Publish Date:Jun 19, 2025
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి మానసిక పరిస్థితి సరిగాలేక గంజాయి బ్యాచ్ ను, ఉన్మాదులను, బెట్టింగులకు పాల్పడే నేరగాళ్లను కలుస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఓటమి తరువాత జగన్ లో ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి వెళ్లిందన్న ఆయన దానిని తగ్గించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్రలో పాల్గొనాలని సలహా ఇచ్చారు.
అల్లర్లు సృష్టించడం మాని యోగాసనాలు వేస్తే మానసిక పరిస్థితి కాస్తయినా మెరుగుపడుతుందన్నారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ఓ ప్రకటనలో ఫస్ట్రేషన్ లో జగన్ రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నారనీ, చంపేస్తాం, నరికేస్తాం అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న వైసీపీ సైకో బ్యాచ్ చేష్టలను వ్యతిరేకించాల్సింది పోయి చిరునవ్వుతో స్వాగతిస్తున్నారనీ పేర్కొన్నారు. నెలకు ఒక రోజు జనాల్లోకి వచ్చి నానా బీభత్సం సృష్టించి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. తెనాలి వెళ్లి గంజాయి బ్యాచ్ ను పరామర్శిస్తారు.. ఏడాది కిందట చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని ఇప్పుడు పరామర్శిస్తారు.. ఏదేదో మాట్లాడతారు.. ఆయన వల్ల పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా వెళ్లిపోతారు అని పేర్కొన్న అనగాలి ఇవన్నీ మానసిక స్థితి సరిగ్గా లేని వాళ్లలో కనిపించే లక్షణాలు అన్నారు.
ఇలాంటి లక్షణాలు ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రిలో ఉండే రోగులకు ఉండే లక్షణాలు అని పేర్కొన్నారు. 2024 ఎన్నికలలో ప్రజా తీర్పుతో జగన్ రెడ్డి మానసిక స్థితి దెబ్బతింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెంటనే యోగాంధ్రలో పాల్గొంటే ఆయన ఫస్ట్రేషన్ కాస్త అయినా తగ్గి మామూలు స్థితికి వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/praticipate-in-yogandhra-and-reduce-frustration-39-200285.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!