తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల విషయంలో రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలూ పొలిటిల్ మైలేజీ కోసం పోటీ పడుతున్నాయి. తెలంగాణ సాధించింది మేమేనంటూ బీఆర్ఎస్, తెలంగాణ ఇచ్చింది సోనియమ్మేనంటూ కాంగ్రెస్, అన్ని విధాలుగా సహకరించింది మేమేనంటూ బీజేపీ పోటాపోటీగా ఉత్సవాల నిర్వహణకు సమాయత్తమౌతున్నాయి.
తెరాసగా ఉన్నంత వరకూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కర్త, కర్మ, క్రియ అంతా ఆ పార్టీ క్రెడిట్ లో వేసుకుంది. అయితే ఎప్పుడైతే జాతీయ రాజకీయాలంటూ కేసీఆర్ టీఆర్ఎస్ ను కాస్తా బీఆర్ఎస్ గా మార్చేశారో.. అప్పటి నుంచీ తెలంగాణ కార్డ్ ఆ పార్టీకి పెద్దగా కలిసి రావడం లేదు. రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడంలో మాదే కీలక పాత్ర అని గత ఎనిమిదేళ్లుగా ఎంతగా చెప్పుకున్నా బీజేపీకి పెద్దగా ప్రయోజనం లేకపోయింది. అయితే ఎప్పడైతే టీఆర్ఎస్ తన పార్టీ పోరులోని తెలంగాణను తీసేసి భారత్ చేర్చిందో అప్పటి నుంచి బీజేపీ తెలంగాణ సాధనలో తమ పాత్ర విస్మరించడం సాధ్యం కాదంటూ గట్టిగా గళమెత్తింది. అందుకు ప్రజల నుంచి కూడా సానుకూలత వ్యక్తం అవుతున్నదని పరిశీలకులు చెబుతున్నారు. ఇక కాంగ్రెస్ సోనియమ్మే తెలంగాణ ఇచ్చిందని గతంలో ఎంతగా చెప్పుకున్నా విశ్వసించని తెలంగానం ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తరువాత కాంగ్రెస్ మాటలకు ఔను కదా అంటూ స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఆవిర్బావ దినోత్సవ వేడుకల నిర్వహణలో మూడు పార్టీలూ పోటీ పడుతున్నాయి.
బీఆర్ఎస్ ఈ వేడుకలు మూడు వారాలు నిర్వహించాలని నిర్ణయిస్తే.. కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ ఏడాది గోల్కొండ కోటలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సాంస్కృతిక శాఖ ఈ ఉత్సవాలను నిర్వహిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.
అంతే కాకుండా తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తామనీ, ఆయా రాష్ట్రాల్లో నివసించే తెలంగాణ ప్రజలను రాజ్‌భవన్లకు ఆహ్వానించి, గవర్నర్ల ఆధ్వర్యంలో ఆవిర్భావ ఉత్సవాలను నిర్వహిస్తామని ప్రకటించారు. ఇక కాంగ్రెస్ సోనియాగాంధీ చలవ వల్లే తెలంగాణ ఆవిర్భవించిందన్న ప్రచారంతో ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/political-race-in-name-of-formation-celebrations-39-156171.html
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.