కవిత ఫసక్.. కేటీఆర్ ఖల్లాస్.. కేసీఆర్‌కు సంతోషే కీ పర్సన్!
Publish Date:Dec 14, 2021
Advertisement
సీఎం కేసీఆర్ తమిళనాడు వెళ్లారు. శ్రీరంగంలో కుటుంబ సమేతంగా స్వామి వారి దర్శనం చేసుకున్నారు. మరి, కేసీఆర్ కుటుంబం అంటే ఎవరు? కేటీఆర్, కవితలేగా? కాదంటున్నాయి తాజా పరిణామాలు. కూతురు కవితను చాలా రోజుల నుంచి దూరం పెట్టేశారు. కేటీఆర్‌పైనా తండ్రికి నమ్మకం పోయిందంటున్నారు. ఇక, సంతోష్ కుమారే కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా మారాడని అంటున్నారు. శ్రీరంగం పర్యటనతో ఆ విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది. కేసీఆర్ వెంట కూతురు కవిత లేదు. కేటీఆర్ ఉన్నా.. వెనకే ఉండిపోయారు. సంతోషే కేసీఆర్‌కు సన్నిహితంగా మెదిలారు. సంతోష్‌కే కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చూస్తేనే తెలిసిపోతోంది. ఇలా కల్వకుంట్ల కుటుంబంలో పొలిటికల్ కోల్డ్‌వార్ ఓ రేంజ్లో కొనసాగుతోందని తెలుస్తోంది. కల్వకుంట్ల ఫ్యామిలీ వార్ ఈనాటిది కాదు. దశాబ్దాలుగా కేసీఆర్ వెన్నంటే ఉన్న అల్లుడు హరీష్‌రావును కొడుకు కోసం రాజకీయ బలిపశువు చేశారు గులాబీ బాస్. కేటీఆర్‌ను నెత్తిన పెట్టుకొని.. పార్టీలో, ప్రభుత్వంలో ఫుల్ ప్రమోట్ చేశారు. మంత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్‌తో అందలం ఎక్కించారు. ఇక ముఖ్యమంత్రి కిరీటం కట్టబెట్టడమే తరువాయి అనుకుంటుండగా.. కూతురు కవిత ఎదురు తిరిగిందని అంటారు. అన్నీ అన్నకేనా.. మరి, నాకేంటి..? అంటూ అలక పూనిందట. కూతురుకేమైనా తక్కువ చేశారా? తెలంగాణ జాగృతితో మెళ్లిగా రాజకీయాల్లోకి దించారు. ఎంపీని చేసి.. ఢిల్లీకి పంపించారు. ఆ తర్వాత ఓడినా.. ఎమ్మెల్సీని చేశారు. మంత్రి పదవి దక్కరే పేచీ వచ్చిందని అంటారు. అన్నతో పోల్చుకుని చెల్లి.. లొల్లి లొల్లి చేసిందంటారు. ఇటు కొడుకు.. అటు కూతురు.. ఇద్దరి మధ్య తండ్రిగా కేసీఆర్ నలిగిపోతున్నారని చెబుతుంటారు. కూతురు ఇప్పటికీ అలకపాన్పు వీడనే లేదు. అన్నకు రాఖీ కట్టలేదు.. ప్రగతి భవన్లో బతుకమ్మ ఆడలేదు.. పార్టీ ప్లీనరీకి రాలేదు.. ఇప్పటికీ కేసీఆర్‌తో దూరంగానే ఉన్నారు. కూతురును కాదనుకున్నారు సరే.. మరి, కొడుకుతోనైనా సఖ్యతగా ఉన్నారా అంటే అదీ లేదంటున్నారు. జీహెచ్ఎమ్సీ ఎలక్షన్ టైమ్ నుంచీ తండ్రీకొడుకుల మధ్య విభేదాలు వచ్చాయని.. అవి ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయని చెబుతారు. సందట్లో సడేమియాలో.. ఇదే మంచి తరుణంగా.. కేసీఆర్ మరదలు కొడుకు సంతోష్‌కుమార్ వేగంగా ఎదిగారు. కొడుకు, కూతురును మించి.. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితునిగా మారారు. ఎంపీగా ప్రమోషన్ కొట్టేశారు. టీఆర్ఎస్ మీడియాను తన గుప్పిట్లో పెట్టుకున్నారు. పెద్ద స్థాయి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలన్నీ సంతోష్‌కుమారే చూసుకుంటారని అంటారు. కొండా సురేఖ మాటల్లో చెప్పాలంటే.. కేసీఆర్‌కు మందు గోలీలు ఇచ్చే స్థాయి నుంచి.. కేసీఆర్‌ను కలవాలంటే సంతోష్ పర్మిషన్ ఉండాలనే లెవెల్ వరకూ.. వేగంగా కేసీఆర్‌ను ఆక్రమించేశారని చెబుతారు. అందుకే, ఈటల రాజేందర్ సైతం పార్టీని వీడుతూ.. సంతోష్‌కుమార్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా కేసీఆర్ కుటుంబ సమేతంగా శ్రీరంగం టూర్లోనూ ఆయన సంతోష్‌కు ఇస్తున్న ప్రాధాన్యం ఎంతటిదో మరోసారి స్పష్టమైంది. ముఖ్యమంత్రి పర్యటన ఆసాంతం సంతోష్‌కుమారే వెంటున్నారు. కేటీఆర్‌ది.. జస్ట్ గెస్ట్ రోల్ మాత్రమే.
http://www.teluguone.com/news/content/political-war-in-kcr-family-39-128360.html





