అనవసరంగా కాంగ్రెస్ లో చేరాను.. పోచారం.!

Publish Date:Aug 11, 2026

Advertisement

కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేకపోయినా, నియోజకవర్గ అభివృద్ధి కోసం తప్పని సరై కాంగ్రెస్ లో చేరానని ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.   కేసీఆర్ వల్లే అభివృద్ది జరిగింది,  అన్నం పెట్టినోడిని మరవడం కష్టంగా ఉంది, అయినా   కొన్ని రాజకీయ పరిణామాల వల్ల పార్టీ మారాల్సి వచ్చిందని ఆయన అన్నారు. తాను కప్పుకున్నది జాతీయ జెండా అనీ, కాంగ్రెస్ జెండా ఎంత మాత్రం కాదనీ చెప్పారు.  

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు మంత్రులు లెక్క చేయడం లేదన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి భట్టికి, పొంగులేటికి చెప్పినా వాళ్లు పట్టించుకోవడం లేదని పోచారం అన్నారు.  నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తామని సీఎం స్వయంగా చెబితేనే కాంగ్రెస్ లో చేరానన్న ఆయన..   ఆరు నెలల్లో బాన్సువాడ నియోజకవర్గంలో ఉన్న పెండింగ్‌  సమస్యలు పరిష్కరిస్తామని సీఎం ఇచ్చిన హామీ నెరవేరలేదన్నారు.  

నువ్వైనా నిధులు విడుదల చేయమని వేం నరేందర్ రెడ్డికి స్వయాన ముఖ్యమంత్రి చెప్పినా కూడా ఫలితం లేకపోయిందన్నారు. తాను    వేం నరేందర్ రెడ్డికి 50 సార్లు ఫోన్ చేశాననీ, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదనీ చెప్పిన పోచారం..    నవంబరులో ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సీఎం నిర్వహించిన సమావేశంలో  రేవంత్ రెడ్డిని ఈ విషయమై సూటిగా ప్రశ్నించానని చెప్పారు.  పెండింగ్ బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారని పోచారం తెలిపారు. 

Pocharam Srinivas Reddy, Revanth Reddy Congress, Banswada Constituency, Telangana Politics News, Pending Bills Release, Pocharam News Telugu

By
en-us Political News

  
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు.
దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినా.. అసాధారణ ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.