ్ పర్యటనలో  చోటు చేసుకున్న భద్రతా లోపాలపై దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. మరో వంక  రాజకీయ రచ్చ కొనసాగుతోంది. చర్చ  జరుగుతోంది. ముఖ్యంగా ప్రధాని భద్రత విషయంలో పంజాబ్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, బీజేపీ నాయకులు ఆరోపిస్తునారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ ఆడుతున్న రాజకీయ డ్రామాగా కొట్టివేస్తున్నారు. మరో వంక పంజాబ్ మాజీ డీజీపీ, ఎస్పీజీ మాజీ డైరెక్టర్ సహా  పలువురు భద్రతా వ్యవహరాల నిపుణులు పంజాబ్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే, ప్రధాని భద్రతలో లోపం జరిగిందని అంటున్నారు. ప్రభుత్వం  ‘తప్పు’ చేసిందని చాలా స్పష్టంగా చెపుతున్నారు. అంతేకాదు పంజాబీ డీజీపీ, ప్రధాన కార్యదర్శిని ఢిల్లీకి పిలిపించింది కేంద్ర హోంశాఖ. దీంతో పంజాబ్ విషయంలో కేంద్ర సర్కార్ సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. 

పంజాబ్ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ, అమరవీరులకు నివాళులు అర్పించేందుకు  బఠిండా విమానాశ్రయం నుంచి ఫిరోజ్’పుర్ వెళుతున్న సమయంలో, ఆ దారిలోని  ఫ్లై ఓవర్ ... పై పీఎం కాన్వాయ్ 20 నిముషాలు నిలిచి పోయింది. ఆ తర్వాత ప్రధాని తిరిగి బఠిండా విమానశ్రయం చేరుకొని అక్కడి నుంచి ఢిల్లీ తిరిగి వెళ్ళిపోయారు. ఇది ఎలా చూసినా, అనూహ్యపరిణామం. అయితే అదే సమయంలో సంఘటన పూర్వాపరాలను పరిశీలిస్తే, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటనే తప్ప యాదృచ్చికంగా జరిగిన సంఘటన కాదని, చాలా స్పష్టంగా అర్ధ మవుతుందని అంటున్నారు.  

ప్రధాని రాష్ట్రానికి అధికార పర్యటనకు వచ్చినప్పుడు... ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ విమానాశ్రయంలో స్వాగతం పలకడం ప్రాధమిక  ప్రోటోకాల్ నిబంధన. కానీ, పంజాబ్ ముఖ్యమంత్రి చన్నీ, విమానాశ్రాయానికి వెళ్ళలేదు. ప్రధానికి స్వాగతం పలకలేదు. అలాగే, సీఎస్, డీజీపీ కూడా ప్రోటోకాల్ పాటించలేదు. అదేమంటే ముఖ్యమంత్రి, కొవిడ్ కారణంగా చూపించారు. ఇటీవల తాను కొవిడ్ పేషెంట్’ను కలిశానని అందుకే, ప్రధానికి స్వాగతం చెప్పేందుకు వెళ్లలేదని సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. కానీ, వాస్తవంలో ఆయన ఒక టీవీ చానల్’కు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఇలా ముఖ్యమంత్రి ఎందుకు అబద్ధం చెప్పవలసి వచ్చిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

ప్రధాని అంతర్గత భద్రాతను చూసే ఎస్పీజీకి, రాష్ట్ర డీజీపీ, రోడ్డు మార్గంలో వెళ్లేందుకు క్లియరెన్స్ ఇచ్చారు. క్లియరెన్స్ ఇచ్చిన తర్వతా కూడా, ప్రధాని కాన్వాయ్’ని   20 నిముషాలు నిరసన కారులు ఆపివేయగలిగారంటే, అదులో ‘ఉద్దేశపూర్వక’ , ‘కుట్ర కోణం’ దాగుందని, అంటున్నారు. అయితే, పంజాబ్ ముఖ్యమంత్రి, ఇంత జరిగితే అసలు ఏమీ జరగనట్లు విచారంతో సరిపెట్టారు.  

యూత్ కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుర్జిత్ సింగ్, సుర్జేవాలా, ప్రధాని భద్రతా విషయంలో జరిగిన లోపాన్ని, నాటకంగా వర్ణించడం, రాజకీయ కోణంలో విమర్శలు చేయడం పంజాబ్ ప్రభుత్వం, దురుద్దేశాలను మరింతగా దృవీకరిస్తున్నాయి. ఆలాగే, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్, పాకిస్థాన్ సారిహద్దుల్లో డ్రోన్స్ సంచరిస్తున్నాయని,  ఉగ్రవాదుల ద్వారా సరిహద్దుల్లో హింసను ప్రేరేపించేందుకు  ఆయుధాలు, మాదక ద్రవ్య్యాలు, డబ్బు సంచులు జారావిడుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన నేపధ్యంలో, పంజాబ్ ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోలేదని స్పష్టమవుతోందని అంటున్నారు.అదే విధంగా ప్రధాని బందోబస్తుకు 10,000 మంది  భద్రతా సిబ్బందిని డిప్లాయ్ చేశామని చెపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం 100 మంది నిరసన కారులను అదుపు చేయలేక పోయిందా, అనే ప్రశ్న కూడా వినవస్తోంది. 

ఇక ఈ పరిస్థితిలో  కేంద్ర ప్రభుత్వం, రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో   ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ముఖ్యమంత్రి చన్నీ ప్రభుత్వాన్నిడిస్మిస్ చేస్తుందా? రాష్ట్రపతి పాలన విదిస్తుందా? అనేది చూడవలసి వుందని అంటున్నారు.

By
en-us Political News

  
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు.
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్‌పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
ఈ వివాదం కాస్తా ముదరడంతో తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ ఒంటరిగానైనా బరిలోకి దిగుతుందని, అవసరమైతే ఏ పోరాటానికైనా తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను టచ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో.. పవన్ కళ్యాణ్ ఈ సవాల్‌ను స్వీకరించడం సంచలనం సృష్టించింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై కేవలం 80 స్థానాలకే పరిమితమైన టీఎంసీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అసమ్మతి గళాలు రోడ్డెక్కాయి. పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మెజారిటీ టీఎంసీ నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. గడిచిన 15 ఏళ్లుగా బెంగాల్‌ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన దీదీ, ఇప్పుడు సొంత పార్టీపై పట్టు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు.
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది.
రాష్ట్రంలో ఎన్నికల అనంతర పరిణామాలు, జాతీయ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి.
ఆయనను బీజేపీ హైకమాండ్ ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. అప్పటి నుంచీ పార్టీ హైకమాండ్ పై అసంతృప్తితో ఉన్న అన్నామలై సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఉద్దేశంలో ఉన్నారంటూ, గత కొంత కాలంగా వార్తలు వినవస్తున్నాయి.
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బెంగళూరు నగరాభివృద్ధి శాఖ తనకు కేటాయించకపోవడమే ఆయన అసంతృప్తికి కారణమని తెలుస్తోంది. మీడియా ఎదుటే ఆయన తన రాజీనామా లేఖపై సంతకం చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.