ఇరాన్ సంక్షోభం.. అమెరికాలో ట్రంప్ కు రాజకీయ సెగ

Publish Date:May 18, 2026

Advertisement

ఇరాన్‌తో నెలకొన్న  ఉద్రిక్తతలు  అగ్రరాజ్యం అమెరికాలో  అంతర్గత ప్రకంపనలకు కారణమౌతున్నాయి. ఈ ఉద్రిక్తతల  ప్రభావంతో దేశీయంగా ఇంధన ధరలు మునుపెన్నడూ లేని విధంగా మండిపోతున్నాయి.  ఇది ట్రంప్ కు పెద్ద ఇబ్బందిగా పరిణమించింది.  డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీకి ఇది   తలనొప్పిగా మారింది.

 ప్రస్తుతం అమెరికా మార్కెట్‌లో గ్యాస్ ధర సగటున గ్యాలన్‌కు  4.51 డాలర్ల మార్కును తాకింది. ఇరాన్ సంక్షోభం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు సామాన్య అమెరికన్లు కేవలం ఇంధనం కోసమే అదనంగా సుమారు 45 బిలియన్ డాలర్ల భారీ మొత్తాన్ని వెచ్చించాల్సి వచ్చినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ తీవ్ర ఆర్థిక భారాన్ని ప్రతిపక్ష డెమొక్రాట్లు తమకు అనుకూలంగా మార్చుకుంటూ ట్రంప్ యంత్రాంగంపై విమర్శల దాడి  తీవ్రం చేశారు. ట్రంప్ ప్రభుత్వ అనాలోచిత విధానాల కారణంగానే దేశంలో డీజిల్, నిత్యావసరాలు, వ్యవసాయ ఎరువులతో పాటు సామాన్యుడి గృహ రుణాలు కూడా మోయలేనంత భారంగా మారాయని విమర్శిస్తోంది.

అయితే..  డొనాల్డ్ ట్రంప్  మాత్రం ఇరాన్ ఎట్టిపరిస్థితుల్లోనూ అణ్వాయుధాన్ని సాధించకుండా అడ్డుకోవడమే తమ ఏకైక లక్ష్యమని అంటున్నారు. భద్రత గురించి తప్ప..  ధరల పెరుగుదల, ప్రజల ఇబ్బందుల గురించి తాను ప్రస్తుతం ఆలోచించడం లేదని అంటున్నారు.  అయితే ట్రంప్   వ్యాఖ్యలు అమెరికా రాజకీయాల్లో మరింత దుమారం రేపాయి. దేశాన్ని ట్రంప్ సర్కార్ అనవసరమైన యుద్ధ వాతావరణంలోకి నెట్టిందని డెమొక్రాటిక్ ప్రతినిధి హకీమ్ జెఫ్రీస్ విమర్శించారు.

దీనికి భిన్నంగా..  దేశ సార్వభౌమత్వం, భద్రత ముందు ఈ ఆర్థిక ఇబ్బందులు కేవలం తాత్కాలికమేనని రిపబ్లికన్ నేతలు గట్టిగా సమర్థించుకుంటున్నారు. ప్రస్తుతం నెలకొన్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో, ఇరాన్ నుండి పొంచి ఉన్న ముప్పును తొలగించడమే ప్రథమ కర్తవ్యమని పాలకపక్షం భావిస్తోంది. ఈ సైనిక ఉద్రిక్తతలు ముగియగానే దేశంలో చమురు మరియు ఇతర నిత్యావసరాల ధరలు మళ్లీ సాధారణ స్థితికి వస్తాయని రిపబ్లికన్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అయినా కూడా రాబోయే ఎన్నికల్లో ఈ ఆర్థిక సంక్షోభం ఎలాంటి ప్రభావం చూపుతుందోననే ఆందోళన మాత్రం రిపబ్లికన్ లలో వ్యక్తమవుతోంది. 

By
en-us Political News

  
హైదరాబాద్‌లోని మియాపూర్ హఫీజ్‌పేట్‌లో ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ చేతిలో 27 ఏళ్ల లేడీ డాక్టర్ సృజన హత్యకు గురైన దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు పోలీసుల దర్యాప్తు నివేదిక.
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తామంటూ ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న దళారీల దందా వెలుగులోకి వచ్చింది. యూనియన్ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి విచారణ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ సాగరిక ఇంటెగ్రేటెడ్ హైస్కూల్‌లో రాఖీలు, తిలకం తొలగింపు వివాదంపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టీచర్‌ను హిజాబ్‌‌పై ప్రశ్నించడం సంచలనంగా మారింది. పోలీసులు కార్పొరేటర్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించిన భర్త శ్రీనివాస్‌ను భార్య రమాదేవి గొడ్డలితో నరికి చంపింది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సీఐఎస్ఎఫ్ క్యాంపులో హెడ్ కానిస్టేబుల్ ఏకే 47 రైఫిల్‌తో చేసిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనపై సీఐఎస్ఎఫ్ డీజీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ఒడిశా తాల్చేర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్ మాధాపూర్‌లో స్పా సెంటర్ ముసుగులో నడుస్తున్న అక్రమ వ్యభిచార రాకెట్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మట్టుబెట్టారు. నలుగురు యువతులను రక్షించి, రూ. 45 వేల నగదు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యాదాద్రి భువనగిరి జిల్లా చల్లూరులో భూభారతి వెబ్‌సైట్ ద్వారా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే 7.18 ఎకరాల భూమి వేరొకరి పేరు మీదకు మారిపోయింది. యజమానులకు తెలియకుండా జరిగిన ఈ భారీ భూ భాగోతం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఏపీ సచివాలయ ఉద్యోగాలు, డీఎస్సీ నియామకాలు మరియు మెడికల్ సీట్లలో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల అక్రమాలపై విచారణ ముమ్మరమైంది. హైకోర్టు ఆదేశాలు, విజిలెన్స్ తనిఖీలు మరియు సాప్ చేపట్టిన స్కిల్ టెస్ట్ వివరాలు ఇక్కడ చూడండి.
150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వందేమాతరం గేయానికి జాతీయ గీతంతో సమాన హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ తెచ్చింది. 3 నిమిషాల 10 సెకన్ల ఆలాపన, సుప్రీంకోర్టు విచారణ మరియు చట్టపరమైన నిబంధనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్ రాయదుర్గంలో ఐటీ కంపెనీ మహిళా ఉద్యోగిపై ఫుడ్ వెండర్ షేక్ నబీ కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడి చేశాడు. ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ రూ. 43 లక్షలు నొక్కేసి మూడేళ్లు వేధించిన నిందితుడిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడ ఎన్‌టీపీఎస్ కాలువలో లభించిన మహిళ శరీర భాగాల మిస్టరీ వీడింది. చేతిపై ఉన్న ఈక టాటూ ఆధారంగా మృతురాలిని మంగళగిరికి చెందిన 29 ఏళ్ల కళ్యాణిగా గుర్తించిన పోలీసులు, విచారణలో మటన్ షాప్ షఫీ చేసిన కిరాతక హత్యను ఛేదించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.