చికెన్‌ వ్యర్థాల మాఫియాపై సైబరాబాద్‌ పోలీసుల కొరడా.!

Publish Date:Aug 24, 2026

Advertisement

హైదరాబాద్‌లో చికెన్‌ వ్యర్థాల అక్రమ రవాణా, విక్రయాలపై సైబరాబాద్‌ పోలీసులు, వెటర్నరీ అధికారులు కొరడా ఝుళి పించారు. నగరంలోని చికెన్‌ షాపులు, ప్రాసెసింగ్‌ కేంద్రాల నుంచి సేకరించిన వ్యర్థాలను రాత్రివేళల్లో లారీల్లో తరలిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లోని చేపల చెరువుల యజమానులకు విక్రయిస్తున్న మాఫియాపై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దాదాపు వంద  టన్నుల చికెన్‌ వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నారు.

అత్తాపూర్‌, మియాపూర్‌, అమీన్‌పూర్‌, కూకట్‌పల్లి, జీడిమెట్ల, చింతల్‌ ప్రాంతాల్లో లారీల్లో చికెన్‌ వ్యర్థాలను డంప్‌ చేసి తరలిస్తున్న సమయంలో అధికారులు నిర్వహించారు. చికెన్‌ వ్యర్థాలను సేకరించి వాటిని చేపల చెరువుల యజమానులకు విక్రయిస్తూ  సొమ్ము చేసుకుంటు న్నట్లు అధికారులు గుర్తించారు. పగటిపూట నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి చికెన్‌ వ్యర్థాలను సేకరిస్తున్న మాఫియా.. వాటిని  గుట్టు చప్పుడు కాకుండా రాత్రివేళల్లో  లారీల్లో తరలిస్తున్నట్లు గుర్తించారు. అనంతరం ఏపీలోని చేపల చెరువుల యజమానులకు ఈ వ్యర్థాలను విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.  చికెన్‌ వ్యర్థాల అక్రమ రవాణాపై గతంలోనూ కేసులు నమోద య్యాయని, అయినప్పటికీ మాఫియా కార్యకలాపాలు ఆగలేదని అధికారులు చెబుతున్నారు. గత నెలలోనే హెచ్‌-ఫాస్ట్‌ అధికారులు సుమారు 100 టన్నుల చికెన్‌ వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నారు.

తాజాగా మరోసారి అదే తరహాలో వ్యర్థాలను తరలిస్తుండటంతో అధికారులు దాడులు నిర్వహించి వంద టన్నుల వ్యర్ధాలను స్వాధీనం చేసుకున్నారు.చికెన్‌ వ్యర్థాలను చేపలకు మేతగా వినియోగించ డం వల్ల ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది.  చికెన్‌ వ్యర్థాల సేకరణ, అక్రమ రవాణా, విక్రయాల వెనుక ఉన్న మాఫియా నెట్‌వర్క్‌పై పోలీసులు దృష్టి సారించారు. వ్యర్థాలను ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు? ఎక్కడికి తరలిస్తున్నారు? ఎవరికి విక్రయిస్తున్నారు? అన్న కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. 

Police seize 100 tons Vhicken waste, Cybarabad Police, Raids, Vehicles, Transport chicken Waste, Ap

By
en-us Political News

  
 మార్టూరులో అరుణ్ కుమార్, మత్యాల మహేందర్ రెడ్డి, కార్తీక్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారిని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో ఇప్పటికే సుమంత్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.  దీంతో ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య నాలుగుకు చేరింది.
తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని, తనకు పోటెన్సీ టెస్ట్ నిర్వహించాల్సిన అవసరం లేదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.  ఈ పిటిషన్‌పై సోమవారం  హైకోర్టు విచారించనుంది. 
డిమాండ్ల సాధన కోసం ఆదివారం అర్ధరాత్రి నుంచి విధుల బంద్ వేయాలని తెలంగాణ స్టేట్ ఆటో అండ్ యాప్ బేస్డ్ యూనియన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
పార్టీలో సురేఖను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేయాలన్న ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో ఆమె నేరుగా పార్టీ జాతీయ అధ్యక్షుడితో భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది.  ఖర్గేతో దాదాపు పావుగంట పాటు భేటీ అయిన సురేఖ్.. తాను సీఎం రేవంత్ రెడ్డికి కానీ, ఆయన కుటుంబానికి కానీ వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదని కొండా సురేఖ ఈ సందర్భంగా ఖర్గేకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో సోమ, మంగళ వారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.  
గాంధీ భవన్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులకు అధిష్ఠానం గట్టి హెచ్చరిక జారీ చేసింది.
సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.
గుడిమల్కాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మొగల్‌కానా వద్ద ఓ ఫర్నిచర్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
మల్లారెడ్డి కాలేజీపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్ అరెస్ట్..!
సరూర్‌నగర్ స్టేడియంలో క్రికెట్ కోచ్‌ను నియమించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు చేపట్టిన ఆందోళన రెండో రోజూ కొనసాగుతోంది.
ప్రియురాలికి కిడ్నాప్ మెసేజ్ పంపడంతో బట్టబయలైన వ్యవహారం..!
మల్లారెడ్డి కాలేజీ యాజమాన్యంపై విమర్శలు.. ప్రీతిరెడ్డి వ్యాఖ్యలపై నెటిజన్ల ఫైర్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.