బుక్ పోస్ట్ సర్వీసు రద్దు

Publish Date:Dec 25, 2024

Advertisement

భారత తపాలా శాఖ బుక్ పోస్టు సర్వీసులను రద్దు చేసింది. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా బుక్ పోస్టు సర్వీసులను తపాలా శాఖ రద్దు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  విస్తృతమైన వ్యవస్థ ఉండి  దేశంలో 19,101 పిన్ కోడ్ లతో 1,54,725 పోస్టాఫీసులఉన్న తపాలా శాఖ తన నెట్ వర్క్ ద్వారా అందిస్తున్న సేవలు ప్రజలకు ఎంతగానో ఉపయుక్తంగా ఉన్నాయనడంలో సందేహం లేదు.  బుక్ చేసిన పార్ట్ళిళ్లు వారం లోపు బట్వాడా అవుతున్నాయి. నగర పరిధికి పరిమితమైన స్థానిక బట్వాడాలు ఆమరుసటి రోజుకే  చేరుతున్నాయి. అయితే లాభాపేక్షతో సంబంధం లేకుండా ప్రజలలో పఠనాశక్తి పెంచే ఉద్దేశంతో దశాబ్దాలుగా కొనసాగిస్తున్న బుక్ పోస్ట్ సర్వీసులను హఠాత్తుగా రద్దు చేయడం విస్మయం కలిగిస్తోంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఈ ఏడాది డిసెంబర్ 18 నుంచి పోస్టల్ డిపార్ట్ మెంట్ తన సర్వీసుల నుంచి బుక్ పోస్ట్ లను తొలగించింది. కచ్చితంగా ఇది పుస్తక ప్రియులకు, పుస్తక ప్రచురణలకు షాక్ అనడంలో సందేహం లేదు.  

బుక్ పోస్ట్ సర్వీసును ఉదాత్తమైన ఆలోచనతో మొదలు పెట్టారు.విద్యను ప్రోత్సహించడం, పఠనాభిలాషను పెంపొందింప చేయడం,దేశ వ్యాప్తంగా జ్ఞానాన్నివిస్తరింప చేయడం లక్ష్యంగా ప్రారంభించిన ఈ సర్వీసు రద్దు చేయడం ఎంత మాత్రం సరికాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.  

 రిజిస్టర్డ్ బుక్ పోస్ట్ (ఆర్.బి.పి.)సర్వీసు ద్వారా 5 కిలోల బరువున్న పుస్తకాలను దేశంలోని ఏమారు మూల ప్రాంతానికైనా కేవలం  80 రూపాయల ఖర్చుతో పంపించే అవకాశం ఉన్న  ఈ సర్వీసును రద్దు చేయడం దారుణమని పుస్తక ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  పుస్తకాలు చదివే అలవాటును ప్రోత్సహించడం లక్ష్యంగాతపాలా శాఖ  ఈ సర్వీసును నడిపేది. అతి తక్కువ రేట్లతో బుక్ పోస్ట్ ద్వారా  పుస్తకాలు, మాగజైన్లు, పీరియాడికల్స్  దేశంలోని నలుమూలలకూ పంపిణీ చేయడానికి ఉన్న అవకాశాన్ని తపాలా శాఖ లేకుండా చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

అత్యంత ఆదరణ పొందిన ఈ సర్వీసును రద్దు చేయాలన్న నిర్ణయం తపాలా శాఖ ఏకపక్షంగా తీసుకోవడాన్ని అందరూ తప్పు పడుతున్నారు. ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి ముందు  పుస్తక పరిశ్రమ, చదువరుల అభిప్రాయాలను తెలుసుకుని ఉండాల్సిందని అంటున్నారు. అవసరమైతే స్వల్పంగా చార్జీలు పెంచి అయినా సరే ఈ సర్వీసును కొనసాగించాలని కోరుతున్నారు. 
రిజిస్టర్ బుక్ పోస్ట్ కేటగిరిని తపాలా శాఖ తన సాఫ్ట్ వేర్ నుంచి గుట్టుచప్పుడు  కాకుండా తీసేసింది. కనీసం పోస్టల్ డిపార్ట్ మెంట్ ఉద్యోగులకు కూడా ఈ విషయాన్ని ముందుగా తెలియపరచలేదు.   దేశ వ్యాప్తంగా పోస్టాఫీసుల్లో పుస్తకాలను రిజిస్టర్ బుక్ పోస్టులో పంపడానికి వెళ్లిన వందలాది మంది ప్రచురణ సంస్థల సిబ్బంది ఇక ఈ సర్వీసు అంగుబాటులో లేదని తెలుసుకుని నిర్ఘాంత పోయారు. పలు చోట్ల పోస్టల్ సిబ్బందిని నిలదీసిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. బుక్ పోస్టు సర్వీసును రద్దు చేయడం ప్రచురణ రంగానికి తీరని నష్టం అనడంలో సందేహం లేదు.   ఇప్పటికే పఠనాసక్తి కొరవడి, పుస్తక పరిశ్రమ నష్టాల్లో కునారిల్లుతోంది. మూలిగే నక్కపై తాటిపండు చందంగా ఇప్పుడు తపాలాశాఖ తీసుకున్న నిర్ణయం పబ్లిషింగ్ ఇండస్ట్రీని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టేసిందని పరిశీవలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
టాలివుడ్ ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ రిమాండ్ గడువు ముగియడంతో శుక్రవారం మరోసారి అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో హాజరుకానున్నారు. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి చనిపోవడం, ఆమె కొడుకు ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
ప్రధానిగా, ఆర్ధిక మంత్రి గా దేశాన్ని కొత్తపుంతలు తొక్కించిన మన్మోహన్ సింగ్(92) గురువారం కన్నుమూశారు. 1991నుంచి ఆయన నిరాటంకంగా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు.1991లో పీవీ మంత్రి వర్గంలో ఆర్ధిక మంత్రి గా ఆర్ధికసంస్కరణలు దేశానికి రుచి చూపించి కుప్పకూలే పరిస్థితి లో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ను నిలబెట్టారు.
అధికారం అండతో మంచి , చెడు, ఉచ్ఛం, నీచం అని లేకుండా తెగించి అక్రమాలకు పాల్పడిన మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఇప్పుడు అన్ని దిక్కుల నుంచీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. పెద్దిరెడ్డి పాపాల పుట్టలు అన్నీ పగులుతున్నాయి. వైసీపీ అధికారంలో కొన‌సాగిన ఐదేళ్ల కాలంలో మంత్రి హోదాలో పెద్దిరెడ్డి పెద్ద‌ మొత్తంలో దోపిడీకి పాల్ప‌డిన‌ట్లు విమ‌ర్శ‌లు ఉన్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయం నుంచీ, గతంలో తాను చేసిన తప్పుల నుంచీ గుణపాఠం నేర్చుకోలేదు. అత్యంత అవమాన కరరీతిలో జనం ఆయన పార్టీని ఎన్నికలలో ఓడించిన తరువాత కూడా గతంలో చేసిన తప్పులనే పునరావృతం చేస్తున్నారు.
మాజీ ప్రధాని మన్మోహన సింగ్ తీవ్ర అస్వస్థతతో గురువారం (డిసెంబర్ 26) ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 92 ఏళ్ల మన్మోహన్‌ సింగ్‌.. ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, వాణిజ్య మంత్రిత్వశాఖ సలహాదారుగా, ఆర్థికశాఖ ప్రధాన సలహాదారుగా, ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యదర్శిగా, ప్రణాళిక సంఘం ఛైర్మన్‌గా, ఆర్బీఐ గవర్నర్‌గా, ప్రధాని సలహాదారుగా, యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిటీ చైర్మన్‌ గా ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహించారు.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గత రెండు రోజులుగా భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో కొండపై రద్దీ ఎక్కువగా ఉంది.
ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ను బయటకు పంపాలని ఆప్ నేత సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు. ఢిల్లీ ఎన్నికలో బిజెపికి లాభం చేకూరే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.  కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ బిజెపిని బలపరిచే విధంగా మాట్లాడారని ఆయన ఆరోపించారు.
వైసీపీ హయాంలో మంచి చెడ్డలు, తప్పొప్పులతో పని లేకుండా జగన్ కు వ్యతిరేకం అని భావించిన వాళ్ల కోసం జైళ్లు నోళ్లు తెరిచేవి. పోలీసుల జులం స్వాగతం పలికేది. అర్థరాత్రి, అపరాత్రి అన్న తేడా లేకుండా తెలుగుదేశం నేతలు, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టులు చేసే వారు. నోటీసుల మాటే లేదు. అనుకుంటే జైల్లో తోసేయడమేనన్నట్లుగా పరిస్థితి ఉండేది.
కామారెడ్డిలో  జిల్లాలో  ఎస్ఐ సాయికుమార్ , కానిస్టేబుల్ శృతి  , కంప్యూటర్ ఆపరేటర్  నిఖిల్  సదాశివనగర్ చెరువులో  దూకి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. ఎస్ ఐ, కానిస్టేబుల్ మధ్య అక్రమ సంబంధం ఉందని వార్తలు వస్తున్నాయి
ఎఫ్ డిసి చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.అల్లు అర్జున్ వివాదం నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బెనిఫిట్స్ షో రద్దు చేస్తున్నట్టు, టికెట్ల పెంపు నేనున్నంతవరకు ఉండవని   ప్రకటించడంతో చిత్రపరిశ్రమ ఒక్క సారిగా ఉలిక్కిపడింది
జర్నలిస్టుపై దాడి కేసులో హైకోర్టు ముందస్తు బెయిలు నిరాకరించడంతో నటుడు మోహన్ బాబు అజ్ణాతంలోకి వెళ్లిపోయారని ప్రచారం జరుగుతోంది. ఆయన ఎక్కడ ఉన్నారన్న సమాచారం లేదని పోలీసులు సైతం చెబుతున్నారు.
అల్లు అర్జున్ అరెస్టు తదననంతర పరిణామాలతో తెలంగాణ ప్రభుత్వానికీ, సినీ పరిశ్రమకు మధ్య ఏర్పడిన అగాధాన్ని పూడ్చడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఎఫ్ డీసీ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో కొందరు సినీ ప్రముఖులు గురువారం ( డిసెంబర్ 26) ముఖ్యమంత్రి రేవంత్ తో భేటీ కానున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం (డిసెంబర్ 26) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ ఎంబీసీ వరకూ సాగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.