Publish Date:Mar 13, 2025
విజయసాయి రెడ్డి ప్రతి మాటా, ప్రతి కదలికా.. వైసీపీ కాళ్ల కింద భూమిని కదిలించేస్తోంది. విజయసాయి రెడ్డి ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడతాడా అన్న టెన్షన్ వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. విజయసాయిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పేసి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసేని వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించిన తరువాత ఆయన ప్రతి కదలికా వైసీపీని గాభరాపెడుతూనే ఉంది. వైసీపీకి గుడ్ బై చెప్పేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన తరువాత ఆయన మొదటిగా కలిసింది వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిలను. ఇది కచ్చితంగా జగన్ ను ఇబ్బంది పేట్టే చర్యేననడంలో సందేహం లేదు.
Publish Date:Mar 13, 2025
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఆయనను ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకూ సస్పెండ్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Publish Date:Mar 13, 2025
ఈ నెల 13 నుంచి 18 వరకు తెలంగాణలో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. తెలంగాణలో గత కొన్ని రోజులుగా వింత వాతావరణం నెలకొంది. పగలు అధిక వేడి, రాత్రి చలి గాలులు, ఉదయం మంచు దుప్పట్లు కురవడం వంటి వాతావరణం ఉంది.
Publish Date:Mar 13, 2025
బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ పై సూర్యపేట పిఎస్ లో కేసు నమోదైంది. ఇటీవలె బెట్టింగ్ యాప్ ల ద్వారా యువత లక్షలాది రూపాయలను పోగొట్టుకున్నారు.
Publish Date:Mar 13, 2025
జగన్ హయాంలో పడకేసిన పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పుడు జోరందుకున్నాయి. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు తన మొదటి పర్యటన పోలవరం సందర్శనతోనే ప్రారంభించారు.
Publish Date:Mar 13, 2025
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె డాక్టర్ సునీత, అల్లురు రాజశేఖర్ రెడ్డిపై వివేకా పిఏ కృష్ణారెడ్డి పెట్టింది తప్పుడు కేసని పోలీసులు నిర్ధారించారు
Publish Date:Mar 13, 2025
దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీపగబట్టిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన పేరిట దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం చేకూరనుందని అన్నారు. తమకు అధికారం దక్కని దక్షిణాది రాష్ట్రాల పట్ల బీజేపీ కోపం పెంచుకుని వివక్ష చూపుతోందన్నారు. తమిళనాడు మంత్రి కేఎన్ నెహ్రూ, ఎంపీలు కనిమెళి, రాజాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గురువారం (మార్చి 13) సమావేశమయ్యారు.
Publish Date:Mar 13, 2025
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలం పని చేసిన నాగం జనార్ధన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజనకు ముందు తెలుగుదేశం పార్టీ కి దూరమయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు కేబినెట్ లో నాగం మంత్రిగా పని చేశారు.
Publish Date:Mar 13, 2025
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ నేతలపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే రాజాసింగ్ తాజాగా సొంత పార్టీలోని సీనియర్లు కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యారనేలా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఒక్క కాంగ్రెస్ అనేమిటి ఈ సీనియర్లు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో అంటకాగుతారని దుయ్యబట్టారు.
Publish Date:Mar 13, 2025
వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ప్రాణాలకు ముప్పు ఉంది రక్షణ కల్పించండంటూ కడప ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించాడు. ఈ మేరకు ఎస్పీకి లేఖ ఇచ్చాడు. గతంలో తనకు ఇచ్చిన భద్రతను పునరుద్ధరించాలని ఆ లేఖలో కోరాడు.
Publish Date:Mar 13, 2025
ఇంట్లో మగాళ్లు తాగుతుంటే మహిళలు గగ్గోలు పెడుతుండటం చూస్తూనే ఉంటాం. మందుబాబుల వీరంగాలతో గృహహింస కేసులు కామన్‌గా మారిపోతున్నాయి. అయితే అక్కడ మాత్రం సీన్ పూర్తిగా రివర్స్‌లో కనిపిస్తున్నది. ఆ గ్రామంలో మహిళలు మద్యానికి బానిసలు కావడంతో కుటుంబాలు నాశనమవుతున్నాయని అదే గ్రామానికి చెందిన పురుషులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Publish Date:Mar 13, 2025
తెలంగాణలో వరుసగా లిప్ట్ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నాంపల్లిలోని ఓ అపార్ట్ మెంట్ లిప్ట్ గోడ మధ్యలో చిక్కుకుని ఓ బాలుడు మృతి చెందాడు. జగిత్యాలలో సిరిసిల్లా 17వ బెటాలియన్ కమాండెంట్ గంగారాం (59)లిప్ట్ లో ఇరుక్కుని చనిపోయాడు.
Publish Date:Mar 13, 2025
గుండె నొప్పి డ్రామా ఫెయిలవ్వడంతో పోసాని ఇప్పుడు కొత్త డ్రామా మొదలు పెట్టారా? అంటే సీఐడీ కోర్టులో బుధవారం (మార్చి 12) పోసాని చేసిన ఆత్మహత్యే శరణ్యం వ్యాఖ్యలను బట్టి ఔననే సమాధానమే వస్తున్నదని పరిశీలకులు అంటున్నారు. పీటీ వారంట్ పై పోసానిని కర్నూలు జైలు నుంచి అదుపులోనికి తీసుకుని గుంటూరు సీఐడీ కోర్టులో హాజరు పరిచిన సందర్భంగా పోసాని న్యాయమూర్తి ఎదుట భోరు మన్నారు.