జ‌న‌సేనాని మాట‌ల‌కు అర్థాలే వేరులే!

Publish Date:Mar 15, 2022

Advertisement

జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త అంకానికి తెరతీసింది. ఇప్పటి దాకా చిక్కుముడిగా ఉన్న పొత్తుల విషయం మీద ఆయన చెప్పిన భాష్యం ఆ ముడిని విప్పదీసినట్టే భావించవచ్చు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తా అని ఆయన బహిరంగంగా ప్రకటించి సంచలనం సృష్టించారు. రానున్న ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో అధికార పార్టీని ఓడించే బాధ్యతను తన భుజస్కందాల మీద వేసుకుంటున్న భావన పవన్ కలిగించాడు. ప్రభుత్వ ఓటు చీలకుండా ఉండాలంటే, పవన్ ఏం చేయాలనే దాని మీద అప్పుడే చర్చోపచర్చలు ఊపందుకున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో అదికార పక్షాన్ని మినహాయిస్తే, తెలుగుదేశం, బిజెపి, జనసేన, సిపిఎం, సిపిఐ పార్టీలు ఉన్నాయి. సరే, కాంగ్రెస్ ఉన్నా లేనట్టే అన్న చందంగా నడుస్తోంది. ఒక రకంగా చూస్తే, పవన్ కళ్యాణ్ బిజెపికి, తెలుగుదేశానికీ సమాంతర దూరంలో ఉన్నట్టు లెక్క. విషయమేమిటంటే, ఆయన బిజెపితో అధికార స్నేహంలో ఉన్నాడు, తెలుగుదేశంతో ప్రాక్టికల్ స్నేహంలో ఉన్నాడు. ఈ క్రమంలో వీళ్ళిద్దరినీ ఒక తాటి మీదకి తెచ్చే బాధ్యతను సునాయాసంగా నెరవేర్చడం తనకు తేలికైన పని అని పవన్ భావిస్తున్నట్టుగా ఆయన మాటలను బట్టి అనిపిస్తోంది. 

అటు బిజెపితోనూ, ఇటు తెదేపాతో కూడా ఒకేరకమైన సుముఖతతో నడవడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటనను బట్టి అనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో ఒంటరిపోరాటం ద్వారా చెయ్యి కాల్చుకుని తానెంతో నష్టపోయాడో తెలుసుకున్న పవన్, తెలుగుదేశంతో కలిసి నడవడానికి సిద్ధమైనట్టు ఆయన మాటలు చెప్తున్నాయి. 

ఎటొచ్చీ, తెలుగుదేశంతో కలిసి నడవడానికి బిజెపి సంసిద్ధంగా ఉంటుందా లేదా అన్నదే ప్రధాన ప్రశ్న. బిజెపిని ఒప్పించి, మెప్పించి, నమ్మించడంలో పవన్ కళ్యాణ్  ఏమేరకు విజయవంతం అవుతాడన్నది వేచి చూడాల్సిన విషయమే. ఆవిర్భావ సభ సందర్భంగా పవన్ చేసిన ప్రకటనల పట్ల బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు స్పందించిన తీరు చూస్తుంటే, కమలనాథులకు తమకంటూ ఒక ప్రత్యేక దారి ఉన్నదన్న భావన వ్యక్తం చేసినట్టుగా ఉంది. సోము వీర్రాజు అందీఅందకుండా స్పందించిన తీరు మాత్రం కేంద్ర నాయకత్వం మీదే అంతా ఆధారపడి ఉందని చెప్పకనే చెప్పినట్టుంది. ఈ నేపథ్యంలో, పవన్ కళ్యాణ్ - బిజెపి కేంద్ర నాయకుల మధ్య తీవ్రస్థాయిలో దీని మీద చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిజెపి కేంద్ర నాయకత్వం పవన్ ను ఒప్పించగలిగితే తెలుగుదేశంతో పొత్తు ఉండకపోవచ్చు. అలా కాకుండా, పవనే కేంద్ర నాయకత్వాన్ని ఒప్పిస్తే తెలుగుదేశంతో కలిసి నడిచే అవకాశాలు ఉంటాయి. 

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు కనుక తెలుగుదేశం గుర్రం ఎగిరినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే, దక్షిణాదిలో బిజెపి తన అస్తిత్వాన్ని నిరూపించుకునేందుకు తీవ్ర ప్రయత్నాల్లో ఉన్న నేపథ్యంలో ఈ పొత్తుల విషయం సందేహాస్పదమే అనే వారూ లేకపోలేదు. ఏది ఏమైనా, 2024 ఎన్నికల్లో విజయావకాశాలను పక్కన పెడితే, ముందుగా ఈ పొత్తుల విషయంలో పవన్ కళ్యాణ్ జయాపజయాలే ప్రస్తుతం చాలా కీలకమైనవిలా కనిపిస్తున్నాయి.
 

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.