కంచే చేను మేస్తే.. రక్షించాల్సిన వాడు భక్షిస్తే.. ఇక చెప్పుకోవడానికి ఏమి ఉండదు. పోలీసులు అంటేనే సమాజంలో శాంతి భద్రతలను పరిరక్షించే వీరులు. అలాంటి పోలీసులే వక్ర మార్గాన్ని ఎంచుకుంటే ఎలా ఉంటుంది. వినడానికి కూడా మరీ చండాలంగా ఉంటుంది కదూ. కాని అలాంటి పోలీసులే పాడు పని చేశారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఏకంగా ఒక రైతు మేకను దొంగిలించి దావతు చేసుకున్నారు.
న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31 అందరిలాగే పోలీసులు కూడా పార్టీ చేసుకుందాం అనుకున్నారు. ఆ విధంగానే రెండు మేకలను కోసి మరి గ్రాండ్ గా పార్టీ చేసుకున్నారు. అయితే దావుతు కోసం మేకలను కొనలేదు... కొట్టుకొచ్చారు. అవునండి మీరు విన్నది నిజమే. పోలీసులు దొంగల్లా మరి మేకలను కాజేసి పోలీస్ స్టేషన్ దగ్గర్లోనే దాన్ని కోసి విందు పార్టీ చేసుకున్నారు. ఒడిస్సా రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపినవిషయం ప్రకారం సిండికేల గ్రామానికి చెందినటువంటి సంకీర్తన గురు అనే వ్యక్తి మేకలను మేపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. రోజులాగే ఆయన 31 వ రోజు మేకలను తోలుకొని ఇంటికి వచ్చాడు. ఆ మందలో రెండు మేకలు కనిపించలేదు. చుట్టుపక్కల అంతా వెతికాడు. కానీ కనిపించలేదు. వీరు మేకలను మేపే దగ్గరనే పోలీస్ స్టేషన్ ఉంది. వీరు వెతికే క్రమంలో గురు కూతురు స్టేషన్ లో రెండు మేకల కోస్తుండగా చూసింది.వెంటనే వెళ్లి వాళ్ళ నాన్నకు చెప్పింది. గురు వారి యొక్క గ్రామస్తులను వెంట తీసుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లి అక్కడ సిబ్బందిని నిలదీశారు. మా మేకలను దొంగిలించి కోసుకుంటారా.. అని ప్రశ్నించాడు. కానీ వారు పట్టించుకోలేదు. గురునే బెదిరించారు.
ఈ విషయం కాస్త మీడియా దృష్టికి వెళ్లింది. వెంటనే జిల్లా ఎస్పీ నితిన్ శుక్లకర్ స్పందించి ఈ ఘటనపై విచారణ జరిపించి పోలీసులు తప్పు అని తేల్చారు. ఎస్ఐ సుమన్ మాలిక్ ను సస్పెండ్ కూడా చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ప్రజలు పోలీసులు ఇలా చేస్తే దొంగలు ఏ విధంగా చేస్తారని దుమ్మెత్తిపోస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/police-theft-goats-for-new-year-party-39-129473.html
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.