చిన‌జీయ‌ర్ ఇమేజ్ డ్యామేజ్‌?.. కేసీఆర్‌ టార్గెట్ చేశారా?

Publish Date:Mar 17, 2022

Advertisement

“నిజంగా కూడా చిన జీయర్ చేసిన వ్యాఖ్యలు, ‘ఏకం సత్ విప్రః బహుదా వదంతి (సత్యం ఒకటే, ఆది చేరుకునే మార్గాలు మాత్రమే విభిన్నంగా ఉంటాయి) అన్న భారతీయ హిందూ సంస్కృతికి భిన్నంగా, ఉన్నాయి.”

చిన జీయర్ స్వామి, ఒక్క తెలంగాణలోనే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని రాజకీయ స్వామీజీలలో ఒకరు. తెలంగాణలో అయితే ఆయన తర్వాతనే ఇంకెవరైనా. నిజానికి తెలంగాణలో ఇటు రాజకీయాలతో, రాజకీయ నాయకులతో, వ్యాపార ప్రముఖులతో ప్రత్యక్ష సంబంధం ఉన్న స్వామీజీ ఎవరైనా ఉన్నారంటే, చిన జీయర్ స్వామి ఒక్కరి పేరే ప్రముఖంగా వినిపిస్తుంది. 
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు నుంచి కూడా చిన జీయర్ స్వామి, ముఖ్యమంత్రి కేసేఆర్ మధ్య చాలా చక్కని సంబంధాలే ఉంటూ వచ్చాయి. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఆ ఇద్దరి బంధం మరింత గట్టి పడింది. ముఖ్యమంత్రి అధికారికంగా, వ్యక్తిగతంగా నిర్వహించే యజ్ఞయాగాదులు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నీ చిన జీయర్ చేతుల మీదుగానే జరగడం ఆనవాయితీగా వస్తోంది. అదే విధంగా యాదాద్రి దేవాలయం పునర్నిర్మాణ అలోచన మొదలు ఆచరణ వరకు అన్నిటా చినజీయర్‌ స్వామి కీలక పాత్రను పోషించారు. అయితే ఈ మధ్య కాలంలో, ఆ ఇద్దరి మధ్య దూరం పెరింగింది. ఆ దూరం ఎందుకు పెరిగింది అంటే అందుకు అనేక కారణాలున్నాయి. అయితే అది వేరే విషయం. 

అదొకటి అలా ఉంటే, చిన జీయర్ స్వామి చేసే వివాదస్పద వ్యాఖ్యలు కూడా ఆయన్ని ఎప్పుడూ వార్తల్లో వ్యక్తిగా నిలబెడుతున్నాయి. ముఖ్యంగా ముచ్చింతల్’లో సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమం నేపధ్యంగా, ముఖ్యమంత్రి కేసీఆర్’తో దూరం పెరిగిన నేపధ్యంలో,ఆయన  ఇప్పుడు ఫ్రెష్’ గా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో పాటుగా గతంలో ఎప్పుడో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. 

కాగా, ఇప్పుడు తాజాగా, మేడారం వనదేవతలు సమక్క, సారలమ్మలపై గతంలో ఆయన చేసిన వ్యాఖ్యల తాలూకు ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆయన మాట్లాడిన మాటలు వన దేవతలను అవమానించే విధంగా ఉన్నాయని, మేడారం జాతరను హేళన చేసే విధంగా ఉన్నాయని., భక్తుల విశ్వాసాలను, ఆదివాసీ సంస్కృతిని తూలనాడే విధంగా ఉన్నాయంటూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి, ప్రాంతం, రాష్ట్రం ఏదైనా, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో గ్రామా దేవతలను కొలవడం, మొక్కులు తీర్చుకోవడం తరతరాలుగా ఆచారంగా వస్తోంది. అందులో తెలంగాణలో సమక్క, సారలమ్మల జాతర గురించి అయితే చెప్పనే అక్కరలేదు. మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు  విదేశాల నుంచి కూడా ప్రత్యేకంగా వస్తున్నారు అంటే, ఇక స్థానిక ప్రజల విషయం చెప్పనే అక్కర లేదు. అయితే, ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతు వీడియోలోచిన జీయర్’ “‘అసలు సారక్క, సమ్మక్క ఎవరు? పోనీ.. దేవతలా? బ్రహ్మ లోకం నుంచి దిగొచ్చిన వారా? ఏమిటీ చరిత్ర ? అదేదో ఒక అడవి దేవత. ఏదో గ్రామ దేవత. చదువుకున్నవాళ్లు.. పెద్ద పెద్ద వ్యాపారస్తులు, ఆ పేర్లతో బ్యాంకులు పెట్టేశారు. దట్‌ బికేమ్‌ ఏ బిజినెస్‌ నౌ (అది ఇప్పుడో వ్యాపారమైపోయింది)’’ అని అన్నారు. 

ఈ వీడియోలో ఆయన మాట్లాడిన మాటలపై ఆదివాసీ భక్తులు, వివిధ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహావేశాలు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. చినజీయర్‌ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క, సీపీఐ నేత నారాయణ,  బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ములుగు జిల్లాలో పలుచోట్ల నిరసన కార్యక్రమాలు జరిగాయి. మేడారంలో అక్కడి పూజారుల సంఘం ఆధ్వర్యంలో  చినజీయర్‌ దిష్టిబొమ్మకు చెప్పుల దండవేశారు. సీతక్క అయితే ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. 

నిజానికి ఈ ఒక్క విషయంలోనే కాదు చిన జీయర్ స్వామి గతంలోనో, ప్రజల ఆహారపుటల వాట్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాంసాహారులు ఏ జంతువును ఆహారంగా తీసుకుంటారో ఆ జంతువులా ప్రవర్తిస్తారన్నారు. పంది మాంసం తింటే పంది ఆలోచనలు, మేక మాంసం తింటే మేక ఆలోచనలు, కోడి మాంసం తింటే కోడి లాగా పెంటకుప్పల్లో ఏరుక తింటారని  ఆయన ఉదాహరణలతో సహా చెప్పారు. ఈ విషయం దుమారం రేపింది. ప్రజల ఆహారపుటలవాట్లను ప్రశ్నించడానికి ఆయనెవరని పలుచోట్ల నిరసన ప్రదర్శనలు జరిగాయి. 

అయితే, నిజానికి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిన జీయర్ వివాదస్పద వ్యాఖ్యలు ఏవీ, ఇప్పుడు చేసినవి కాదు. నిజమే ఎప్పుడు చేసినా, అలాంటి తప్పుడు వ్యాఖ్యలు ఎవరు చేసినా తప్పే, కాషాయం కట్టిన స్వామీజీ చేయడం మరింత తప్పు. అందులో, మరో అభిప్రాయం లేదు. అయితే, ఇప్పుడు ఆ వీడియోలు ఎందుకు వైరల్ అవుతున్నాయి?  కావాల‌నే కొంద‌రు వైర‌ల్ చేస్తున్నారా? ఆ వీడియోల వెనుక కేసీఆర్ మ‌నుషులు ఉన్నారా?  చిన‌జీయ‌ర్ స్వామి ఇమేజ్‌ని త‌గ్గించే క్ర‌మంలోనే ఇలా వివాదాస్ప‌ద పాత వీడియోల‌ను మ‌ళ్లీ కొత్త‌గా వైర‌ల్ చేస్తున్నారా? ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

By
en-us Political News

  
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.