Publish Date:Oct 12, 2019
రాజకీయ నాయకుల్లో ప్రధాని మోడీ రూటే సెపరేట్. ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్ర మాతృ భాషలో ప్రసంగం మొదలుపెడతారు. ఆ రాష్ట్రానికి తగ్గట్టు ఆహార్యాన్ని మారుస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే దశావతారం సినిమాలో కమల్ హాసన్ లాగా.. ఒక్కోసారి ఒక్కో అవతారంలో దర్శనమిస్తుంటారు.
అయితే ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో పర్యటిస్తున్న మోడీ నిన్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో కలిసి మహాబలిపురంలో పర్యటించారు. అది కూడా పంచెకట్టులో. తమిళులు తమిళ బాషా అన్నా, పంచెకట్టు అన్నా చెవి కోసుకుంటారు. అందుకేనేమో మోడీ పంచెకట్టుతో సందడి చేసారు. మరి తమిళులు మోడీ పంచెకట్టుకి ఫిదా అయ్యారో లేదో తెలియదు కానీ.. ఈరోజు మోడీ మరో కొత్త అవతారం ఎత్తారు.
ఈరోజు ఎర్లీ మార్నింగ్ తమిళనాడులోని మామల్లాపురం సముద్రతీరానికి వెళ్లిన మోడీ.. భుజాన సంచి వేసుకొని, బీచ్ లో చెత్త ఏరుతూ కనిపించారు. మోడీ ప్రధాని అయ్యాక స్వచ్ఛభారత్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. స్వచ్ఛ భారత్ పిలుపునివ్వడమే కాదు.. దాన్ని స్వయంగా ఆచరించి చూపిస్తున్నారు మోడీ. గతంలో చీపురు పట్టి వీధులు ఊడ్చిన మోడీ.. ఇప్పుడు బీచ్‌లో చెత్తాచెదారాన్ని ఏరిపారేశారు.
శనివారం తెల్లవారుజామున మామల్లాపురం బీచ్ కి మార్నింగ్ వాక్‌కు వెళ్లిన మోడీ అక్కడ బీచ్ లో చెత్తాచెదారాన్ని ఏరిపారేశారు. ప్లాస్టిక్ వ్యర్థాలను, మద్యం బాటిళ్లను తీసి సంచిలో వేసుకొని భుజాన వేసుకున్నారు. దాదాపు అరగంట పాటు మోడీ బీచ్ లో ఉన్న చెత్తను తొలగించారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. జనం సంచరించే ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలని.. మనమంతా ఫిట్ గా ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత ముఖ్యమంటూ ట్వీట్ చేశారు.
మోడీ చెత్త ఏరివేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రధాని అయ్యుండి చెత్త ఏరివేసి ఆదర్శంగా నిలిచారంటూ కొందరు ప్రశంసిస్తుంటే.. మరికొందరు మాత్రం కెమెరాలో కనపడాలనే పిచ్చితో క్లీన్ చేసారు, బోలెడంత పబ్లిసిటీ కొట్టేసారు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pm-modi-cleans-mamallapuram-beach-25-89981.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.