Publish Date:Apr 18, 2022
ఔనంటే కాదనిలే...కాదంటే ఔననిలే అంటూ అలనాటి మిస్సమ్మ చిత్రంలో ఓ పాట ఉంది. అది కేవలం సినిమా పాటే...కానీ ఆ పాటలోని తొలి పంక్తులు మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుగారికి అతికినట్లు సరిపోతాయి. ఆయన ఏ విషయం చెప్పినా...ఆచరణలో
అందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. దళితులకు మూడెకరాల నుంచి...ఇంటికో ఉద్యోగం, ఉద్యోగ ఖాళీల భర్తి, నిరుద్యోగ భృతి ఇలా ఏ విషయం తీసుకున్నా ఆయన మాటలకూ చేతలకూ పొంతన కనిపించదు. ఇప్పుడు తాజాగా యాద్రాద్రిలో దుకాణాల విషయంలోనూ అదే జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి, అపర తిరుమల రీతిలో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు. కొత్త ఆలయం పూర్తై...భక్తులు ఆలయ సందర్శనకు రావడం ప్రారంభించిన తరువాత ఒక్కటొక్కటిగా జరుగుతున్న పరిణామాలు, కొండపై భక్తులకు అవసరమైన సౌకర్యాలు లేకపోవడంతో ప్రజాగ్రహం వ్యక్తమౌతున్నది. ముఖ్యంగా ఆలయ
పునర్నిర్మాణ పనుల తనిఖీకి కేసీఆర్ వచ్చిన సమయాలలో కేసీఆర్ చేసిన ప్రకటనలు, ఇచ్చిన హామీలకు పూర్తి విరుద్ధంగా ఇప్పుడు కొండపై వ్యవహారాలు సాగుతున్నాయని స్థానికుల నుంచీ, భక్తుల నుంచీ విమర్శలు వినవస్తున్నాయి. ముఖ్యంగా యాదగిరి గుట్టపై ఒక్క దుకాణం కూడా ఉండదంటూ గతంలో కేసీఆర్ చేసిన ప్రకటనను విరుద్ధంగా కొండపై దుకాణాలు వెలిశాయి.
వాటి కోసం అధికారులు అధికారికంగా టెండర్లను సైతం ఆహ్వానించారు. దీనిపై నిరుద్యోగుల జేఏసీ ప్రతినిథులు వినూత్నంగా తన నిరసననూ, వ్యతిరేకతనూ అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం రూపంలో సమర్పించారు. అంతే కాకుండా సర్కార్ మొండి వైఖరికి నిరసనగా ఇదే వినతి పత్రాన్ని దున్నపోతులకు సమర్పించారు. వాగ్దానల విషయంలో కేసీఆర్ కు పెద్దగా పట్టింపు ఉండదన్న నానుడి ఉంది. వాగ్దాన భంగాలపై ప్రజల ఆగ్రహం వ్యక్తమయ్యేలోగా మరో కొత్త వాగ్దానంతో వారి దృష్టి మళ్లించే నైపుణ్యం కేసీఆర్ ప్రత్యేకత అని ఆయన రాజకీయ ప్రత్యర్థులు వ్యంగ్య బాణాలు సంధిస్తుంటారు. ఇప్పుడు యాదగిరి గుట్టపై దుకాణాల విషయంలో అది మరో సారి రుజువైంది. గత ఏడాది అక్టోబర్ 19న కేసీఆర్ యాదగిరి గుట్ట సందర్శించిన సందర్భంలో ఆయన కొండపై దుకాణాలు ఉండవని విస్పష్టంగా ప్రకటన చేశారు.
కొండపై దుకాణాలు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇస్తామని, దుకాణాలపైనే ఆధారపడేవారికి టెంపుల్ సిటీలో దుకాణాలు కేటాయిస్తామనీ వాగ్దానం చేశారు. అయితే ఇప్పుడు అధికారులు ఏకంగా బహిరంగ టెండర్లు పిలిచి మరీ దుకాణాలు కేటాయిస్తున్నారు. యాదగిరిగుట్టపైన, కొండ కింద, పుష్కరిణి ప్రాంతంలోదుకాణాలు లేదా వ్యాపార కేంద్రాలను నిర్వహించుకునేందుకు దేవస్థానం అధికారులు టెండర్లుబహిరంగంగా పిలిచారు. టెండర్ల కోసం పత్రికా ముఖంగా ఆహ్వానం పలికిన దేవస్థానం అధికారులు. టెండర్లు పిలవకముందే యాదగిరిగుట్ట కొండపైన దుకాణాలు తెరిపించేశారు. అంటే గుట్టపై ఒక్కదుకాణం కూడా ఉండదన్న కేసీఆర్ మాటలకు అర్ధం ఇదన్న మాట.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-says-one-implement-another-39-134540.html
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.