Publish Date:Mar 19, 2025
కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది . వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉంటూ వచ్చిన ఉమ్మడి కడప జిల్లాలో ఇప్పటికే టీడీపీ పాగా వేసింది. 2024 ఎన్నికలలో జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏడింటిని కైవసం చేసుకున్న కూటమి జగన్‌కు షాక్ ఇచ్చింది.
Publish Date:Mar 19, 2025
భగవంతుడా ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు! ఎదిగిన బిడ్డ చదువుకుంటోంది, మంచి భవిష్యత్తు ఉంటుందని, కలలు కన్నతల్లితండ్రులకు ... ఆ బిడ్డ విహారానికి వెళ్లి సముద్ర తీరం లో గల్లంతైయితే ,పది రోజులు గడుస్తున్నా పోలీసులు కోస్ట్ గార్డ్ సిబ్బంది వెతికినా ఆచూకీ లేకపోతే ... తమ కుమార్తె బతికే ఉంది అన్న ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి లో... ఊరు కానీ ఊరిలో, సాగర తీరం లో వారు అనుభవిస్తున్న క్షోభ వర్ణనాతీతం.
Publish Date:Mar 19, 2025
ఇండియాలో ఇష్ట పడే స్ట్రీట్ ఫుడ్ లలో మోమో, స్పింగ్ రోల్స్ ఎక్కువ సేలవుతుంటాయి. పంజాబ్ లో వీటిని తయారుచేసే ఫ్యాక్టరీలపై అధికారులు దాడులు చేయగా కళ్లు బైర్లు కమ్మే విషయాలు వెలుగు చూసాయి.
Publish Date:Mar 19, 2025
ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్దదైన విశాఖపట్నం నగరపాలక సంస్థ కూటమి వశం కానున్నదా? వైసీపీ చేతిలో ఉన్న ఈ మేయర్ పీఠన్ని దక్కించుకోవడానికి తెలుగుదఏశం కూటమి వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందా? అంటే పరిశీలకులు ఔననే బదులిస్తున్నారు.
Publish Date:Mar 19, 2025
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు మరో సారి కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు హైడ్రా పేరిట పెద్ద ఎత్తున వసూళ్ల దందాకు పాల్పడుతున్నారని సంచలన విమర్శలు చేశారు.
Publish Date:Mar 19, 2025
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ( మార్చి 19) ఢిల్లీ పర్యటనలో భాగంగా టెక్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశం గురించి చంద్రబాబు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. బిల్ గేట్స్ తో సమావేశం విజయవంతంగా ముగిసిందని చంద్రబాబు ఆ ట్వీట్ లో రాసుకొచ్చారు.
Publish Date:Mar 19, 2025
ఏపీ రాష్ట్ర ఉపాధ్యాయ బదలీల క్రమబద్ధీకరణ బిల్లును మంత్రి నారా లోకేష్ బుధవారం (మార్చి 19) అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్ హయాంలో ఉపాధ్యాయ బదలీలు అడ్డగోలుగా జరిగాయనీ, ఓ పద్ధతీ పాడూ లేకుండా ఇష్టానుసారంగా ఉపాధ్యాయుల బదలీలు చేశారనీ విమర్శించారు.
Publish Date:Mar 19, 2025
మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ, శాసన మండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ పక్క చూపులు చూస్తున్నారా? వైసీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్ ఉండదని భయపడుతున్నారా? ఒక్కడిగా కాకుండా ఒక టీమ్ గా పార్టీని వీడాలని ప్రణాళికలు రచిస్తున్నారా? అంటే రాజకీయవర్గాల నుంచే కాదు వైసీపీ వర్గాల నుంచి కూడా ఔననే సమాధానమే వస్తున్నది.
Publish Date:Mar 19, 2025
తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. 3లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ లో సంక్షేమానికి పెద్ద పీట వేశారు. అదే సమయంలో అభివృద్ధిపైనా దృష్టి పెట్టారు మొత్తం రూ. 3,04,965 కోట్లతో బడ్జెట్‌ను రూపొందించారు.
Publish Date:Mar 19, 2025
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో చోటు చేసుకున్న ఫోన్ ట్యాపింగ్ ను పదేళ్ల తర్వాత అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెలుగులోకి తెచ్చింది
Publish Date:Mar 19, 2025
రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డికి సీఐడీ తాజాగా మళ్లీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 25న విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసులలో పేర్కొంది. ఈ నెల 12న విజయసాయి రెడ్డి విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. కాకినాడ పోర్టు వ్యవహారంలో విజయసాయిపై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
Publish Date:Mar 19, 2025
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మార్చి 30 న నాగాపూర్ వెళుతున్నారు. అందులో విశేషం ఏముంది, అనుకుంటే అనుకోవచ్చును, కానీ వుంది. అందుకే, మోదీ నాగపూర్ టూర్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిజమే మోదీ ఒక్క నాగపూర్ అనేముంది, దేశంలో ఎక్కడికైనా వెళతారు. ఆమాట కొస్తే దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడికైనా వెళతారు. వెళుతూనే ఉన్నారు.
Publish Date:Mar 19, 2025
జన్మత: ఎవరూ నేరస్థులు కారు. వారికి చెడు వ్యసనాలు ఉండవు. మెల్లి మెల్లిగా పక్క దారులు పడుతుంటారు. ఆయా ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ వారిని నేరస్థులుగా మార్చేస్తుంది. వారిని నేర ప్రవృత్తిలో దించిన ముఠా గుట్టును తెలంగాణలోని వరంగల్ పోలీసులు రట్టు చేశారు