పేర్ని నానికి పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ తండ్రి శాపనార్ధాలు.. ఎందుకంటే?

Publish Date:Jul 14, 2026

Advertisement

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ప్రాణాంతకమైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్ననిరంజన్ ను మరణానికి ముందు పవన్ కల్యాణ్ వారింటికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. దీనిపై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు. నిరంజన్ మరణం అనంతరం.. నిరంజన్ తల్లిదండ్రులు  ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్నినానిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తమ కుమారుడు నిరంజనం ఆకస్మిక మృతికి పేర్నినాని.. పవన్ పై చేసిన వ్యాఖ్యలే కారణమని ఆరోపించారు.  తనకుమారుడిపై ప్రేమతో పరామర్శించడానికి వచ్చిన పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి పేర్ని నాని చేసిన అనుచిత వ్యాఖ్యలు నిరంజన్ ను ఎంతో కృంగదీశాయనీ, ఆ మనస్థాపంతోనే తన కుమారుడు  ఎంతో ప్రేమగా  పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి పేర్ని నాని మాట్లాడిన అనుచిత మాటలు నిరంజన్‌ను మానసికంగా ఎంతో కుంగదీశాయని, ఆ తీవ్ర మనస్థాపం వల్లే తమ కుమారుడు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడనీ ఆవేదన వ్యక్తం చేశారు. 

గత కొంత కాలంగా కండరాల క్షీణతకు సంబంధించిన ఒక అరుదైన ఆరోగ్య సమస్యతో  బాధపడుతూ నిరంజన్ మంచానికే పరిమితమైన నిరంజన్..  పవన్ కళ్యాణ్‌ను ఒక్కసారైనా చూడాలని  ఆకాంక్షించాడు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడంతో, ఆయన స్పందించి  హనుమకొండలోని నిరంజన్ నివాసానికి వెళ్లారు. అక్కడ అతడిని  ఎంతో ఆప్యాయంగా పలకరించి, ధైర్యం చెప్పడమే కాకుండా ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పవన్‌ను కలవాలనే తన జీవితకాల కోరిక నెరవేరడంతో నిరంజన్ ఎంతో సంతోషపడ్డాడు.

అయితే.. పవన్ కళ్యాణ్ చేసిన ఈ మానవతా పరామర్శను రాజకీయంగా వాడుకుంటూ వైసీపీ సీనియర్ నాయకుడు   పేర్ని నాని  తీవ్ర విమర్శలు   అనారోగ్యంతో ఉన్న ఒక చిన్నపిల్లాడిని చూడటానికి వెళ్లడాన్ని కూడా రాజకీయ కోణంలో వక్రీకరిస్తూ వెటకారంగా మాట్లాడారు. స్వతహాగా పవన్ కళ్యాణ్‌ను అమితంగా ఆరాధించే నిరంజన్, టీవీల్లో,  సోషల్ మీడియాలో వచ్చిన పేర్ని నాని వ్యాఖ్యల వీడియోలను చూసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు. తాను ఎంతో గౌరవించే నాయకుడిని అలా అవమానించడం తట్టుకోలేకపోయాడు.

ఆ బాధాకరమైన వీడియోను నిరంజన్ పదే పదే చూస్తూ, తీవ్రమైన మానసిక వేదనను అనుభవించాడని అతని తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. ఒక పక్క శారీరక అనారోగ్యం, మరోపక్క మనసుకు తగిలిన ఈ మానసిక గాయం కారణంగానే నిరంజన్ ఆరోగ్యం మరింత క్షీణించి,  హఠాన్మరణానికి దారితీసిందని తండ్రి ఆరోపించారు. "ఆ చిన్నపిల్లాడి ఆరోగ్యం మీద, చివరి రోజుల్లో ఉన్న ఒక ప్రాణం మీద వెటకారం చేసి, వాడి మనసును తీవ్రంగా గాయపరిచిన పేర్ని నానికి ఈ పాపం ఖచ్చితంగా చుట్టుకుంటుందని ఆ తండ్రి ఆవేదనతో అన్నారు. 

 రాజకీయ ప్రయోజనాల కోసం ఒక నిరుపేద, అనారోగ్యంతో ఉన్న బాలుడి పరిస్థితిని కూడా వదలకుండా విమర్శలకు ఉపయోగించుకోవడం ఎంతవరకు సమంజసమని నిరంజన్ తల్లిదండ్రులు ప్రశ్నించారు. దేవుడు అన్నీ చూస్తున్నాడని, చేసిన తప్పులకు   తగిన ఫలితాన్ని అనుభవించాల్సిందేనని  వ్యాఖ్యానించారు. కొడుకును కోల్పోయిన కడుపుకోతలో ఉన్న ఆ తండ్రి వ్యక్తపరిచిన  భావోద్వేగాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజనులు పేర్ని నానిపై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్నారు.  

By
en-us Political News

  
దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో రోబో ల్యాబ్, సెంట్రల్ కంట్రోల్ రూమ్ ను మంత్రి సందర్శించి ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్, ఏవీని వీక్షించారు.
స్థానిక అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సిఎం చంద్రబాబుకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం శాస్త్రోక్తంగా నిర్వహించిన జల పూజలో ముఖ్యమంత్రి పాల్గొని, కృష్ణవేణి, సప్త గోదావరి దేవతలకు నీరాజనాలు సమర్పించారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని ముద్ర గడ కుటుంబ సభ్యులు  తిరస్కరిం చారు. తమకు ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదని, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలోనే కిర్లంపూడిలో అంత్యక్రియలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 
ఐదేళ్ల జగన్ పాలనలో రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని.. ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, జల సంరక్షణ చర్యలను పోలుస్తూ విపులంగా మాట్లాడారు. అయితే విశ్వేశ్వరరెడ్డి సొంత పార్టీ సమావేశంలో నిజాలను చెప్పడం ఆ పార్టీ అధినాయకత్వానికి నిషూరమైంది.
ఆదాయపు పన్ను శాఖకు ఐటీఏటీ ITAT షాక్ ఇచ్చింది. మూడో వ్యక్తి వద్ద దొరికిన కాగితాలు, డైరీల ఆధారంగా స్వతంత్ర సాక్ష్యాలు లేకుండా పన్ను డిమాండ్లు విధించడం కుదరదని స్పష్టం చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆర్థిక సంవత్సరం 2027 క్యూ1 లో నువోకో విస్టాస్ అద్భుతమైన ఫలితాలు సాధించింది. ఏకంగా 20% లాభాల వృద్ధి, రికార్డు స్థాయి EBITDA నమోదు కావడంతో బ్రోకరేజ్ సంస్థలు ఈ షేరుపై ఏకంగా 47% అప్‌సైడ్ టార్గెట్‌ను నిర్దేశించాయి. ఆ వివరాలు మీకోసం.
దేశీయ మార్కెట్‌లో ఒక్కసారిగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ యుద్ధ మేఘాల ప్రభావంతో హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా నేటి 24K, 22K, 18K గోల్డ్ లేటెస్ట్ రేట్ల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్లో ఫ్రాన్స్ ను ఓడించి స్పెయిన్ ఫైనల్ చేరింది. నాకౌట్ మ్యాచ్ లలో కిలియన్ ఎంబాపెపై లామిన్ యమల్ 6-0 తో తన అజేయ రికార్డును ఎలా కొనసాగించాడో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్లో స్పెయిన్ సంచలనం సృష్టించింది. హాట్ ఫేవరెట్ ఫ్రాన్స్‌ను 2-0 గోల్స్ తేడాతో ఓడించి 2010 తర్వాత తొలిసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
విదేశీ ఆదాయంపై రెండు దేశాల్లో పన్నులు చెల్లించి నష్టపోతున్నారా? ఇన్కమ్ టాక్స్ రూల్ 128 ప్రకారం ఫామ్ 67 (Form 67) ఆన్‌లైన్‌లో ఫైల్ చేసి, ఫారిన్ టాక్స్ క్రెడిట్ FTC ద్వారా భారతదేశంలో మీ పన్ను భారాన్ని ఎలా తగ్గించుకోవాలో పూర్తి వివరాలతో తెలుసుకోండి.
దేశంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ రూ. 9,795 కోట్ల భారీ ఐపీఓతో మార్కెట్లోకి వచ్చింది. లేటెస్ట్ జీఎమ్‌పీ, సబ్‌స్క్రిప్షన్ వివరాలు మరియు నిపుణుల ఇన్వెస్ట్‌మెంట్ సలహాలు ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.
టాటా ఎల్క్సీ Tata Elxsi Q1 ఫలితాల తర్వాత షేరు 6% క్రాష్ అయింది. మోతీలాల్ ఓస్వాల్ ఈ స్టాక్‌పై సెల్ రేటింగ్ ఇస్తూ, ఇంకా 16% మేర పతనమయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. పూర్తి వివరాలు మరియు మార్జిన్ల లెక్కలు ఇక్కడ చదవండి.
కుసుమ్‌గర్ ఐపీఓ స్టాక్ మార్కెట్లో సరికొత్త రికార్డు సృష్టించింది. 135 రెట్లు సబ్‌స్క్రిప్షన్ సాధించిన ఈ షేరు, ఇష్యూ ధరపై 37 శాతం ప్రీమియంతో రూ. 574 వద్ద లిస్ట్ అయి ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.