రాజకీయాల్లో విలువలు దిగజారిపోయాయి.. మాజీ సీఎం నల్లారి

Publish Date:Jun 25, 2026

Advertisement

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం రాజకీయాలలో విలులు దిగజారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.  రాజకీయ వ్యవస్థలో మారుతున్న పోకడలు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు.  చట్టసభలు స్థాయికి తగ్గట్టుగా పని చేయడం లేదన్నారు.  తిరుపతి జిల్లా పరిధిలోని చిన్నగొట్టిగల్లు ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, రాజకీయ పరిణామాలు, సమాజంపై వాటి ప్రభావం అనే అంశాలపై ప్రసంగించారు. పూర్వ కాలంతో పోలిస్తే ప్రస్తుతం రాజకీయ రంగంలో నైతిక ప్రమాణాలు అత్యంత దారుణంగా దిగజారిపోతున్నాయని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదన్నారు.

గతంలో చట్ట సభల్లో  ప్రజా సంక్షేమం, విధానాల రూపకల్పనపై  ఆదర్శవంతమైన చర్చలకు నిలయంగా ఉండేవన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి..  ఇప్పుడు అవి వ్యక్తిగత దూషణలకు నిలయాలుగా మారాయన్నారు.  సిద్ధాంతాల ప్రాతిపదికన సాగాల్సిన విమర్శలు, వ్యక్తిగత పగలు, ద్వేషాలను వెళ్లగక్కేలా మారిపోయాయన్నారు.  ప్రజా సమస్యలపై పోరాడటం కంటే ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననానికి పాల్పడటమే నేటి నాయకులకు ప్రధాన అజెండాగా మారిందని   విమర్శించారు.

వైద్యులు, న్యాయవాదులు వంటి ఇతర గౌరవప్రదమైన వృత్తులతో రాజకీయ రంగాన్ని పోలుస్తూ..  కోర్టుల్లో లేదా వృత్తిపరమైన వేదికలపై లాయర్లు, డాక్టర్లు ఒకరి వాదనలను ఒకరు ఎంత తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ..  బయటకు రాగానే పరస్పరం మర్యాద ఇచ్చుకుంటారని ఉదహరించారు. వారిలో కష్ట సమయాల్లో ఒకరికొకరు అండగా నిలబడే వృత్తిపరమైన నైతికత  కనిపిస్తుందని చెప్పారు. కానీ,  రాజకీయాల్లో మాత్రం కనీస మర్యాదలు, నైతిక విలువలు కరువయ్యాయని దుయ్యబట్టారు.
 
డిజిటల్ మాధ్యమాల్లో పెరిగిపోతున్న అసభ్యతపై కూడా మాజీ ముఖ్యమంత్రి తీవ్ర విమర్శలు గుప్పించారు.  సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ట్రోలింగ్ సంస్కృతిని, ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని అసభ్య దూషణలు, వ్యక్తిత్వ హననం వంటి  వికృత పోకడలు పెరిగిపోయాన్నారు.    

By
en-us Political News

  
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో ఆందోళనలు చేపడుతున్న విద్యార్థులు, యువతకు మద్దతుగా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ కేంద్ర ప్రభుత్వానికి కీలక లేఖ రాశారు
నవ ఢిల్లీలోని చారిత్రాత్మక నిరసన వేదిక జంతర్ మంతర్ కేంద్రంగా ఇటీవల వెలుగులోకి వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఉద్యమం దేశ రాజకీయ విశ్లేషకుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో నైరుతి రుతుపవన ద్రోణి చురుగ్గా కదులుతుండటంతో రాగల రెండు రోజుల పాటు తెలంగాణవ్యాప్తంగా వానలు దంచికొట్టనున్నాయి.
నీట్ పేపర్ లీకేజీకి వ్యతి రేకంగా ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు అమానుషంగా లాఠీచార్జ్ చేయడాన్ని తెలంగాణ రక్షణ చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు.
నీట్ వివాదం వేళ విద్యాశాఖ మంత్రి పాత పోరాటాలు..!
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన శాంతియుత నిరసనలు, పోలీసుల లాఠీఛార్జ్ వ్యవహారం ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం మెట్లుక్కింది.
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్టు చేశారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖలో మరియు జాతీయ పరీక్షా వ్యవస్థలో చోటుచేసుకుంటున్న వరుస అక్రమాలు, అవకతవకలకు నిరసనగా విద్యార్థి సంఘాలు పోరాటబాట పట్టాయి.
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం..!
10 ఏళ్లలో 152 లీకేజీలు..రాహుల్ సంచలన ఆరోపణలు..!
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తన అధికారిక ఎక్స్ (X) వేదికగా తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించిన తాజా ఊరటపై స్పందించారు.
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగ్ సందర్భంగా ప్రమాదానికి గురై ఎడమ మోకాలికి గాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సహజ వనరుల నిర్వహణ, ముఖ్యంగా ఇసుక విధానం అనేది కేవలం ఒక పరిపాలనా నిర్ణయంగా కాకుండా ప్రభుత్వాల భవిష్యత్తును తేల్చే అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.