వచ్చే నాలుగు వారాలు కీలకమంటున్నారు డీహెచ్ శ్రీనివాసరావు. జనవరి చివరి నాటికి పీక్ స్థాయికి చేరుకుంటుందని.. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బందికి సెలవులు రద్దు చేశామని చెప్పడం సంచలనంగా మారింది. ఓవైపు రోజుకు వెయ్యికి పైగా కేసులు వస్తుండటం.. మరోవైపు మెడికల్ స్టాఫ్‌కు సెలవులు రద్దు చేయడం చూస్తుంటే.. థర్డ్ వేవ్ విజృంభిస్తోందని అంటున్నారు. ముందు ముందు పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని.. కేసుల సంఖ్య మరింత పెరుగుతుందని చెబుతున్నారు. అయినా, భయపడాల్సిందేమీ లేదని.. సెకండ్ వేవ్ మాదిరి హాస్పిటల్స్ నిండిపోవడం.. ప్రాణాలు పోవడంలాంటి విపత్కర పరిస్థితులు రావని అంటున్నారు. ఫిబ్రవరి మధ్యలో కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని తెలంగాణ డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు.
"ప్రజలంతా తప్పనిసరిగా ఇంటా, బయటా మాస్క్ ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. టీకా తీసుకోనివారు వెంటనే తీసుకోవాలి. లక్షణాలుంటే సొంత వైద్యం చేసుకోకుండా వైద్యులను సంప్రదించాలి. 2 కోట్ల కొవిడ్ పరీక్షలు, కోటికి పైగా హోం ఐసోలేషన్ కిట్లు సిద్ధంగా ఉంచాం. ర్యాపిడ్‌తో పాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలు కూడా చేస్తున్నాం. కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధంగా ఉన్నాం." అని డీహెచ్ చెప్పారు. ఆయన చెప్పిన లెక్కలు వింటుంటే.. అబ్బో ముందుముందు మహమ్మారి భారీగా విరుచుకుపడటం ఖాయం అనిపిస్తోంది.
"తెలంగాణలో జనవరి ఒకటో తేదీ నుంచి కేసులు పెరుగుతున్నాయి. జీహెచ్‌ఎంసీలోనూ ఎక్కువగానే కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో గత ఐదు రోజుల్లో నాలుగు రెట్లకు పైగా కేసుల పెరుగుదల నమోదైంది. పాజిటివిటీ రేటు కూడా 3శాతానికి పైగా ఉంది. కేసులు వేలాదిగా నమోదవుతున్నా తీవ్ర ప్రభావం లేదు. ఆస్పత్రుల్లో ఎక్కడా ఎక్కువ సంఖ్యలో రోగులు చేరడం లేదు. కొత్త వేరియంట్ బారిన పడిన వారు ఐదు రోజుల్లోనే కోలుకుంటున్నారు. జలుబు, స్వల్ప జ్వరం, తీవ్ర తలనొప్పి వంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి" అని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/positive-cases-peaks-in-next-four-weeks-39-129734.html
జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు.
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది.
రాష్ట్రంలో ఎన్నికల అనంతర పరిణామాలు, జాతీయ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి.
ఆయనను బీజేపీ హైకమాండ్ ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. అప్పటి నుంచీ పార్టీ హైకమాండ్ పై అసంతృప్తితో ఉన్న అన్నామలై సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఉద్దేశంలో ఉన్నారంటూ, గత కొంత కాలంగా వార్తలు వినవస్తున్నాయి.
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బెంగళూరు నగరాభివృద్ధి శాఖ తనకు కేటాయించకపోవడమే ఆయన అసంతృప్తికి కారణమని తెలుస్తోంది. మీడియా ఎదుటే ఆయన తన రాజీనామా లేఖపై సంతకం చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ తమకు వెన్నుపోటు పొడిచిందని డీఎంకే నేత ఇలంగోవన్ బహిరంగంగానే ఆరోపించారు. తమ మద్దతుతోనే రాజ్యసభ నామినేషన్లు దక్కించుకుని.. కూటమి ద్వారానే సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్, ఇప్పుడు స్వార్థం రాజకీయంతో వేరే పార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం దారుణమన్నారు.
దేశవ్యాప్తంగా విద్యా రంగంలో చోటుచేసుకుంటున్న ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో లోపాలు, మూల్యాంకన వ్యవస్థ వైఫల్యాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
వేలమంది బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ప్రాంతీయ ఆకాంక్షలను, ఉద్యమాలను జనసేన గౌరవించాలని కేటీఆర్ పవన్ కు హితవు పలికారు. అయితే, ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. కేటీఆర్ సంధించిన ప్రశ్నలనే తిరిగి కల్వకుంట్ల కుటుంబానికి గురిపెడుతూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2024 ఎన్నికలలో వైనాట్ 175 అంటూ బీరాలు పలికిన జగన్.. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చే సరికి కేవలం 11 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించిన ఆయనకు, ఆయన పార్టీకీ కనీసం విపక్ష హోదా కూడా ఇవ్వడానికి జనం నిరాకరించారు.
రాష్ట్రంలో వైసీపీ పాలన అంతమై రెండేళ్లు గడిచిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టారు. రాష్ట్ర చరిత్రలో జూన్ 4ని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజుగా అభివర్ణించారు.
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు వంటి మహనీయుడిని సైతం నేడు ఒకే ఒక్క కులానికి పరిమితం చేసే దుస్థితి మన రాష్ట్రంలో నెలకొందన్న పవన్ కల్యాణ్.. కులాల పేరుతో సమాజాన్ని విడదీసే ఈ దుర్మార్గపు రాజకీయాలకు ఎక్కడో ఒకచోట చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కులాల ఐక్యతే జనసేన పార్టీ మూల సిద్ధాంతమన్నారు.
గద్దర్ కుమార్తె వెన్నెల పవన్ కల్యాణ్ మాటలు తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, తన తండ్రి గద్దర్ వారసత్వాన్ని అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా పవన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమైన మలుపులతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి.