పోలవరం ముంపు ప్రాంతాలకు రక్షణ చర్యలు చేపట్టాలి : హరీశ్‌రావు

Publish Date:Jun 4, 2026

Advertisement

 

పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రభావంతో తెలంగాణలోని ముంపు ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ మరోసారి గళమెత్తింది. మాజీ మంత్రి హరీశ్‌రావు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (PPA) సీఈఓకు లేఖ రాసి, ముంపు బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

భద్రాచలంలో పర్యటిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అధికారులకు ఈ లేఖను పినపాక, భద్రాచలం నియోజకవర్గాల బీఆర్ఎస్ నాయకులు స్వయంగా అందజేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలం పట్టణానికి శాశ్వతంగా జలగండం పొంచి ఉందని హరీశ్‌రావు లేఖలో పేర్కొన్నారు.

పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 45.72 మీటర్లు కాగా, భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి కూడా అదే స్థాయిలో ఉండటం ఆందోళనకరమని ఆయన తెలిపారు. దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే భద్రాచలం ప్రాంతం నిరంతరం ముంపు ముప్పును ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.

భద్రాచలం వద్ద గోదావరి నది బెడ్ లెవల్ 26 మీటర్లు మాత్రమే ఉండగా, పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంతో 13.15 నుంచి 17.72 మీటర్ల మేర నీరు ఎప్పటికప్పుడు నిల్వ ఉండే అవకాశముందని వివరించారు. 2021లో కాఫర్ డ్యామ్ పూర్తయిన తర్వాత ఏర్పడిన బ్యాక్‌వాటర్ ప్రభావంతో 2022లో భద్రాచలం, బూర్గంపాడు, సారపాక ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని గుర్తుచేశారు.

ఆ సమయంలో 22 లక్షల క్యూసెక్కుల వరదకే భారీ నష్టం సంభవించిందని, భవిష్యత్తులో ప్రాజెక్టు డిజైన్ ప్రకారం 36 నుంచి 50 లక్షల క్యూసెక్కుల వరదలు వస్తే తెలంగాణలో ప్రాణ, ఆస్తి నష్టం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.

కేవలం గ్రామాలకే కాకుండా పరిశ్రమలకు కూడా బ్యాక్‌వాటర్ ముప్పు ఉందని హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు ఐదు వేల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న ఐటీసీ పేపర్ బోర్డ్స్, హెవీ వాటర్ ప్లాంట్, దుమ్ముగూడెం జలవిద్యుత్ ప్రాజెక్టులు కూడా ప్రమాదంలో ఉన్నాయని తెలిపారు. ఐఐటీ, వ్యాప్కోస్ అధ్యయనాల ప్రకారం 36 గ్రామాల పరిధిలో సుమారు 184 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ముంపు ప్రభావానికి గురవుతున్నట్లు వెల్లడించారు.

పదేపదే నష్టపోతున్న సుమారు రెండు వేల కుటుంబాలకు తక్షణ నష్టపరిహారం అందించడంతో పాటు శాశ్వత పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే భద్రాచలం డ్రైనేజీ వ్యవస్థకు అనుసంధానంగా ఉన్న ఎనిమిది అవుట్‌ఫాల్ రెగ్యులేటర్ల వద్ద పంపింగ్ స్టేషన్లు, ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మించాలని సూచించారు.

భద్రాచలం వద్ద కొత్తగా ఐదు కిలోమీటర్ల మేర కరకట్టల నిర్మాణం చేపట్టాలని, బూర్గంపాడు, సారపాక తదితర ముంపు గ్రామాలకు రక్షణ గోడలు నిర్మించి తగిన పరిహారం అందించాలని కోరారు. తెలంగాణలో పోలవరం ముంపు సమస్యల పరిష్కారం, పునరావాస కార్యక్రమాల పర్యవేక్షణ కోసం భద్రాచలంలో ప్రత్యేకంగా పీపీఏ డివిజన్ కార్యాలయాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని హరీశ్‌రావు లేఖలో డిమాండ్ చేశారు.
 

By
en-us Political News

  
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు సాధించింది. ఆ జట్టు ఓపెనర్ ఫిల్ సాల్ట్ భారత బౌలర్లపై విరుచుకుపడుతూ 44 బంతుల్లో 70 పరుగులుచేశాడు. జోస్ బట్లర్ 36 రాణించాడు. చివర్లో శామ్ కర్రన్ 24 బంతుల్లో 41 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఇంగ్లాండ్ జట్టు సులువుగా 200 పరుగుల మార్కును దాటింది. భారత బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 30 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
అగ్రీగోల్డ్ ఆస్తుల వేలం ప్రక్రియను ఆరు నెలలలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేలం ద్వారా వచ్చే నిధులతో బాధితులకు నేరుగా డబ్బులు చెల్లించేలా ఒక స్పష్టమైన, పారదర్శరమైన  కార్యాచరణను  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రెడీ చేసింది.
ఏపీ ప్రభుత్వానికి, కొరియన్ పారిశ్రామిక సంస్థలకు మధ్య సమన్వయం వేగవంతమౌతుంది. అలాగే.. కొరియా మెరైన్ ఎక్విప్‌మెంట్ అసోసియేషన్ రౌండ్ టేబుల్ సమావేశంలో లోకేశ్‌ ప్రసంగించారు.
తుర్కియేలో జరుగుతున్న నాటో శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈ పరిణామాలపై స్పందించారు. ఇరాన్ దుశ్చర్యకు బుద్ధి చెప్పేలా రూపొందించిన వైమానిక దాడి ప్రణాళికకు ఆయన అక్కడి నుంచే ఆమోదం తెలిపారు. అమెరికా వైమానిక దాడుల ధాటికి దక్షిణ ఇరాన్‌లోని రేవు పట్టణాలు బందర్ అబ్బాస్, సిరిక్, క్వేష్మ్ దీవుల పరిసర ప్రాంతాలు భారీ పేలుళ్లతో దద్దరిల్లాయి. ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా సంస్థలు తమ భూభాగంలో సంభవించిన ఈ భారీ పేలుళ్లను ధ్రువీకరించాయి.
మొదటి దశలో ఆలయం చుట్టూ పటిష్టమైన   ప్రాకారం, సుదూర ప్రాంతాల నుండి సైతం భక్తులను ఆకర్షించే విధంగా   ఏడు అంతస్తుల మహా రాజగోపురం, భక్తుల సౌకర్యార్థం ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపంతో పాటు వాహన, రథ మండపాలను నిర్మించనున్నారు.
దర్యాప్తులో సంబంధిత కాలంలో ఆయనకు వివిధ వనరుల ద్వారా సుమారు 1.60 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందనీ, అదే కాలంలో 71.58 లక్షల రూపాయల మేర ఖర్చులు జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ లెక్కల ప్రకారం ఆయన వద్ద చట్టబద్ధంగా ఉండాల్సింది 88.42 లక్షల రూపాయలు మాత్రమేనని ఏసీబీ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.
విద్యా రంగం పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని గర్హించారు. దీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు గుప్పించారు. కాగా ఈ సందర్భంగా పలు డిమాండ్లను విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వం ముందు ఉంచారు.
జింబాబ్వే పర్యటన కోసం ప్రకటించిన భారత టీ20 జట్టు ఎంపిక వివాదాస్పదంగా మారింది. ఐపీఎల్‌లో 501 పరుగులు చేసిన ఆర్సీబీ స్టార్ రజత్ పాటిదార్‌ను పక్కనపెట్టి, ఒక్క వికెట్ తీయని మయాంక్ యాదవ్‌కు చోటు ఇవ్వడంపై సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైజాగ్‌లో కాగ్నిజెంట్ ఐటీ సెజ్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. మధురవాడ, రుషికొండ, ఎండాడ ప్రాంతాల్లో భారీగా పెరుగుతున్న ఇళ్ల అద్దెలు మరియు కొత్త ఐటీ ఉద్యోగాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, తిరుపతి ఆర్థిక ప్రాంతాల మాస్టర్ ప్లాన్ కోసం 6 నెలల డెడ్‌లైన్ విధించారు. స్వర్ణ ఆంధ్ర 2047 లక్ష్యాలు, వైజాగ్ బే సిటీ ప్రాజెక్ట్ విశేషాలు మరియు రాయలసీమ హార్టికల్చర్ విప్లవంపై పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయానికి వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. హెబ్బాల్ నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు రూ.35 కోట్లతో నిర్మించనున్న సిగ్నల్ రహిత కారిడార్, సదాహళ్లి అండర్‌పాస్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వ్యవస్థీకృత దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకునే క్రమంలో.. రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య చర్చలకు, చట్టబద్ధమైన విమర్శలకు ఎలాంటి భంగం కలగకుండా పోలీసులు వ్యవహరించాలని స్పష్టం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.