బెయిల్ పై ఉన్నవాళ్లకి త్వరలో జైలు! కేంద్ర మాజీ మంత్రి కామెంట్లతో జగన్ పార్టీ షేక్..

Publish Date:Dec 28, 2021

Advertisement

ఏపీలోని వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయా? సీఎం జగన్ త్వరలో జైలుకు పోవడం ఖాయమా? ఈ ప్రచారం ఏపీలో చాలా రోజులుగా సాగుతోంది. అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న జగన్మోహన్ రెడ్డి.. త్వరలోనే జైలుకు వెళతారని ప్రతిపక్ష టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందని, త్వరలోనే కేంద్రం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ప్రకటిస్తుందనే వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ రెండు ప్రచారాలకు బలం చేకూరేలా బీజేపీ జాతీయ నేతలు కామెంట్లు చేయడం కలకలం రేపుతోంది. ఏపీలో సంచలనం జరగబోతుందన్న చర్చకు తావిచ్చింది. 

విజయవాడలో బీజేపీ నిర్వహించిన ప్రజా ఆగ్రహ సభలో పాల్గొన్న  బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ పార్టీలు అక్రమాలకు పాల్పడుతున్నాయని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని టీఆర్ఎస్, వైసీపీ పాలనలో  విచ్చలవిడిగా అవినీతి జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చాలామంది నేతలు బెయిల్‌పై బయట ఉన్నారని, వారంతా త్వరలోనే జైలుకు వెళ్తారంటూ హాట్ కామెంట్స్ చేశారు ప్రకాశ్ జవదేకర్. ఏపీలో విధ్వంసకర పాలన సాగుతోందని, మద్య నిషేదం  అని చెప్పి మద్యంపై వచ్చిన డబ్బుతోనే  పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, కేంద్ర పథకాలకు రాష్ట్ర స్టిక్కర్లు అంటిస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ కట్టించేది జగనన్న కాలనీలు కాదు.. మోడీ కాలనీలని చెప్పారు. ఏపీలో  నాయకత్వ మార్పు జరిగి తీరుతుందన్నారు జవదేకర్. 

వైసీపీ అంటే ఏమీ చేతకాని ప్రభుత్వమని ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు. కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్న నిదులు ఏమవుతున్నాయని ఆయన ప్రశ్నించారు. జగన్ పాలన వల్లే రాష్ట్రం  ఆర్థిక సంక్షోభంలో పడిందని విమర్శించారు. అవినీతిమయం కాని రంగం రాష్ట్రంలో ఏదీ లేదన్నారు జీవీఎల్. ఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేత సుజనాచౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫైనాన్షియ‌ల్ ఎమ‌ర్జెన్సీ పెడితే.. రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న ఖాయమన్నారు. ఏపీలో ఏం జరుగుతోందని కేంద్ర హోంశాఖ నిత్యం నిఘా వేస్తోందన్నారు. అధికార పార్టీ తప్పిదాలకు సహకరించే పారిశ్రామిక వేత్తలపైనా కేంద్రం కన్నేసిందని తెలిపారు. చట్ట విరుద్ధంగా వ్యవహరించే అధికారులపైనా నిఘా పెట్టిందన్నారు సుజనా చౌదరి. 

సీఎం జగన్, వైసీపీ పాలనపై  విజయవాడ సభలో ప్రకాశ్ జవదేకర్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో కాక రేపుతున్నాయి. బెయిల్ పై ఉన్న నేతలంతా త్వరలో జైలుకు వెళతారంటూ  సీఎం జగన్ ను ఉద్దేశించే కేంద్ర మంత్రి మాట్లాడారని అంటున్నారు. బీజేపీ సీనియర్ నేత మాటలను బట్టి జగన్ ను కేంద్రం టార్గెట్ చేసినట్లు అర్ధమవుతోందని, త్వరలోనే ఏపీలో సంచనాలు జరగబోతున్నాయనే చర్చ మొదలైంది. ఏపీలో ఫైనాన్షియ‌ల్ ఎమ‌ర్జెన్సీ పెడతారన్న సుజనా వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. అదే జరిగితే ఏపీలో రాష్ట్రపాతన పాలన రావడం ఖాయమని అంటున్నారు. మొత్తంగా విజయవాడ సభలో  బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ జవదేకర్ చేసిన కామెంట్లు వైసీపీలో కలవరం రేపుతున్నాయని తెలుస్తోంది. బెయిల్, జైలు వ్యాఖ్యలపై సీఎం జగన్ శిబిరం ఆరా తీస్తుందని సమాచారం. 

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.