యూపీ ఎన్నికలు యోగీకి కాదు మోడీకే సవాల్..

Publish Date:Dec 21, 2021

Advertisement

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర వుతున్న కొద్ద్దీ రాజకీయం వేడెక్కుతోంది. కొత్త పుంతలు తొక్కుతోంది. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న అధికార కార్యక్రమాలను ఎన్నికల ప్రచారానికి వేదిక చేసుకుంటోంది. నిజానికి ఇప్పుడు కాదు, మూడు నెలల ముందు నుంచే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఒకదాని వెంట ఒకటిగా అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంబోత్సవాలు చేసుకుంటూ పోతున్నారు. 

వివరాలలోకి వెళితే అక్టోబర్ 25  పూర్వాంచల్ ప్రాంతంలోని ఒకే రోజున తొమ్మిది వైద్యకళాశాలలు ప్రధాని ప్రారంభించారు. అందులో ఎనిమిది కళాశాలలకు కేంద్ర ప్రభుత్వమే నిధులు సమకూర్చింది. ఒక్క జున్పూర్ వైద్య కళాశాలకు మాత్రమే రాష్ట్ర  ప్రభుత్వ నిధులతో నిర్మించారు. ఈ ఆసుపత్రుల నిర్మాణానికి రూ.2,329 కోట్లు ఖర్చు చేశారు.ఈ తొమ్మిది వైద్య కళాశాలల జిల్లా అసుపత్రులకు అనుసంధానం చేయడం వలన ఆ ఆసుపత్రులలో 2509 అదనపు పడకల  సదుపాయం ఏర్పడింది. ఓ ఐదు వేల మంది వరకు, డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి ఉద్యోగాలు లభించాయి. అదే వారంలో ప్రదానమంత్రి మరో రూ .5,200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారని ప్రధాని కార్యాలయం (పీఎంఓ) సమాచారం.

నవంబర్ 16 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, 341కిమీ పూర్వాంచల్ ఎక్ష్ప్రెస్స్’వే ప్రారంభించారు. అందులో ఇండియన్ ఎయిర్ఫోర్సు విమానాలు దిగేందుకు 3.2 కిమీ ఎయిర్ స్ట్రిప్ కూడా ఉంది. ఈ ప్రాజెక్ట్ విలువ రూ.22,500 కోట్లు. వెనకబడిన పూర్వాంచల్ ప్రాంతానికి ఈ ప్రాజెక్ట్ జీవధార అంటారు. ఇక డిసెంబర్ 14న ప్రధాని మోడీ, కాశీలో గంగా నది నుంచి కాశీ విశ్వనాథ దేవాలయం వరకు నిర్మించిన 500 మీటర్ల్ కారిడార్, 24 భవనాల భవన సముదాయం ప్రారంభించారు. ఇది మరో రూ. 339 కోట్ల భరీ ప్రాజెక్ట్ ... ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఒక మెగా ఈవెంట్’ మలిచారు. మోడీ వీధుల్లో నడుస్తూ,జనంతో కలుస్తూ, పూజలు, హారతులు, గంగా స్తానాలతో మీడియా ఫోకస్’ను పూర్తిగా తమ వైపుకు తిప్పుకున్నారు. కాషాయ మెరుపులు మెరిపించారు. 

ఇంతవరకు ఇంతే అయినా ఇక ముందు ఇంకెన్ని ప్రారంభోత్సవాలు ఇంకెన్ని తళుకు బెళుకులు చూపిస్తారో ఏమో కానీ, మెరీసేదంతా బంగారం కాదు, కేవలం తళుకు బెళుకుల ప్రారంభోత్సవలతోనే ఎన్నికల్లో విజయం సాధించడం అయ్యే పని కాదని పరిశీలకులు అంటున్నారు. అంతే కాదుఈ వరస ప్రారంభోత్సవాలు, ముఖ్యమంత్రి అధిత్యనాథ్ ప్రభుత్వ విజయాలు కాదు, వైఫల్యాలను కప్పిపెట్టే ప్రయత్నంగానే పరిశీలకులు భావిస్తున్నారు. అయితే కేవలం ఆర్థిక లెక్కలపైనే ఎన్నికల గెలుపు ఓటములు ఆధార పడవు. శక్తివంతమైన రాజకీయ సందేశాల ముందు ఆర్ధిక పద్దులు, అభివృద్ధి లెక్కలు నిలబడవు. ఈ విద్యలో మోడీ గురువులకే గురువు... చెప్పదలచుకున్న విషయాన్ని మాటతోనే  కాదు మౌనంగానూ చెప్పగల దిట్ట మోడీ. సో.. నిజంగానే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ గెలిస్తే అది  ఆదిత్యనాథ్ ప్రభుత్వ విజయం కాదు, అలాగని మోడీ విజయము కాదు. నిజానికి మళ్ళీ మరో మారు బీజేపీ గెలిస్తే అది విపక్షాల ఓటమే కాని, బీజేపే విజయం కాదు.

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.