పీకేతో రేవంత్ రెడ్డి మంత్రాంగం.. గులాబీ బాస్ లో కలవరం!

Publish Date:Sep 11, 2021

Advertisement

అసెంబ్లీ ఎన్నికలకు రెండేండ్లకు పైగా సమయం ఉన్నా తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. జనంలో ఎక్కువగా ఉండేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కు త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో సత్తా చాటి.. అధికారం దిశగా అడుగులు వేయాలని విపక్షాలు భావిస్తున్నాయి. అదే సమయంలో విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా కొత్త పథకాలు తీసుకొస్తున్నారు సీఎం కేసీఆర్. హుజురాబాద్ లో ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టుగా అమలవుతున్న దళిత బంధును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి... ఆ వర్గం ఓట్లను గంపగుత్తగా తమ ఖాతాలో వేసుకోవాలనే ప్లాన్ చేస్తున్నారు గులాబీ బాస్. 

తెలంగాణలో ప్రస్తుత రాజకీయాలన్ని దళిత బంధు కేంద్రంగానే సాగుతున్నాయి. దళిత బంధుకు తమకు అస్త్రంగా పనికొస్తుందని టీఆర్ఎస్ భావిస్తుండగా... అదే పథకం ద్వారా అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి విపక్షాలు. నిజానికి దళిత ఓటు బ్యాంక్ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కొంత టీఆర్ఎస్ కు మెజార్టీ వచ్చినా... ఇప్పటికి ఆ వర్గంలో కాంగ్రెస్ పార్టీకి పట్టుంది. దళిత బంధుతో ఆ వర్గాన్ని తమనుచి పూర్తిగా లాగేయాలని కేసీఆర్ ప్లాన్ చేశారని భావిస్తున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. మరో దారిలో నరుక్కొస్తున్నారు. ఆయన కూడా దళితుల లక్ష్యంగానే తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పటికే దళిత గిరిజన దండోరాలతో జనంలోకి వెళుతున్న రేవంత్ రెడ్డి... కేసీఆర్ కు కలవరం పుట్టించేలా ఎత్తులు వేస్తున్నారని తెలుస్తోంది.

దళిత సామాజిక వర్గంలో మంచి పట్టున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటీవలే ఐఏఎస్ కు గుడ్ బై చెప్పి బీఎస్పీలో చేరారు. బహుజనవాదంతో బీఎస్పీ బలోపేతం కోసం జిల్లాలు చుట్టేస్తున్నారు.  ప్రవీణ్ కుమార్ కు దళితులు, బీసీ వర్గాల నుంచి మంది స్చందనే వస్తోంది. ఉద్యోగులు, విద్యావంతులు ఆయనకు మద్దతుగా ఉంటున్నారు. కేసీఆర్ తీసుకొచ్చిన దళితు బంధుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు పీకే.  దీంతో పీకే కేంద్రంగా రాజకీయ వ్యూహాలు పన్నుతున్నారు రేవంత్ రెడ్డి. దళిత వర్గంలో మంచి పట్టున్న పీకేతో కలిసి నడిచేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పీకే సారథ్యంలోని బీఎస్పీతో కాంగ్రెస్ పొత్తు ఉండేలా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే ప్రవీణ్ కుమార్ తో రేవంత్ రెడ్డి చర్చలు జరిపారని అంటున్నారు. పీకే నుంచి సానుకూలత వచ్చిందని అంటున్నారు.

ఇటీవలే పీసీసీ ముఖ్య నేతలంతా ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన భేటీలో తెలంగాణ ప్రస్తుత రాజకీయాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారట. రాహుల్ సమావేశంలోనే పీకే అంశం ప్రస్తావనకు వచ్చిందని అంటున్నారు. దళిత వర్గంలో పట్టున ప్రవీణ్ కుమార్ తో కలిసి పోతే లాభం ఉంటుందనే అభిప్రాయమే వ్యక్తమైందట. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మహా కూటమి ఏర్పాటు చేసింది. సో వచ్చే ఎన్నికల్లోనూ బీఎస్పీతో పొత్తుకు పెద్దగా ఇబ్బంది ఉండదని నేతలు చెప్పారట. దీంతో తెలంగాణలో బీఎస్పీతో పొత్తుకు రాహుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. రాహుల్ నుంచి సిగ్నల్స్ రావడంతోనే.. రేవంత్ రెడ్డి దూతగా  కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్.. ప్రవీణ్ కుమార్ ను కలిసి చర్చించారని అంటున్నారు. 

ప్రవీణ్ కుమార్ తో సమావేశం తర్వాత అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యల్లోనూ  రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయనే సంకేతమే ఇచ్చారు.  కాంగ్రెస్, బీస్పీల మధ్య తేడా లేదని.. భవిష్యత్ లో తామిద్దరూ కలిసి పనిచేయవచ్చని దయాకర్ అన్నారు. అద్దంకి దయాకర్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ తో కలిసి పనిచేసేందుకు ప్రవీణ్ కుమార్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇక ఈ పరిణామాలతో టీఆర్ఎస్ పార్టీలో ఆందోళన నెలకొందని చెబుతున్నారు. బీఎస్పీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే.. తమకు భారీగా నష్టం జరుగుతుందనే అంచనాలో గులాబీ బాస్ ఉన్నారట. పీకే కాంగ్రెస్ తో కలిసి పోతే దళిత బంధు వంటి పథకాలతోనూ తమకు ప్రయోజనం కల్గదనే కలవరంలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.