Publish Date:Apr 18, 2022
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లగా తయారైంది ఆంధ్రప్రదేశ్ లో పరిస్థతి. ఏపీలో అధికార అ పార్టీ అత్యుత్సాహం జనం ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తున్నది. అదెలా అంటే...జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవులు పొందిన వారి, వారి అనుచరులు, అభిమానుల అత్యుత్సాహం జనం ప్రాణాల మీదకు తెస్తున్నది. ఒక మంత్రి విజయోత్సవ ర్యాలీ కారణంగా పసి పాప సమయానికి వైద్యం అందక మరణించింది. మరో సంఘటనలో మంత్రి ఆలయ దర్శనం కారణంగా సామాన్య భక్తుల దర్శనానికి విపరీతమైన జాప్యం జరిగి వారు తరగబడే పరిస్థతి ఏర్పడింది. మండు వేసవిలో గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలిచిపోవలసి రావడంతో పలువురు దాదాపు సొమ్మసిల్లిన పరిస్థితికి చేరుకోవడంతో భక్తులు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక తాజాగా నెల్లూరులో అయితే మంత్రి కాకాణి అనుచరుల అత్యుత్సాహం ఏకంగా వందల మంది రైలు ప్రాయాణీకుల ప్రాణాలనే ప్రమాదంలోకి నెట్టింది. నెల్లూరులో నిన్న సాయంత్రం కొత్త మంత్రి కాకాణికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా నెల్లూరులో భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. గజ మాలలూ, బాణ సంచాలతో నెల్లూరు
దద్దరిల్లిపోయేలా చేశారు.
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన ఇన్ని రోజుల తరువాత ఈ సంబరేలేమిటంటారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కాకాణి నెల్లూరుకు రావడం ఇదే మొదటి సారి కావడంతో పార్టీ శ్రేణులు ఈ సంబరాలకు శ్రీకారం చుట్టారు. ఇంత భారీ ఎత్తున సంబరాలు చేసుకోవడానికీ కారణం ఉంది. పాత మంత్రి ఇటీవల కాకాణికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం...పోలీసు స్టేషన్లో సాక్ష్యాల దొంగతనం వంటి కారణాలతో కొత్త మంత్రి ప్రతిష్ట ఒకింత మసకబారిందనే ప్రచారం సాగుతుండటంతో దానికి తిప్పి కొట్టేందుకు ఈ హడావుడీ, హంగామా చేశారు. అంత వరకూ బాగానే ఉంది. కానీ శ్రేణుల అత్యుత్సాహమే ఒక పెను ప్రమాదం జరిగే పరిస్థితి ఏర్పడేలా చేసింది. వందలాది మంది ప్రాణాలు పోయే పరిస్థితినీ తీసుకు వచ్చింది.
అదెలాగంటే....మంత్రి స్వాగత సంబరాలలో మైమరిచిన వైకాపా కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణ సంచా కాల్చారు. అందులో భాగంగా ఆకాసంలోకి తారా జువ్వలు వేశారు. అదీ రైల్వే ట్రాక్ పక్కన. కార్యకర్తల అత్యుత్సాహం, అలవిమాలిన నిర్లక్ష్యం కారణంగా వారు వేసిన తారా జువ్వలు ఆ సమయంలో అటుగా వెళుతున్న రైలుపై పడ్డాయి. అదృష్ట వశాత్తూ ఎటువంటి ప్రమాదం జరగలేదు కనుక సరిపోయింది కానీ....లేకుంటే భారీ నష్టం జరిగి ఉండేది. వైపాకా కార్యకర్తలు వెలిగించి ఎగరేసిన జువ్వలు ఆ సమయంలో అటుగా వెళుతున్న ప్రయాణీకుల రైలుపై పడిన దృశ్యాలు సామాజిక మాధ్యమంతో విస్తృతంగా ట్రెండ్ అవుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/peoples-life-in-risk-with-ap-new-ministers-overaction-39-134538.html
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.