పులివెందులలో జగన్ సినిమా అయిపోయిందా: ఇక కూటమి సినిమా చూపిస్తుందా.?

Publish Date:Oct 29, 2026

Advertisement

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యేగా  ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో ఆయన సినీమా అయిపోయిందా? స్థానిక నామినేషన్లలో ఆ నియోజకవర్గ పరిధిలోని మెజారిటీ స్థానాలు తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఏకగ్రీవం కావడం దీనినే సూచిస్తోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.  స్థానిక   ఎన్నికల ప్రచారంలో అధికార తెలుగుదేశం కూటమి నేతలు  జగన్‌ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు.  జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పులివెందుల గడ్డపై   జగన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. 

పక్కా ప్రణాళికతోనే తాము పులివెందులలో అడుగుపెట్టామని, మాజీ సీఎంకు సినిమా చూపిస్తామంటూ ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పులివెందులలో జగన్ సినిమాకు ఎండ్ కార్డ్ పడిందా? అన్న అనుమానాలకు తావిచ్చాయి.  జగన్‌  సినిమా డైలాగులు చెబుతున్నారని, చొక్కాలు మడతపె డతామంటూ చేస్తున్న వ్యాఖ్యలు ఆయనలోని పరాజయ భయాన్ని ఎత్తి చూపుతున్నాయనీ ఆదినారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన చొక్కా చేతులు మడతపెడితే భయపడే పరిస్థితులు పులివెందులలో ఇప్పుడు లేవని ఎద్దేవా చేశారు. పులివెందులలో జగన్ కు ఇప్పుడు తాము సినిమా చూపిస్తామని హెచ్చరించారు.   ఒకప్పుడు జగన్ వెంటే నడిచి, ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశంకూటమి అభ్యర్థిగా జమ్మలమడుగు నుంచి గెలుపొందిన ఆదినారాయణ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

ఇదే సభలో ఆయనతో పాటు పాల్గొన్న పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి కూడా  జగన్‌పై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. తనను అంతం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగినా తాను ఎప్పుడూ వెనకడుగు వేయలేదని, పులివెందుల ప్రజల మద్దతుతోనే మునుపటి కంటే బలంగా నిలబడ్డానన్న ఆయన.. గత నాల్గ దశాబ్దాలుగా వైఎస్ కుటుంబం చేసిన తప్పిదాలకు పులివెందుల ప్రజలు ఇప్పుడు సరైన సమాధానం చెబుతున్నారన్నారు.

నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

[Local Body Elections Pulivendula, Jagan, Ycp, Backfoot, Adinarayana Reddy, Pulivendula Politics, BTech Ravi, Telugu One]

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కేరళలోని కొచ్చిలో సంచలనం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదం కేసు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
మహా న‌గ‌రం హైద‌రాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
ప్రభుత్వ కార్యాలయాల గోడలపై ఎక్కడ చూసినా ఒకే నినాదం కనిపిస్తుంది.. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.