చంద్రబాబును ప్రజలే కాపాడుకోవాలి?

Publish Date:Aug 26, 2022

Advertisement

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి ఎన్ఎస్ జీ భద్రతను భారీగా పెంచారు. ఇప్పటి దాకా 6+6 గా ఉన్న ఆయన భద్రతను 12+12కు ఎన్ఎస్జీ పెంచింది. జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న చంద్రబాబుకు శుక్రవారం నుంచే ఎన్ఎస్జీ భద్రతను రెట్టింపు చేయడానికి కారణం ఏదో ఉండి ఉంటుందనే సందేహాలు సర్వత్రా   వ్యక్తం అవుతున్నాయి.    ఎన్ఎస్జీ డీఐజీ సమరదీప్ సింగ్ నేతృత్వంలో ఒక బృందం అకస్మాత్తుగా ఢిల్లీ నుంచి వచ్చి గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం, ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ప్రతి గదికీ వెళ్లి నిశితంగా పరిశీలించడం, మరుసటి రోజే ఆయనకు ఎన్ఎస్జీ భద్రతను రెట్టింపు చేయడం  టీడీపీ నేతలు, శ్రేణులకు ఆందోళన కలిగిస్తోంది. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే చంద్రబాబు నాయుడి భద్రత గురించి ఎన్ఎస్జీ  డీఐజీ పరిశీలించడం మరింత ఆందోళనకు కారణమవుతోంది. చంద్రబాబు భద్రతకు ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చిన నివేదికల ఆధారంగానే ఎన్ఎస్జీ డీఐజీ ఇలా అకస్మాత్తుగా సమీక్షించారు. ఈ క్రమంలో రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులను కూడా సమరదీప్ సింగ్ కలిసినట్లు సమాచారం.

ఏపీలో ఇటీవలి కాలంలో అధికార- విపక్ష టీడీపీ- జనసేన పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విధానపరమైన విమర్శలు కాకుండా పార్టీల నేతలు వ్యక్తిగత విమర్శలు, తిట్ల దండకాలతో రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటన సందర్భంగా అధికార వైసీపీ, టీడీపీ నేతలు, శ్రేణుల మధ్య ఘర్షణాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి.  ఈ సందర్భంగా జరిగిన అల్లర్లు, హింస వైసీపీ- టీడీపీ మధ్య రచ్చకు మరింత ఆజ్యం పోశాయి. టీడీపీ నేతలు తమ శ్రేణులను చితకబాదారని వైసీపీ ఆరోపిస్తోంది. పోలీసులను వినియోగించి తమ పైనే వైసీపీ దాడి చేయించిందని టీడీపీ శ్రేణులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాయి. కుప్పంలో దాడులు జరిగిన సందర్భంలో జెడ్ ప్లస్ కేటగిరి భద్రతలో ఉన్న చంద్రబాబు నాయుడి పైన కూడా వైసీపీ మూకలు దాడికి యత్నించడం ఆందోళన కలిగిస్తోంది. చంద్రబాబుకు భద్రత కల్పించడంలో రాష్ట్ర పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందంటున్నారు.

వాస్తవానికి కీలకమైన పదవుల్లో ఉన్నవారికి టెర్రరిస్టులు, మావోయిస్టుల నుంచి ముప్పు ఉంటుంది. అలాంటి వీఐపీలకు నేషనల్ సెక్కూరిటీ గ్రూప్ జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తుంది. జెడ్ ప్లస్ భద్రత కలిగిన చంద్రబాబు పర్యటన సందర్భంగా కుప్పంలో చోటుచేసుకున్న సంఘటనలు ఆయన భద్రతకు ముప్పు ఉందనేందుకు సూచనలంటున్నారు. చంద్రబాబు కాన్వాయ్ పై వైసీపీ శ్రేణులు రాళ్లు విసిరేందుకు యత్నించినట్లు వార్తలు రావడం గమనార్హం.

కుప్పం ఘటనలతో ఒక్కసారిగా చంద్రబాబులో ఆగ్రహం పెల్లుబికింది. వైసీపీ శ్రేణులు, నేతల ఆగడాలను నిరోధించకుండా పోలీసులు చోద్యం చూడడంపై విరుచుకుపడ్డారు. 60 వేల మంది ఉన్న పోలీసులపై 60 లక్షల మంది ఉన్న టీడీపీ శ్రేణులు విజృంభిస్తే.. వారి గతి ఏమవుతుందో ఊహించుకోవాలని హెచ్చరించారు. అన్నా క్యాంటీన్ వద్ధ వైసీపీ శ్రేణులు బ్యానర్లు చింపి, అన్నా క్యాంటిన్ ను ధ్వంసం చేసిన ఘటనా స్థలాన్ని పరిశీలించి, అక్కడే రోడ్డుపై బైఠాయించారు. టీడీపీ నేతలపై పోలీసులు లాఠీచార్జి చేయడంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. మా కార్యకర్తలను కొడితే.. నేను మీ ఇళ్లకు వచ్చి కొడతా’ అని హెచ్చరించారు.

ఏపీలో వైసీపీ సర్కార్ వచ్చిన తొలి రోజుల్లోనే చంద్రబాబు ‘ఛలో ఆత్మకూరు’లో పాల్గొనకుండా నిరోధించేందుకు ఆయన ఇంటి గేట్లకు తాళ్లు వేశారు. చంద్రబాబు అమరావతి పర్యటనకు వెళ్లినప్పుడు ఆయన ప్రయాణించే బస్సుపై చెప్పులు, రాళ్లు వేశారు. అప్పటి వైసీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి జోగి రమేష్ చంద్రబాబు ఇంటిపై దాడికి వచ్చారు. చంద్రబాబును భౌతికంగా ఇబ్బంది పెట్టే యత్నాలు జరుగుతున్నాయన్న ఇంటెలిజెన్స్ నివేదికలతో కేంద్రం ఆయన రక్షణపై దృష్టి సారించిందంటున్నారు. చంద్రబాబు నాయుడు ఇటీవల చేస్తున్న పర్యటనల్లో వైసీపీ శ్రేణులు తరచుగా గొడవలు సృష్టిస్తున్నారు. కొన్ని నెలల క్రితం మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై రాళ్ల దాడి లాంటి పరిణామాలు కూడా చంద్రబాబుకు భద్రత పెంచే విషయంపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందంటున్నారు.

ఏపీలో చంద్రబాబు నాయుడి విషయంలో, టీడీపీ విషయంలో వరుసగా జరుగుతున్న సంఘటనలను చూస్తుంటే.. ఆయనకు ముప్పేదో ఉందనే సంకేతాలు వస్తున్నాయని ఆ పార్టీ నేతలు, శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ చంద్రబాబుకు ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఎదురైతే ప్రజలే ఆయనను కాపాడుకోవాలని వారు అంటున్నారు.

By
en-us Political News

  
అమర రాజా వంటి గ్లోబల్ టెక్నాలజీ సంస్థ వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఏపీలో కాకుండా పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పెట్టడం ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీని చేజార్చుకోవడమేనని ప్రముఖ విశ్లేషకుడు సువేరా అన్నారు. తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన రాజకీయం, కులం, ప్రాంతీయ విద్వేషాల కారణాలతో ఇటువంటి పారిశ్రామిక దిగ్గజం రాష్ట్రం వీడాల్సి రావడం వల్ల యువతకు రావలసిన ఉపాధి అవకాశాలు చేజారిపోయాయన్నారు.
ఆ నక్కల కారణంగానే తాను తన మార్గాన్ని ఎంచుకుని బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలోని తన మాజీ సహచరులపై తీవ్ర విమర్శలు గుప్పించిన కవిత.. బీఆర్ఎస్‌లోని కొందరు గుంటనక్కల వంటి నేతల బృందం తనను ఒంటరిని చేసి, పక్కన పెట్టడానికి పద్ధతి ప్రకారం పనిచేశారని కవిత చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ అత్యంత కీలకమైన మలుపుగా మారబోతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అత్యంత ఉత్కంఠభరిత వాతావరణంలో ప్రారంభం కానున్నాయి.
శాంతిభద్రతల విఘాతం కలగకుండా ఉండేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందస్తు భద్రతా వ్యూహంలో భాగంగా సెంట్రల్ ఢిల్లీని దాదాపు తమ అధీనంలోకి తీసుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఈ చలో పార్లమెంట్ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో తనదైన విలక్షణ శైలితో నిత్యం వార్తల్లో నిలిచే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేసినట్లేనా.. అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. గత కొంతకాలంగా ఆయన కారు దిగిపోనున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఆ ప్రచారానికి బలం చేకూర్చింది. సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న వేదికపై ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఉన్నారు. ఆ వేదికపై ప్రసంగిస్తున్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నా.. మల్లారెడ్డి పట్టించుకోకుండా చిరునవ్వులు చిందిస్తూ ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. సొంత పార్టీ అధినేతను అంతగా విమర్శిస్తున్నా మల్లారెడ్డిలో స్పందన లేకపోవడంతో ఆయన కారు దేగేయడం ఖాయమన్న ప్రచారానికి బలం చేకూర్చింది. అలాగే ఇటీవలే.. ఆయన ఒక ప్రైవేటు కార్యక్రమంలో కూడా తాను బీఆర్ఎస్ ను వీడనున్నట్లు సంకేతాలిచ్చారు. వాస్తవానికి.. గత ఎన్నికలలో పరాజయం పాలై బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన నాటి నుంచీ కూడా మల్లారెడ్డి పొలిటికల్ గా ఒకింత ఇనాక్టివ్ అయ్యారనే చెప్పారు. చాలా కాలంగా మల్లారెడ్డి అధికార కాంగ్రెస్ లేదా కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తన వ్యాపార, విద్యారంగ సంస్థల పరిరక్షణతో పాటు నియోజకవర్గంలో రాజకీయ ఉనికి కోసం ఆయన అధికార పార్టీతో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించిన చామకూర మల్లారెడ్డి.. ఇప్పుడు ఆయన ప్రసంగిస్తున్న వేదికపై కనిపించడం పట్ల కమలం శ్రేణుల్లో కూడా ఆగ్రహం వ్యక్తమౌతోంది. మొత్తం మీద మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడం ఖాయమన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది. అయితే ఆయన కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా? కాషాయ తీర్థం పుచ్చుకుంటారా అన్న విషయంపై అయితే రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే అనేకమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు హస్తం గూటికి చేరిన నేపథ్యంలో, మల్లారెడ్డి కూడా అదే బాట పడతారన్న అభిప్రాయమే పరిశీలకులలో కూడా వ్యక్తమౌతోంది. chamakura malla reddy latest news, medchal mla malla reddy, telangana political updates
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ కీలక సమీక్ష నిర్వహించింది.
తెలంగాణ భారతీయ జనతా పార్టీల్లో ఒక్కసారిగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.