కర్నూల్ త్రీ టౌన్ పోలీసుల అదుపులో పోసాని
Publish Date:Mar 4, 2025
Advertisement
గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సినీ నటుడు , వైకాపా నేత పోసాని కృష్ణ మరళిపై మరో కేసు నమోదైంది. నరసారావ్ పేట పోలీస్ స్టేషన్ లో నమోదైన ఓ కేసులో పోసాని ప్రస్తుతం గుంటూరు జైల్లో ఉన్నారు. పిటి వారెంట్ క్రింద కర్నూలు జిల్లా ఆదోని త్రీ టౌన్ పోలీసులు పోసానిని అరెస్ట్ చేశారు. 17 పోలీస్ స్టేషన్ లలో ఆయనపై వివిధ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. కూటమినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఓబులావారి పల్లి పోలీసులు పోసానిని గత నెల హైద్రాబాద్ లో అరెస్ట్ చేసి రాజంపేట జైలుకు తరలించారు. అక్కడ్నుంచి నరసారావుపేట పోలీసులు పోసానిపై కేసు నమోదు చేసి గుంటూరు జైలుకు తరలించారు. . . తాజాగా కర్నూలు జిల్లా ఆదోని పట్టటణంలోని ఆదోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో పోసానిపై మరో కేసు నమోదైంది. పోసానిని గుంటూరు నుంచి కర్నూలు తరలించారు.
http://www.teluguone.com/news/content/posani-in-custody-of-kurnool-three-town-police-39-193851.html





