అడవిదొంగ పెద్దిరెడ్డి.. విజిలెన్స్ నివేదిక వెల్లడి!
Publish Date:Feb 10, 2025

Advertisement
వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుటుంబీకులందరూ అటవీ భూముల ఆక్రమణలో నిండా మునిగినట్లే. చట్టాలను పూర్తిగా ఉల్లంఘించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుటుంబీకులు అందరూ దశాబ్దాలుగా అటవీ భూములను ఆక్రమించి పర్యావరణ విధ్వంసానికి పాల్పడ్డారని విజిలెన్స్ నివేదిక తేటతెల్లం చేసింది. అటవీ భూముల ఆక్రమణ, పర్యావరణ విధ్వంసానికి పాల్పడిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబీకులపై అటవీ సంరక్షణ చట్టాల మేరకు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని సిఫారసు చేసింది. ఆ నివేదికలో పెద్దిరెడ్డి ఆయన కుటుంబీకుల మీద ఏయే సెక్షన్ల కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంది అన్న అంశంపై విజిలెన్స్ నివేదిక వివరంగా పేర్కొంది. పెద్దిరెడ్డి, యఆయన కుటుంబ సభ్యులపై విజిలెన్స్ నివేదిక సిఫారసుల ఆధారంగా చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమౌతోంది.
పుంగనూరు నియోజకవర్గంలోని మంగళం పడవల్లో పెద్దిరెడ్డి అటవీ భూముల కబ్జా వ్యవహారం వెలుగులోనికి వచ్చింది. అటవీ భూమిని ఆక్రమించి విలాసవంతమైన భవనం నిర్మించిన విషయం తేటతెల్లమైంది. అయితే అడవి మధ్యలో తాను భవనం నిర్మించిన భూమిని తాను ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేశానని, అక్కడ నిర్మించిన భవనం పనివాళ్ల కోసమని పెద్దరెడ్డి చెప్పారు. దీనిపై విచారణ జరిపిన అధికారులు ప్రజాధనంతో రోడ్డు వేసుకోవడం దగ్గర నుంచి మొత్తం ఎంత భూమి వారి అధీనంలో ఉంది.. ఎంత భూమి కబ్జా చేశారో లెక్కలు తేల్చారు. మొత్తం వివరాలతో నివేదిక సమర్పించారు.
పెద్దిరెడ్డి .. ఆయన కుటుంబం చేసిన అరాచకాలు ఇప్పుడు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జగన్ అడ్డగోలు విధానాలను అంతకంటే అడ్డగోలుగా అంగీకరించి ఆచరించి, ఆయన చెప్పినట్టలా చేసిన పెద్దరెడ్డి అందుకు ప్రతిఫలంగా దోపిడీకి లైసెన్స్ తీసున్నారా అన్నట్లుగా అన్ని రకాల నిబంధనలనూ తుంగలోకి తొక్కి యథేచ్ఛగా కబ్జాల పర్వం కొనసాగించారు. జగన్ అధికారంలో ఉన్నంత కాలం దోపిడీకి కాదే భూమి అనర్హం అన్నట్టుగా పెద్దిరెడ్డి ఆయన కుటుంబీకులూ రెచ్చిపోయారు. పెద్దిరెడ్డి కబ్జాల పర్వంలో మునిగి తేలుతూ ఉంటే.. ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డిమద్యం స్కాం మొత్తాన్ని తన కనుసన్నలలో నిర్వహించారు. ఇలా కబ్జాలతోనూ, కుంభకోణాలతోనూ అడ్డగోలుగా సంపాదించిన సొమ్ములో కొంత భాగాన్ని చిత్తూరుల తెలుగుదేశం పార్టీని ఉనికి కూడా లేకుండా చేయాలన్న కుట్రలను అమలు చేశారు. ఇందులో భాగంగానే చంద్రబాబుపై రాళ్ల దాడులు, హత్యాయత్నాల వెనుక పెద్దిరెడ్డి హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. మొత్తం మీద పెద్దరెడ్డి అటవీ భూముల ఆక్రమణ కేసుల్లోనూ, ఆయన కుమారుడు మిధున్ రెడ్డి మద్యం కుంభకోణం కేసులో బయట పడే అవకాశలు పెద్దగా కనిపించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/peddireddy-forest-lands-encrochment-true-39-192654.html












