రాజస్థాన్ ప్రజలకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. 100 యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తే ఎటువంటి బిల్లు కట్టాల్సిన అవసరం లేదని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. ఎన్నికల వేళ వరాలు ప్రకటించడం షరా మామూలే. కానీ అవసరం లేకున్న వరాలు ప్రకటించి తీరా అధికారంలో వచ్చాక వాటిని మరుస్తున్న పార్టీ నేతలే ఎక్కువవుతున్నారు. వచ్చే డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు గెహ్లాట్ . ముఖ్యమంత్రి ప్రకటనను ప్రతి పక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. వోట్ల కోసం ఉచిత కరెంటు ప్రకటన చేసినట్లు ఆరోపిస్తున్నాయి.
ఎన్నికలకు ముందు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని భారతదేశానికి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ప్రతి భారతీయ పౌరుడి బ్యాంక్ ఖాతాకు 15 లక్షల రూపాయలు బదిలీ చేస్తామని హామీ ఇచ్చారు.
వాస్తవికత మరోలా జరిగింది. రూ.15 లక్షలు ఖాతాలోకి పడలేదు.
ప్రజా సంక్షేమం కోసం చేసిన వాగ్దానాల అమలులో చిత్తశుద్ది కనిపించడం లేదు. చేసిన వాగ్దానాలకు విరుద్ధంగా జరుగుతోంది. కేవలం ఎన్నికల నేపథ్యంలో చేసిన వాగ్దానాలు చాలా సందర్భాల్లో వైఫల్యం చెందుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత దళితుడు ముఖ్యమంత్రి అవుతాడని కెసీఆర్ వాగ్దానం చేశారు. వాస్తవికతలో అలాంటిది జరగలేదు.
పంటరుణాలను రూ లక్ష వరకు మాఫీ చేస్తానని కెసీఆర్ మరో వాగ్దానం చేశారు. ఆచరణలో అది కూడా సాధ్యం కాలేదు.
తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని కెసీఆర్ హామి ఇచ్చారు. ఈ వాగ్దానం కూడా అమలు జరగలేదు.
కంపల్సరీ ఎడ్యుకేషన్ స్కీం క్రింద కెజీ నుంచి పీజీ ఉచిత విద్యనందిస్తానని కెసీఆర్ హామి ఇచ్చారు. కానీ ఆచరణలో అది కూడా సాధ్యం కాలేదు.
గిరిజనులకు 12శాతం రిజర్వేషన్ అమలు చేస్తానని కెసీఆర్ వాగ్దానం చేసి తూట్లు పొడిచారు.
ఒక్క తెలంగాణ రాష్ట్రంతో బాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అధికార పార్టీలు చేసే హామీలు, వాగ్దానాలు అమలు కావడం లేదు.
వోట్ల కోసం ఆయా పార్టీలు వేసే బిస్కట్స్ అని ప్రజలు గ్రహించాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vote-beggers-in-india-39-156177.html
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.