సీఎం జగన్ ఇంటి ముందు ధర్నాకు సిద్ధమంటున్న పేర్ని నానీ!

Publish Date:Jul 20, 2023

Advertisement

మాజీ మంత్రి, మ‌చిలీప‌ట్నం వైసీపీ ఎమ్మెల్యే, కాపు నాయ‌కుడు పేర్ని నాని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పేర్ని నానీ వ్యాఖ్యలు అప్పుడప్పుడూ సంచలనం అవుతుండడం కద్దు.  ఇప్పుడు ఆయన   సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేసేందుకు కూడా తాను సిద్ధమేనని చేసిన వ్యాఖ్యలు  సంచలనంగా మారాయి. సీఎం జ‌గ‌న్ ఇంటి ముందు ధ‌ర్నా చేస్తాం అని ప్రకటించిన పేర్ని నానీ..   కావాలంటే ఏలూరు జిల్లా ప‌రిష‌త్ స‌భ్యుల‌తో పాటు ఈ జిల్లాలోని ఎమ్మెల్యేల‌తో క‌లిసి వెళ్లి మ‌రీ త‌మ త‌డాఖా ఏంటో చూపిస్తామ‌ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా పేర్ని నాని వ్యాఖ్య‌లు క‌ల‌కలం రేపాయి. నిన్నటి వరకూ జగన్ మంత్రి వర్గంలో ఉన్న పేర్ని ఒక్కసారిగా ఇలా సీఎం ఇంటి ముందు ధర్నా కూర్చుంటానని ప్రకటించడంతో సొంత పార్టీలో కూడా అటెన్షన్ మొదలైంది.

అసలు పేర్ని నానీ వ్యాఖ్యల వెనక కారణం చూస్తే విస్తుపోవడం ఖాయం. బుధ‌వారం ఏలూరు జిల్లా ప‌రిష‌త్ స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి జెడ్పీటీసీలు స‌హా ప్రొటోకాల్ ప్ర‌కారం.. జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు కూడా వ‌చ్చారు. ఈ క్ర‌మంలో ఏలూరు జిల్లా ప‌రిధిలో ఉన్న నూజివీడు, మ‌చిలీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్యేలు పేర్ని నాని, మేకా వెంక‌ట ప్ర‌తాప్ అప్పారావు త‌దిత‌రులు కూడా హాజ‌ర‌య్యారు. మ‌ధ్యాహ్నం 4 గంట‌ల వ‌ర‌కు స‌మావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎలాంటి తీర్మానాలు చేయలేదు.. ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. కారణం ఎక్స్ అఫిషియో స‌భ్యుడైన ఏలూరు జిల్లా క‌లెక్ట‌ర్ స‌హా ఉన్న‌తాధికారులు అందరూ ఈ సమావేశానికి డుమ్మా కొట్టేశారు. వారి స‌మ‌క్షంలోనే ఆయా స‌మ‌స్య‌ల‌పై ఒక నిర్ణ‌యానికి రావాల్సి ఉండగా.. వారు మాత్రం ఈ స‌మావేశాల‌కు రాలేదు. దీంతో ఒక్క‌సారిగా జెడ్పీ స‌భ్యులు అంద‌రూ పేర్ని నానిపై ఒత్తిడి తేవడంతో నాని రెచ్చిపోయారు.

కలెక్టర్ సహా ఉన్నతాధికారులు ఎవరూ సమావేశానికి హాజరు కాకపోవడంతో  నానీ.. క‌లెక్ట‌ర్‌కు అసలు మేం ఎలా క‌నిపిస్తున్నాం. ఎమ్మెల్యేలు అనుకుంటున్నారా.. లేక మీ కింద నౌకర్లు అనుకుంటున్నారా? ఆయ‌న కోసం మేం వేచి ఉండాలా.. మాకు మాత్రం ప‌నులు ఉండవా.. మేము రాలేదా అని ఆగ్రహంతో ఊగిపోయారు. అంతేకాదు క‌లెక్ట‌ర్‌పై సీఎం జ‌గ‌న్‌కు ఫిర్యాదు చేస్తాం.. జిల్లా ప‌రిష‌త్ స‌భ్యులు, జిల్లాలోని ఎమ్మెల్యేల‌తో క‌లిసివెళ్లి తాడేప‌ల్లి వ‌ద్ద ధ‌ర్నాకు దిగుతాం. ఈ విష‌యాన్ని క‌లెక్ట‌ర్ దృష్టిలో ఉంచుకుంటే మంచిదని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఏలూరు జిల్లాలో కలెక్టర్, ఉన్నతాధికారులు.. వైసీపీ ఎమ్మెల్యేల మధ్య ఉన్న అంతర్యుద్ధం బయటపడింది. కలెక్టర్ సహా ఉన్నతాధికారులు అంతా పనిగట్టుకొని సమావేశానికి డుమ్మా కొట్టారంటే ఇక్కడ రాజకీయం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

నిజానికి ఈ సమస్య ఈ రోజుది కాదు.. ఈ సమావేశానిది మాత్రమే కాదు. వ‌రుస‌గా రెండు స‌మావేశాల‌కు  క‌లెక్ట‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ డుమ్మా కొట్టారు.  కలెక్టర్ రారని తెలిసి ఉన్నతాధికారులు కూడా ఎవరూ సమావేశాలకు రావడం లేదు. గతంలో వైసీపీ నేతలు, ఈ అధికారుల మధ్య పలుమార్లు జరిగిన వాగ్వాదాలే దీనికి కారణంగా తెలుస్తున్నది. వైసీపీ నేతలు తరచుగా అధికారుల పనికి అడ్డు తగలడం.. నానీ మంత్రిగా ఉన్నప్పుడు తెచ్చిన ఒత్తిళ్ల కారణంగానే అధికారులు ఇప్పుడు ఇలా మొహం చాటేస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతున్నది.

కాగా, ఒక మాజీ మంత్రి ఇలాకాలోనే , ఎమ్మెల్యేలు హాజరయ్యే సమావేశానికి అధికారులు మొహం చాటేస్తున్నారంటే రాష్ట్రంలో పాలన డొల్లతనం బయటపడుతున్నది. ఒక మాజీ మంత్రి, సొంత పార్టీ అధికారంలో ఉండగానే అధికారులు మాట వినడం లేదని సీఎం ఇంటి ముందు ధర్నాకు దిగుతా అని ప్రకటించారంటే ప్రభుత్వ తీరు ఎంద సుందరముదనష్టంగా ఉందో ఇట్టే అవగతమౌతుంది.

By
en-us Political News

  
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌‌ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.