తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం!
Publish Date:Nov 30, 2024
Advertisement
వైసీపీ అధికారంలో ఉన్న కాలంలో తిరుమల కొండపై జరిగిన అరాచకాలు అన్నీ ఇన్నీ కాదు. రాజకీయ ప్రసంగాల నుంచి, రాజకీయ ప్రదర్శనలు, స్టిక్కర్ల ప్రదర్శనలకు తిరుమల వేదికగా మారింది. తిరుమల కొండపై అన్యమత ప్రచారం కూడా యథేచ్చగా సాగింది. తిరుపతిలో అలిపిరి వెళ్లే దారిలో ఉండే గోడలపై ఉన్న దేవుడి బొమ్మలను చెరిపేసి వైసీపీ రంగులతో నింపేశారు. ఇక రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత తిరుమలలో అవినీతి అక్రమాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తిరుమల పవిత్రతను దెబ్బతీయడానికి వైసీపీ హయాంలో ఎంత జరగాలో అంతా జరిగింది. చివరికి శ్రీవారి ఆదాయానికి కూడా వైసీపీయులు శఠగోపం పెట్టేశారు. టీటీడీ చైర్మన్లుగా సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిలు ఉన్న సమయంలో ఇంజనీరింగ్ పనులకు సంబంధించి రూ. వేల కోట్ల నిధుల వ్యయంలో గోల్ మాల్ జరిగిందని తేలింది. అలాగే ముడి సరుకులు కొనుగోళ్లు, శ్రీవారి దర్శనం టిక్కెట్ల కేటాయింపు, శ్రీవాణి ట్రస్టులో జరిగిన అక్రమాలకు లెక్కే లేదు. మొత్తంగా జగన్ అధికారంలో ఉన్న కాలంలో శ్రీవారి ఖజానాకు 500 కోట్ల రూపాయలకు పైగా గండి పడిందని విజిలెన్స్ తేల్చింది. వీటన్నిటికీ మించి తిరుమల కొండను వైసీపీయులు తమ రాజకీయ ప్రసంగాలు, ప్రచారాలకు వేదికగా చేసేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. అధికారం కోల్పోయిన తరవాత కూడా వైసీపీయులు తిరుమల వేదికగా రాజకీయ ప్రసంగాలు చేయడంతో అప్రమత్తమైన తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవలి బోర్డు సమావేశంలో తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం విధించాలని తీర్మానించింది. ఇప్పుడు ఆ తీర్మానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఇక నుంచి తిరుమలలో రాజకీయ ప్రసంగాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమల కొండపై రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించింది. ఈ నిషేధాన్ని ఉల్లఘించి ఎవరైనా రాజకీయ విమర్శలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అమెరికాలో కాల్పులు.. తెలుగు విద్యార్థి మృతి
http://www.teluguone.com/news/content/political-speaches-bannad-in-tirumala-39-189254.html