ఏపీ నుంచి పరిశ్రమలు ఎందుకు వెళ్ళిపోయాయి?

Publish Date:Jul 18, 2026

Advertisement

తెలుగువన్ ప్రత్యేకం

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ  హయాంలో రాష్ట్రం నుంచి తరలిపోయిన ప్రముఖ పారిశ్రామిక సంస్థలు ఇప్పుడు పొరుగు రాష్ట్రాలలో   విజయవంతంగా రాణిస్తుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పరిశ్రమలు తమంతట తాముగా వెళ్ళిపోలేదని, నాటి ప్రభుత్వ ఒత్తిళ్లు, బెదిరింపులు,  వాటా ఇస్తేనే వ్యాపారం అనే  దౌర్భాగ్య విధానాల వల్లే పారిశ్రామికవేత్తలు దండం పెట్టి మరీ ఏపీని వదిలి పారిపోయారని తెలుగువన్ ప్రత్యేక ఇంటర్వ్యూలో సీనియర్ విశ్లేషకుడు సువేరా అన్నారు. ఇందుకు సంబంధించి ఆయన  సంచలన నిజాలను వెల్లడించారు. తాజాగా తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో అమరరాజా బ్యాటరీస్ గ్లోబల్ కర్మాగారం ప్రారంభోత్సవ నేపథ్యంలో ఏపీ పారిశ్రామిక విధ్వంసంపై ఆయన మాట్లాడారు. 
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన  ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.  ఒక గ్లోబల్ టెక్నాలజీ కలిగిన అమరరాజా సంస్థను బెదిరించడం వల్లే వారు వేల కోట్ల పెట్టుబడులను తెలంగాణకు తరలించారని, నిన్న దివిటిపల్లిలో జరిగిన కనులపండువ లాంటి ప్రారంభోత్సవమే దీనికి ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. ఏపీలో ఉపాధి కోల్పోయిన యువత తరపున నారా లోకేష్ క్షమాపణలు చెప్పడం నాటి దుస్థితికి అద్దం పడుతోందన్నారు.

రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని పక్కనబెట్టి..  కేవలం తమ సొంత బినామీ కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకే వైఎస్ కుటుంబం మొదటి నుంచి ప్రయత్నించిందని   ధ్వజమెత్తారు. కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టుల నుంచి మచిలీపట్నం పోర్టు వరకు బలవంతపు ల్యాండ్ పూలింగ్స్, అధికార దుర్వినియోగంతో చెరబట్టారని ఆరోపించారు. పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురిచేసే ఈ చెంబల్ వ్యాలీ బందిపోటు సంస్కృతి వల్ల ఏపీ బ్రాండ్ ఇమేజ్ అంతర్జాతీయంగా దెబ్బతిన్నదని, కేవలం లంపెన్ శక్తులను, అసాంఘిక మూలకాలను ప్రోత్సహిస్తూ వ్యవస్థలను సర్వనాశనం చేశారని సువేరా విశ్లేషించారు.

ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో ఏపీ పాలన తిరిగి గాడిలో పడుతోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దశాబ్దాల పారిశ్రామిక అనుభవం, మంత్రి నారా లోకేష్ నిరంతర శ్రమతో మళ్లీ పెట్టుబడులు వరదలా వస్తున్నాయన్న సువేరా.. అనకాపల్లి, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో విదేశీ పెట్టుబడులు వస్తుండటం శుభపరిణామన్నారు. పొరుగు రాష్ట్రాలతో ఆరోగ్యకరమైన పోటీని ఎదుర్కొంటూ ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, భవిష్యత్ తరాల మనుగడ కోసం ఇలాంటి పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని కథనాన్ని ముగించారు.

Why Industries Left Andhra Pradesh,  Suvera Analysis,  TeluguOne,  AmarRaja Batteries,  Chandrababu Naidu Investments AP, AP Past Government Industry Scams

By
en-us Political News

  
నూకరాజు కుటుంబం ఆత్మహత్య వెనుక లవ్ జిహాదీ, మత మార్పిడికి ఒత్తిడి చేసిన సాధిక్ ఖాన్ అనే వ్యక్తికి కూడా వైసీపీతో అనుబంధం సంబంధం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్  అవుతున్నాయి. 
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయంలో అధికార పార్టీ నేతల మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
సాధారణంగా స్థానిక ఎన్నికలలో అధికార పక్షం హవా నడుస్తుంది. అయితే విపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత పులివెందుల విషయంలో మాత్రం మిగిలిన ప్రాంతాలలోలా  అధికార పార్టీ హవా అని టేకిట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోవడానికి లేదు. అందుకే అధికార తెలుగుదేశం కూటమి వ్యూహాత్మకంగా పులివెందులలో పాగా వేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. 
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని, కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు, గౌరవం కల్పించడమే తమ లక్ష్యమని
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ప్రస్తుతం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల (ముఖ్యంగా పట్టణ, నగర పాలక సంస్థల) చుట్టూ తిరుగుతోంది.
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ ఉత్కంఠ నెలకొంది.
అవినాష్ రెడ్డి ఇల్లు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇళ్లపై జరిగిన దాడుల్లో కేవలం 24 లక్షల క్యాష్, కొన్ని డాక్యుమెంట్లు మాత్రమే దొరికాయా? లేక ఈ దాడుల వెనుక ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేసే పెద్ద విషయం ఏమైనా జరగబోతోందా? అన్న చర్చ విస్తృతంగా సాగుతోంది.
టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ..!
దాదాపు ఏడేళ్ల తరువాత ఈడీ సోదాలు నిర్వహించిందంటే ఏం జరుగుతోంది?  ఆర్థిక లావాదేవీలు, మనీ ల్యాండరింగ్ కోణంలో ఈడీ ఎలాంటి కీలక ఆధారాలు సేకరించబోతోంది? అన్న విషయంపై ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు, ఏపీ కమ్మకార్పొరేషన్ చైర్మన్ అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 
వివాహ వేదిక దాదాపుగా వైసీపీ మినీ ప్లీనరీ జరుగుతోందా అనిపించేలా ఉంది.  ఈ వివాహ కార్యక్రమం దాదాపుగా పార్టీ అంతర్గత సమావేశాన్ని తలపింప చేసేదిగా మారిపోయింది.  ఇటీవల కాలంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఈ స్థాయిలో ఒకే వేదికపైకి రావడం ఇదే మొదటి సారి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.