ఉత్తరాంధ్ర టేకాఫ్‌కు సిద్దం.. ప్రధాని రాక కోసం ఎదురుచూస్తున్నాం : సీఎం చంద్రబాబు

Publish Date:Jul 31, 2026

Advertisement

 

ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానా శ్రయాన్ని రేపు ప్రారంభించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించారు. ఈ విమానాశ్రయం రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి మరింత ఊతమిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ప్రధాని మోదీ చేసిన పోస్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. మోదీ రాక కోసం ఆంధ్రప్రదేశ్‌ ఎదురు చూస్తోందని, ఆయనకు స్వాగతం పలికేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందని ‘ఎక్స్‌’ వేదికగా రీ-పోస్ట్‌ చేశారు. ‘ఉత్తరాంధ్ర టేకాఫ్‌కు సిద్ధం.. మీ రాక కోసం ఎదురుచూస్తున్నాం మోదీ జీ’ అంటూ సీఎం చంద్రబాబు తన ఎక్స్ వేదిక ద్వారా పేర్కొన్నారు.

భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి విమాన కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోని ఇతర ప్రాంతాల అభివృద్ధికి ఈ విమానాశ్రయం కీలకంగా మారనుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటు లోకి రావడంతో విదేశీ ప్రయాణాలకు కూడా ఈ ప్రాంత ప్రజలకు మరింత సౌకర్యం కలగనుంది. విమానాశ్రయం కారణంగా ఉత్తరాంధ్రలో పర్యాటక రంగానికి కొత్త ఊపు వస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది. 

అరకు, బొర్రా గుహలు, విశాఖ తీర ప్రాంతం, విజయనగరం, శ్రీకాకుళం తదితర ప్రాంతాలకు దేశ, విదేశాల నుంచి పర్యాటకుల రాక పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో పారిశ్రామిక పెట్టుబడులు, వాణిజ్య కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలు పెరగడానికి విమానాశ్ర యం దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. భోగాపురం ఎయిర్‌పోర్టు తో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేగం పుంజుకుంటుందని సీఎం చంద్రబాబు తన పోస్టులో స్పష్టం చేశారు. మౌలిక వసతుల పరంగా ఈ విమానాశ్రయం కీలక మైన అడుగుగా నిలవ నుందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ పర్యటన, విమానాశ్రయం ప్రారంభో త్సవం నేపథ్యంలో ఉత్తరాంధ్రలో సందడి నెలకొంది.

భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావడం వల్ల ఉత్తరాంధ్ర ఆర్థిక, పర్యాటక రంగాలు సరికొత్త పుంతలు తొక్కనున్నాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ప్రయాణికులకు సరసమైన సమయాల్లో, విస్తృతమైన విమాన సర్వీసులు లభించనుండటం శుభపరిణామం.

భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి ఆగస్టు 17 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిరిండియా  అక్టోబర్‌ 24 వరకు అమల్లో ఉండే విమానాల షెడ్యూల్‌ను ప్రకటించింది.హైదరాబాద్‌–భోగాపురం మధ్య ప్రతిరోజూ ఐదు విమాన సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది. అలాగే బెంగళూరు–భోగాపురం మార్గంలో రోజుకు రెండు సర్వీసులతో పాటు, ఆదివారం మరియు శుక్రవారం మినహా మిగిలిన ఐదు రోజుల్లో అదనంగా మరో సర్వీసు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ఇక విజయవాడ–భోగాపురం మధ్య ప్రతిరోజూ నాలుగు విమాన సర్వీసులు నిర్వహించనున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది

PM Narendra Modi, Bhogapuram Airport Inauguration, Alluri Sitarama Raju International Airport, 
AP Development Projects, Visakhapatnam Semiconductor Plant, PM Modi AP Visit Schedule, CM Chandrababau


 

By
en-us Political News

  
నల్లమలలో సోదాలు.. కౌకూర్‌, యాప్రాల్‌, అచ్చంపేటలో ఆయుధాల కోసం గాలింపు..!
హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని హరిహర మెన్ హాస్టల్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. తోటి పనివాడు ప్రమోద్ జరిపిన కత్తిపోట్లకు కుక్ శశిధర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ సంచలన చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 11 మంది ప్రాణాలు తీసిన ఈ ఘటన వెనుక లాల్ మందిర్ దాడి కుట్ర, మూత్రం నుంచి బాంబు తయారీ, 12 సార్లు రెక్కీ నిర్వహించిన విస్తుపోయే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికాలోని పెన్సిల్వేనియా ల్యాంకాస్టర్ కౌంటీలో ఎఫ్రాతా పోలీసులు చేపట్టిన కీలక అరెస్ట్ వివరాలు. క్రైమ్‌వాచ్ నిఘా మరియు తాజా క్రైమ్ అప్‌డేట్స్ కోసం చదవండి.
ఒడిశా కోరాపుట్ పరిధిలోని బాలిపేట సేవాశ్రమం హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి సీయారా తాడింగిపై సహవిద్యార్థి తీవ్రంగా దాడి చేశాడు. మత్తు పదార్థాల ప్రభావంతోనే ఈ దాడి జరిగిందని, ర్యాగింగ్ అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..!
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.