Publish Date:Jul 15, 2025
హైదరాబాద్ డ్రగ్స్ దందాలో ఎస్ఐబీ అధికారి కుమారుడి పాత్రను ఈగిల్ అధికారులు గుర్తించారు. మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య అమ్మినేని అరెస్టు తర్వాత పోలీసులు ఆ నెట్ వర్క్ పై దర్యాప్తు చేస్తున్న సందర్భంగా ఎస్ఐబీ అధికారి కుమారుడి పాత్ర తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారం ఈగిల్ అధికారులను షాక్ కు గురి చేసింది. ఈ పోలీసు అధికారి కొడుకు పాత్ర పై ఆరా తీస్తున్న క్రమంలో మరికొన్ని విషయాలు బయటపడ్డాయి. 2024లో ఎస్ఐబీ అధికారి కుమారుడు డ్రగ్స్ వ్యవహారంలో ఓ సారి పట్టుబడినా పోలీసులు అరెస్టు చేయకుండా వదిలేసిన విషయం కూడా ఈగిల్ అధికారులు గుర్తించారు.
ఈ ఎస్ఐబీ పోలీస్ అధికారి ప్రస్తుతం ఓఎస్డీ గా ఎస్ఐబీ లోనే కొనసాగుతున్నారు. ఈ ఎస్ఐబీ అధికారిని ఫోన్ టాపింగ్ కేసులో ప్రాథమికంగా అనుమానించినప్పటికి ఆ తర్వాత ఆయన అప్రూవర్ గా మారాన్న ప్రచారం జరిగింది. ఫోన్ టాపింగ్ కేసులో ఈ అధికారి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసినట్లు చెబుతున్నారు. అదలా ఉంటే తాజాగా ఆయన కుమారుడి పేరు డ్రగ్స్ వ్యవహారంలో ప్రముఖంగా వినిపిస్తోంది. డ్రగ్స్ వ్యవహారంలో మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య అమ్మినేనితో పాటు అరెస్టు అయిన ఆరుగురిని ఈగిల్ అధికారులు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విచారణలో మరికొంత మంది సెలబ్రిటీలతో పాటు ప్రముఖుల చిట్టా బయటపడే అవకాశం ఉందని అంటున్నారు.
ఈగిల్ అధికారులు వారం రోజుల కిందట వారికి అందిన సమాచారం మేరకు కొంపల్లి లోని మల్నాడు కిచెన్ రెస్టారెంట్ యజమాని సూర్య అమ్మినేని తో పాటు మరో ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ సందర్భంలో ఈగిల్ పోలీసులకు రాహుల్ తేజ గురించి తెలిసింది. అతడి గురించి ఆరా తీసినప్పుడు 2024 జనవరిలో నిజామాబాద్ పోలీసులు కూడా డ్రగ్స్ కేసులో ఏ3 నిందితుడిగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదు. కాగా ఈగిల్ అధికారుల దర్యాప్తులో రాహుల్ తేజ డ్రగ్స్ సరఫరాదారనీ, అతడు డ్రగ్స్ ను ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ ల నుంచి తీసుకువచ్చేవాడని గుర్తించారు.
అలాగే ఈగిల్ దర్యాప్తులో రాహుల్ తేజ ఎస్ఐబీ లో రిటైర్ అయ్యి , ప్రస్తుత్తం ఓఎస్డీగా పని చేస్తున్న ఓ అధికారి కుమారుడని తేలింది. దీంతో ఈగిల్ అధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలిసింది. ఈ నేపధ్యంలో ఎస్ఐబీ అధికారి కుమారుడి వ్యవహారాన్ని ప్రభుత్వం దృష్టి కి తీసుకువెళ్లి అతని పై చర్యలకు తీసుకునేందుకు ఈగిల్ అధికారులు రెడీ అవుతున్నారు. అయితే తాజాగా సూర్య అమ్మినేని కేసులో అరెస్టు చేస్తారా లేదా నిజామాబాద్ కేసులలో అరెస్టు చేస్తారా అనేది చూడాల్సి ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/police-officer-son-name-in-drugs-case-39-202015.html
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారాహై కత్‌బర్ట్ మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.