Publish Date:Dec 31, 2024
కొనియాడిన విదేశీ బౌద్ధ పరిశోధకులు
చరిత్రను వివరించిన శివనాగిరెడ్డి
నాగారం మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండు వేల ఏళ్ల నాటి ఫణిగిరి బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించిన విదేశీ బౌద్ధ పరిశోధకులు, స్థానిక ప్రదర్శనశాలలోని శిల్పాలను కొనియాడారని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈఓ, బుద్ధవనం కన్సల్టెంట్, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. న్యూజిలాండ్ కు చెందిన ప్రొఫెసర్ సారా, ఆస్ట్రేలియాకు చెందిన ప్రొఫెసర్ జాఫ్రీషా ఫణిగిరి కొండల పైనున్న బౌద్ధారామాన్ని మంగళవారం(డిసెంబర్ 31) సందర్శించారు.
స్థూపం, చైత్య గృహాలు, శిలామండపాలు, విహారాలు, స్థానిక ప్రదర్శనశాలలోని సిద్ధార్థుని జననం, మహాభినిష్క్రమణం, బుద్ధుని ధర్మ చక్రప్రవర్తన, జాతక కథల బుద్ధుని శిల్పాల గురించి ఈమని శివనాగిరెడ్డి వారికి వివరించారు. క్రీస్తుపూర్వం 1- క్రీస్తుశకం 4 శతాబ్దాల మధ్య ఫణిగిరి గొప్ప బౌద్ధ క్షేత్రం గా విలసిలిందని ఆయన వారికి చెప్పారు. సర్పంచ్ గట్టు నర్సింహారావు వారికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఫణిగిరి మ్యూజియం సిబ్బంది వీరయ్య, యాకయ్య, కార్తీక్ పాల్గొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/phanigiri-boudha-scluptures-fentastic-25-190597.html
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ఏసీబీ, ఈడీలు దూకుడు పెంచాయి. ఈ కేసులో కేటీఆర్ దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు డిస్మిస్ చేసిన తరువాత ఇక తప్పించుకోవడం సాధ్యం కాదని అర్ధం చేసుకున్న నిందితులు విచారణ సంస్థలకు సహకరించకతప్పని పరిస్థితుల్లో పడ్డారు.
ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఈ నెల 13 నుంచి మహా కుంభమేళా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ కుంభమేళాకు తిరుమల నుంచి శ్రీవారి కల్యాణ రథం వెళ్లనుంది. ఈ కల్యాణ రథాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మర్ బీఆర్ నాయుడు బుధవారం (జనవరి 8)ఉదయం జెండా ఊపి ప్రారంభించారు.
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ప్రధాన నిందితుడైన , మాజీమంత్రి కెటీఆర్ దాఖలు చేసిన బుధవారం మధ్యాహ్నం విచారణకు రానుంది. కెటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టు అనుమతించింది.
హైదరాబాద్ పరిధిలో చెరువులు, కుంటల ఆక్రమణలను తొలగించేందుకు రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పించిన ప్రభుత్వం, ఆ దిశగా మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది.
అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న స్వయం ప్రకటిత దేవుడు ఆశారాం కు సుప్రీం కోర్టు షరతులతో కూడిన తాత్కాలిక బెయిలు మంజూరు చేసింది. 86 ఏళ్ల ఆశారాంబాపూ తన 77 ఏళ్ల భార్య లక్ష్మీదేవి అనారోగ్యంతో ఉన్నారనీ, ఆమెకు బైపాస్ ఆపరేషన్ చేయించాల్సి ఉందనీ పేర్కొంటూ బెయిలు కోసం చేసిన విజ్ణప్తిపై సానుకూలంగా స్పందించిన సుప్రీం కోర్టు ఆయనకు మార్చి 31వరకూ తాత్కాలిక బెయిలు మంజూరు చేసింది.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టు ముంగిట ఉన్నారా అంటే ఔనన్న సమాధానమే వస్తోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో అవినీతి జరిగిందనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయంటూ తెలంగాణ హైకోర్టు ఆయన క్వాష్ పిటిషన్ ను మంగళవారం (జనవరి 7) కొట్టివేసిన క్షణం నుంచీ కేటీఆర్ ఆరెస్టుపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నూతన చైర్మన్‌గా వీ నారాయణన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఇస్రో చైర్మన్ గా ఉన్న సోమనాథ్ పదవీ కాలం సోమవారంతో ముగియనున్న నేపథ్యంలో కొత్త చైర్మన్ నియామకం జరిగింది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (జనవరి 8)ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్ లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా అనుమతిస్తున్నారు.
విచారణకు రావాలంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది.
వైసీపీ హయాంలో కోడిగుడ్డు మంత్రిగా వెరీగుడ్డు నేమ్ సంపాదించుకున్నగుడివాడ అమర్నాథ్ అప్పట్లో చెప్పిన గుడ్డు కథనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. జగన్ హయాంలో ఐటీ శాఖ మంత్రిగా వెలగబెట్టిన గుడివాడ అమర్నాథ్.
తెలంగాణలో బిజెపి కార్యాలయంపై కాంగ్రేస్ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపిస్తూ మంగళవారం బిజెపి శ్రేణులు గాంధీభవన్ వైపు దూసుకొచ్చాయి. ఈ శ్రేణులను అడ్డుకోవడానికి పోలీసులు లాఠీ చార్జి చేశారు
మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగం సురేశ్ కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మరియమ్మ అనే మహిళ హత్య కేసులో బెయిలు కోసం నందిగం సురేష్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను సుప్రీం కోర్టు మంగళవారం (జనవరి 7) కొట్టివేసింది.
కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ ఎన్నిక షెడ్యూల్ ను ప్రకటించింది. ఢిల్లీ అసెంబ్లీ గడువు ఈ నెల 23తో ముగియనుంది. మొత్తం 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీ వరుసగా రెండు పర్యాయాలు ఆప్ అధికారంలో వచ్చింది.