ఆ ఎమ్మెల్యేలకు ఎదురు గాలి ..
Publish Date:Jun 5, 2022
Advertisement
గెలిచింది సైకిల్ గుర్తు పైన ... తిరుగుతోంది ఫ్యాన్ పార్టీతో .. నిజమే ఒక పార్టీ టికెట్ మీద గెలిచి మరో పార్టీకి అమ్మడు పోవడం రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు..దేశ రాజకీయల్లోనూ ఎప్పటినుంచో ఉన్నదే. అయితే ఇటీవల కాలంలో,ఎందుకనో ప్రజలు, పార్టీ ఫిరాయింపులను అంతగా పట్టిచుకోవడం లేదు. చివరకు,అనైతిక ఫిరాయింపులను నిరోధించేందుకు తెచ్చిన, ఫిరాయింపుల నిరోధక చట్టం కూడా ఫిరాయింపులను నిరోధించలేక పోతోంది. చట్టంలో ఉన్న చిల్లులను చక్కగా వినియోగించుకుని, గౌరవ ప్రజా ప్రతినిధులు.గోడలు దూకేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ పొరుగు రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మందికి పైగా ఎమ్మెల్యేలు తెరాస తీర్ధం పుచ్చుకున్నారు.అందులో ‘చేవెళ్ల చెల్లెమ్మ’ సబితా ఇంద్రారెడ్డి వంటి కొందరు మంత్రులు కూడా అయ్యారు. అలాగే, కర్ణాటక, మధ్య ప్రదేశ్, గోవా ఇలా అనేక రాష్ట్రాల్లో బీజేపీ ఫిరాయింపుల దారిలోనే ప్రజలు ఎన్నుకున్న ప్రభ్తుత్వాలను కూల్చివేసింది. సొంత ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. పరిపాలన సాగిస్తోంది.అలాంటి ఫిరాయింపులు అనైతికం, అప్రజాస్వామికం,ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకం అనే ప్రవచనాలు వినిపిస్తూనే రాజకీయ పార్టీలు అదే దారిలో అడుగులు వేస్తున్నాయి. ఇందులో మినహాయింపులు లేవు.అందరూ అదే తానూ ముక్కలు. అయినా ప్రజలు అంతగా పట్టించుకోవడం లేదు. ఫిరాయింపుదారులను,మళ్ళీ మళ్ళీ అందలం ఎక్కిస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిపిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే, ఈ నలుగురిలో ఒకరైన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నియోజకవర్గ సమన్వయ బాధ్యతల నుంచి స్వచ్చందంగా తప్పుకున్నారు. అప్పట్లో గణేష్ ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి వైసీపీకి మద్దతు ప్రకటించాక ఆయనకు విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలను అధినాయకత్వం అప్పగించింది. అప్పటికే అక్కడ మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ తనయుడు ద్రోణంరాజు శ్రీవాత్సవ పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. నామినేటెడ్ పదవి ఇవ్వడంతో పాటు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామన్న పార్టీ అధినాయకత్వం ఇప్పుడు ఈ ఎమ్మెల్యేకు బాధ్యతలు అప్పచెప్పడేమిటి’ అని శ్రీవాత్సవ వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటి పోరు వీధుల కెక్కింది. ఎందుకైనా మంచిదని, ముందు జాగత్త చర్యల్లో భాగంగా వాసుపల్లి గణేష్ వైసేపీ బాధ్యతలనుంచి తప్పుకున్నారని అంటున్నారు. ఇక గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంగతి చెప్పనే అక్కరలేదు. తెలుగు దేశం టికెట్’పై గెలిచి వైకాప అనుబంధ సభ్యుడిగా కొనసాగుతూ వచ్చిన వంశీ, మంత్రి (ప్రస్తుత మాజే) కొడాలి నానీతో కలిసి తెలుగు దేశం పార్టీ, చంద్రబాబు టార్గెట్’గా చిందులు వేశారు.అయితే, అదే సమయంలో స్థానిక వైసీపే నాయకులతో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. స్థానిక వైకాపా నేతలు యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రారావులు ఎమ్మెల్యేతో కయ్యానికి కాలు దువ్వుతూనే ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, సర్కార్ వారి సలహాదారు సజ్జల జోక్యం చేసుకున్నా, పరిస్థితిలో మార్పు రాలేదు. గోడ దూకిన ఎమ్మెల్యేతో కలిసి పనిచేసేదే లేదని స్థానిక నాయకులు అధినాయకత్వానికే తేల్చి చెప్పేశారు. ఇక చేసేది లేక అధినాయకత్వం కూడా వంశీని వదిలేసింది. దీంతో వంశీ రెంటికి చెడ్డ రేవడిలా దిక్కులు చూస్తున్నారు. చీరాల నియోజక వర్గం నుంచి టీడీపీ టికెట్ పై గెలిచిన కరణం బలరాం వైకాపాకు మద్దతు ప్రకటించారు. ఆయన కొడుకు వెంకటేష్ నియోజకవర్గంలో వైకాపా తరపున పనిచేసుకుంటున్నారు. మరోపక్క అదే నియోజకవర్గం నుంచి 2019లో వైకాపా తరపున పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ పోటీగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అధినాయకత్వం పలుమార్లు చర్చలు జరిపి ఆయనను పర్చూరుకు పంపించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. చీరాలలో కరణంకు కాకుండా మరొకరికి టికెట్ ఇస్తే తాను గెలిపిస్తానని ఆమంచి సీఎంకు చెప్పారు.మరోవంక క్షేత్ర సత్యిలో పరిస్థితులు ఎదురుతిరుగుతున్నాయి. గుంటూరు పశ్చిమలో చాపకింద నీరులా.. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ నియోజకవర్గంలో పూర్తి స్వేచ్ఛగా పనిచేయలేకపోతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చాపకింద నీరులా ఎమ్మెల్యేకి వైకాపా నేతల నుంచి సెగ తగులుతోందన్న భావన వ్యక్తమవుతోంది. 2019లో ఆయనపైన వైకాపా తరపున పోటీ చేసిన ఏసురత్నమే ఇప్పటికీ ఆ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉండడం, అధికార పార్టీ కీలక పదవిలో ఉన్న మరో నేత ప్రభావం ఇక్కడ ఉండడంతో ఎమ్మెల్యేకి అనుకూల పరిస్థితులు లేవంటున్నారు. ఇటీవల గడప గడపకి కార్యక్రమంలో ప్రభుత్వ పథకాలను తెలిపేలా ఏసురత్నం అనుచరులు ప్లకార్డులు పట్టుకుని తిరగడాన్ని తొలుత ఎమ్మెల్యే, ఆయన వర్గీయులు నివారించారు. ఆ తర్వాత నుంచి ఏసురత్నం గడప గడప కార్యక్రమానికీ దూరంగా ఉంటున్నారు. మొత్తానికి టీడీపీ టికెట్ పై గెలిచి ఫ్యాన్ పార్టీకి అనుబంధ సభ్యులుగా చేరిన ఎమ్మెల్యేలకు ఇటు జనంలో అటు పార్టీలో ఎదురు గాలులు వీస్తున్నాయి. అందుకే, ఆ నలుగురి రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకాగా మారిందని అంటున్నారు.
అయితే ఇప్పుడు ఏపీలో సీన్ మారుతోంది.టీడీపీ టిక్కెట్’పై ఎమ్మెల్యేలుగా గెలిచి వైసీపీ అనుబంధంగా కొనసాగుతున్ననలుగురు ఎమ్మెల్యేలకు సొంత నియోజక వర్గాల్లో ఎదురు గాలి వేస్స్తోంది. ఎక్కడికెళితే అక్కడ జనం నిలదీస్తున్నారు. మళ్ళీ వస్తే మర్యాద దక్కదని, ముఖం మీదనే తలుపులు వేస్తున్నారు. మరోవంక,అంతకంటే ఎక్కువ వ్యతిరేకతను ఎదుర్కుంటున్న వైసేపీ నాయకత్వం, తాను దూర కంత లేదు మెడకో డోలేందుకు అనుకుందో ఏమో, వీరి గోడు అసలు పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితిలో ఏమి చేయడమో పాలుపోక, చేసిన తప్పుకు చెంపలు వేసుకుని తిరిగి సొంత గూటి వైపు అడుగులు వేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/people-oppose-thouse-mlas-25-137082.html





