జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతాపార్టీ ఆధ్వర్యంలో గత నెలలో జరిగిన ఆందోళనలో ప్రధాని నరేంద్రమోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న బాలికకు ప్రధాని మోడీ క్షమాభిక్ష ప్రసాదించారు. ఈ బాలికపై తొలుత జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఆ జీరో ఎఫ్ఐఆర్ లో ఆ బాలికను పాతికేళ్ల యువతిగా పేర్కొన్నారు.
అయితే ఆ తరువాత ఆ బాలిక ఓ వీడియో విడుదల చేస్తూ.. తన వయస్సు 15 సంవత్సరాలు మాత్రమేననీ, ఇతరుల వల్ల ప్రభావితమై ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశాననీ పేర్కొంటూ.. క్షమాపణ కోరింది. ఆ క్షమాపణ వీడియోలో అదే తన తొలి తప్పనీ, అలాగే చివరి తప్పుకూడాననీ చెబుతూ.. క్షమించాల్సిందిగా వేడుకుంది. దీనిపై స్పందించిన ప్రధాని మోడీ.. తప్పుదోవ పట్టిన పిల్లలు తనను దూషించినా క్షమిస్తున్నానని పేర్కొన్నారు.
ప్రధాని క్షమించడంతో పోలీసులు ఆ జీరో ఎఫ్ఐఆర్ ను రద్దు చేసి ఆ బాలికపై ఎటువంటి కేసూ నమోదు చేయలేదని స్పష్టం చేశారు. ఈ పరిణామాలపై ఆ బాలిక తల్లి హర్షం వ్యక్తం చేస్తూ.. తన బిడ్డకు మోడీ జీవనదానం ప్రసాదించారని పేర్కొన్నారు. తన బిడ్డకు ఇది మరో జన్మ పేర్కొన్న ఆ బాలిక తల్లి.. మైనర్ పిల్లలకు ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాలను నిషేధించాలని విజ్ణప్తి చేశారు.
PM modi excuse that girl, Jantharmantha, protests, Abuse, Primeminister
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pm-modi-excuse-that-girl-36-227827.html
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణ తీవ్ర జాప్యం కావడంపై పార్లమెంట్ వేదికగా తెలుగుదేశం పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.
భారత్‌లో అమెరికా రాయబారి సెర్జియో గోర్ తో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీలో సమావేశమయ్యారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మళ్లీ వార్తల్లో నిలిచారు. స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కొనేందుకు వెనుకాడబోనని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక బ్రాండ్ అంబా సిడర్‌గా మెగాస్టార్ చిరంజీవిని నియమించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
భారత విమానయాన రంగంలో మరో చారిత్రాత్మక మార్పుకు బీజం పడింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జీవితాంతం అహర్నిశలు శ్రమించిన మహనీయుడు, తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్
మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని వేధింపులకు గురిచేసిన కేసులో నిందితుడైన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని అత్తాపూర్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం ముందు రిపబ్లికన్ పార్టీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ తన భార్యతో కలిసి చేపట్టిన నిరసన
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ రాయుళ్లపై మహారాష్ట్రకు చెందిన ఐఏఎస్ అధికారి ఉక్కుపాదం మోపుతున్నారు
మహిళలకు బంగారం.. పుట్టిన బిడ్డలకు బంగారు ఉంగరం..!
ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం ఎత్తు పెంపునకు మహారాష్ట్ర నుంచి అనుమతులు ఇప్పించాలని జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
విశాఖ ఎకనమిక్ రీజియన్ సమగ్రాభివృద్ధికి సూక్ష్మ స్థాయి ప్రణాళికలను రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిరోజూ అత్యంత బిజీ షెడ్యూల్‌తో గడుపుతుంటారు.